Don't Miss!
- Finance
DA Hike: ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. కరువు భత్యాన్ని పెంపు.. ఎంతంటే..?
- News
ఎమ్మెల్సీ తలశిల రఘురామ్ ఇంటికి వెళ్లిన జగన్ దంపతులు
- Sports
INDvsAUS : ఆసీస్‌కు అది అలవాటే.. అది వాళ్ల మైండ్ గేమ్.. అశ్విన్ ఘాటు రిప్లై!
- Travel
సందర్శకులను కనువిందుచేసే కొల్లేరు బోటు షికారు!
- Technology
వన్ ప్లస్ 11 స్పెసిఫికేషన్లు లీక్ ! లాంచ్ మరో రెండు రోజుల్లోనే ...!
- Lifestyle
Valentines Day 2023: వాలెంటైన్స్ డే రోజు ఈ పనులు అస్సలే చేయొద్దు, ఉన్న మూడ్ పోయి సమస్యలు రావొచ్చు
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
‘గల్లీ రౌడీ’ కొత్త రిలీజ్ డేట్ ప్రకటన: అప్పటి నుంచే సందడి చేయనున్న సందీప్ కిషన్
టాలీవుడ్‌లో ఉన్న టాలెంటెడ్ హీరోల్లో సందీప్ కిషన్ ఒకడు. అప్పుడెప్పుడో చిన్న పాత్రతో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన అతడు.. ఆరంభంలోనే అదిరిపోయే యాక్టింగ్‌తో ఆకట్టుకున్నాడు. అదే సమయంలో అందరి దృష్టిని ఆకర్షించాడు. దీంతో రిజల్ట్‌తో ఏమాత్రం సంబంధం లేకుండా ఒకదాని తర్వాత ఒకటి ఇలా వరుస పెట్టి ఎన్నో చిత్రాల్లో నటించాడు. సుదీర్ఘమైన కెరీర్‌లో మూడు నాలుగు హిట్లను మాత్రమే సొంతం చేసుకున్న ఈ యంగ్ హీరో.. చాలా రోజులుగా భారీ సక్సెస్ కోసం వేచి చూస్తున్నాడు. ఈ క్రమంలోనే ఎన్నో సినిమాలను ప్రేక్షకులకు అందిస్తూనే ఉన్నాడు.
బ్రా ఒక్కటే ధరించి విష్ణుప్రియ రచ్చ: ఇంతకు ముందెన్నడూ చూడనంత ఘాటు ఫోజులతో!
కెరీర్ ఆరంభంలో 'వెంకటాద్రీ ఎక్స్‌ప్రెస్'తో విజయాన్ని అందుకున్న సందీప్ కిషన్.. ఆ తర్వాత చాలా కాలానికి 'నిను వీడని నీడను నేనే'తో మరోసారి హిట్ ట్రాక్ ఎక్కాడు. దీని తర్వాత ఇటీవల 'ఏ1 ఎక్స్‌ప్రెస్'తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు సందీప్ కిషన్. ఈ చిత్రానికి హిట్ టాక్ వచ్చినా కలెక్షన్లను మాత్రం పెద్దగా రాబట్టలేకపోయింది. దీంతో ఈ మూవీ ఏవరేజ్‌గానే ముగిసింది. ఫలితంగా విజయం కోసం సందీప్ కిషన్ నిరీక్షణ కొనసాగుతూనే ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ఈ సారి ఎలాగైనా హిట్ కొట్టాలన్న పట్టుదలతో ఉన్నాడు. ఇందుకోసం ఇప్పుడు 'గల్లీ రౌడీ' అనే సినిమాతో రాబోతున్నాడు.

వినోదాత్మక చిత్రాల దర్శకుడిగా పేరొందిన జీ నాగేశ్వర్‌రెడ్డి దీన్ని తెరకెక్కించారు. చాలా రోజుల క్రితమే షూటింగ్‌ను పూర్తి చేసుకున్న ఈ మూవీని గతంలోనే విడుదల చేయాలని భావించారు. కానీ, కోవిడ్ సెకెండ్ వేవ్ కారణంగా అప్పుడు ఇది సాధ్య పడలేదు. దీంతో ఈ చిత్రాన్ని ఓటీటీలో రిలీజ్ చేస్తారన్న టాక్ వినిపించింది. కానీ, ఇటీవలే ఈ సినిమాను సెప్టెంబర్ 3న ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. కానీ, దీన్ని అప్పుడు కూడా విడుదల చేయలేదు. అదే సమయంలో ఈ సినిమాను వాయిదా వేస్తున్నట్లు యూనిట్ స్పష్టం చేసేసింది.
కొత్తలో నరకం అనుభవించా.. దానివల్ల పిల్లలు కూడా పుట్టరని భయపడ్డా: రోజా సంచలన వ్యాఖ్యలు
'గల్లీ రౌడీ' సినిమా కొత్త రిలీజ్ డేట్ గురించి చాలా రోజులుగా వార్తలు వస్తూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 17న విడుదల చేయబోతున్నారు. ఈ విషయాన్ని మూవీ యూనిట్ తాజాగా ప్రకటించింది. ఈ మేరకు ఓ పోస్టర్‌ను కూడా విడుదల చేసింది. దీని మీద హీరో, హీరోయిన్లతో పాటు రాజేంద్ర ప్రసాద్, బాబీ సింహా, వెన్నెల కిశోర్ పాత్రలకు సంబంధించిన లుక్స్ కూడా ఉన్నాయి. మొత్తానికి ఈ ప్రకటనతో సందీప్ కిషన్ అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. అదే సమయంలో ఈ సినిమా కోసం వాళ్లంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
ఫుల్ లెంగ్త్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా రాబోతున్న 'గల్లీ రౌడీ' మూవీపై అంచనాలు బాగానే ఉన్నాయి. విశాఖపట్నం బ్యాగ్‌డ్రాప్‌లో రూపొందిన ఈ చిత్రంలో సందీప్ కిషన్ తొలిసారి కామెడీ రోల్‌ను చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇక, ఈ సినిమాను కోన ఫిల్మ్ కార్పోరేషన్ సమర్పణలో విశాఖపట్నం ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ నిర్మిస్తున్నారు. ఇందులో నేహా శెట్టి హీరోయిన్ కాగా, బాబీ సింహా, రాజేంద్ర ప్రసాద్, వెన్నెల కిశోర్, హర్షలు కీలక పాత్రలు చేస్తున్నారు.