For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  TuckJagadish: ఎట్టకేలకు నోరు విప్పిన నిర్మాత.. నాని తప్పు లేదంటూనే మళ్ళీ కొత్త సందేహాలు!

  |

  గత రెండు రోజులుగా టాలీవుడ్ లో ఏదైనా హాట్ టాపిక్ గా నడుస్తుంది అంటే అది లవ్ స్టోరీ వర్సెస్ నాని టక్ జగదీష్. లవ్ స్టోరీ సినిమా సెప్టెంబర్ 10వ తేదీన వినాయక చవితి సందర్భంగా విడుదల చేస్తున్నామని ముందే ఆ సినిమా నిర్మాతలు ప్రకటించారు. అయితే అదే సమయానికి నాని నటించిన టక్ జగదీష్ సినిమా కూడా డిజిటల్ వేదికగా అదే రోజు రిలీజ్ కాబోతుంది అనే వార్తలు ప్రచారంలోకి రావడంతో పెద్ద వివాదం ఏర్పడింది. ఆ వివరాల్లోకి వెళితే

   లవ్ స్టోరీ వర్సెస్ నాని టక్ జగదీష్

  లవ్ స్టోరీ వర్సెస్ నాని టక్ జగదీష్

  శేఖర్ కమ్ముల దర్శకత్వంలో సాయి పల్లవి నాగచైతన్య జంటగా నటించిన చిత్రం లవ్ స్టోరీ. నిజానికి ఈ సినిమా కరోనా సెకండ్ వేవ్ కంటే ముందు విడుదల కావాల్సి ఉంది. అనూహ్యంగా కరోనా సెకండ్ వచ్చే అవకాశం ఉందని నిర్మాతలు భావించి అప్పటికప్పుడు సినిమాను వాయిదా వేయించారు. దీంతో సినిమాను సెప్టెంబర్ 10వ తేదీన రిలీజ్ చేస్తున్నామని ఈ మధ్యకాలంలో ప్రకటించారు.మరోపక్క నాని హీరోగా శివ నిర్వాణ దర్శకత్వంలో జగదీష్ సినిమా రూపొందింది. ఈ సినిమా కూడా కరోనా సెకండ్ కంటే ముందే విడుదల కావాల్సి ఉన్నా లవ్ స్టోరీ సినిమా వాయిదా వేసిన తర్వాత ఈ సినిమాను కూడా వాయిదా వేశారు. అయితే ఈ సినిమా థియేటర్లలో రిలీజ్ చేయకుండా ఓటీటీకి అమ్మేస్తున్నారు అని చాలా కాలంగా ప్రచారం జరుగుతూ వచ్చింది. నాని కూడా రెండు మూడు రోజుల క్రితం ఇదే అర్థం వచ్చేలాగా ఒక ప్రెస్ నోట్ విడుదల చేయడంతో తెలంగాణ ప్రాంతానికి చెందిన డిస్ట్రిబ్యూటర్లు ఒక ప్రెస్ మీట్ పెట్టి నాని ఏకిపారేశారు.

  క్షమాపణలు కూడా

  క్షమాపణలు కూడా

  నాని సహా ఈ సినిమా నిర్మాతలు కూడా వారు ఒక ఆట ఆడుకున్నారు. అయితే తర్వాత రోజు అంటే నిన్న కొంతమంది ఎగ్జిబిటర్లు వ్యక్తిగతంగా బాధపడి మాట్లాడి ఉంటే క్షమించాలని మా ఉద్దేశం ఎవరినీ కించపరచడానికి కాదు అని క్షమాపణ చెప్పే ప్రయత్నం చేశారు. ఇంత జరుగుతున్నా ఇప్పటివరకు నాని సినిమా యూనిట్ నుంచి ఎలాంటి స్పందన రాకపోయినా ఎట్టకేలకు నాని సినిమా నుంచి ఆ సినిమా నిర్మాతగా వ్యవహరిస్తున్న పెద్ది హరీష్ ప్రతిస్పందించారు.

  ఎట్టకేలకు స్పందించిన

  ఎట్టకేలకు స్పందించిన

  ఈ మేరకు ఆయన సినిమాకి సంబంధించిన నిర్మాణ సంస్థ అధికారిక సోషల్ మీడియా ద్వారా ఒక పెద్ద లేఖ విడుదల చేశారు. ఆ లేఖలో ఉన్న విషయం యధాతదంగా మీకందిస్తున్నాం. ''షైన్ స్క్రీన్స్ మంచి సినిమాలు అందించడం మరియు తెలుగు ప్రేక్షకులను వినోదాత్మకంగా ఉంచడం అనే దృష్టితో స్థాపించబడింది. మా విజయవంతమైన మజిలీ సినిమా తర్వాత, మేము నేచురల్ స్టార్ నాని గారితో టక్ జగదీష్‌ని ప్రారంభించాము. రెండున్నర సంవత్సరాలుగా మనం జాగ్రత్తగా పెంచి పోషించిన మా బిడ్డ ఈ టక్ జగదీష్‌ సినిమా'' అని లేఖలో పేర్కొన్నారు.

  రెండేళ్ళ మా బిడ్డ

  రెండేళ్ళ మా బిడ్డ

  టక్ జగదీష్‌ సినిమా గత ఏడాది డిసెంబర్‌లో పూర్తయింది. మేము దీనిని వేసవికి విడుదల చేయాలనుకున్నాము, కానీ కోవిడ్ యొక్క రెండవ వేవ్ ఈ సినిమా రిలీజ్ విషయంలో అడ్డుపడింది. రెండో వేవ్ తర్వాత కూడా, వివిధ సమస్యలు ఇంకా కంట్రోల్ లో లేనందున కొన్ని విషయాలు క్లారిటీ లేకుండానే ఉన్నాయి. అంతేకాకుండా, ఈ డిజిటల్ యుగంలో ఇంత కాలం కంటెంట్‌ని కాపాడుకోవడం అంత సులభం కాదు. పరిస్థితులు ఎప్పుడు సాధారణ స్థితికి వస్తాయనే విషయంలో చాలా సందిగ్ధతతో, మేము నాని గారిని సంప్రదించి, మా ముందు వేరే మార్గం లేనందున, నాన్ థియేట్రికల్ విడుదల కోసం ఒప్పించామని అన్నారు. అయితే నాని థియేట్రికల్ విడుదల గురించి ప్రత్యేకంగా చాలా స్పష్టంగా ముందే చెప్పినందున మొదట్లో అయిష్టంగా ఉండేవాడని. కానీ, తర్వాత నాని మా పరిస్థితిని అర్థం చేసుకున్నాడని వెల్లడించారు.

  మాకు సహకరిస్తారని ఆశిస్తున్నా

  మాకు సహకరిస్తారని ఆశిస్తున్నా

  నిర్మాతల సమస్యలను పరిగణనలోకి తీసుకున్నందుకు ఆయన సినిమా డిజిటల్ రిలీజ్ కి అంగీకరించాడు. నాని చేసిన ఈ పనికి మేము హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నాము. మరియు మా డైరెక్టర్ కూడా మా సమస్యలను అర్థం చేసుకుని, మా అభ్యర్థనను అంగీకరించారని అన్నారు. మేము ఫిల్మ్ మేకింగ్‌పై మక్కువ చూపుతామని, పెద్ద స్క్రీన్‌లలోనే ఆ వినోదం కోసం ఎల్లప్పుడూ కోరుకుంటామని అన్నారు. అయితే మా ప్రధాన లక్ష్యం ఇప్పుడు మా టక్ జగదీష్‌కు 100% చేరువ కావడమే. అందరూ అర్థం చేసుకుని మాకు సహకరిస్తారని ఆశిస్తున్నామని అంటూ లేఖలో పేర్కొన్నారు.

  Actor Nani Biography వివాదాలను హుందా గా ఎదుర్కున్న స్టార్!! || Filmibeat Telugu
  అయినా క్లారిటీ ఇవ్వలేదుగా

  అయినా క్లారిటీ ఇవ్వలేదుగా

  అయితే అనూహ్యంగా సినిమాను డిజిటల్ వేదికగా రిలీజ్ చేస్తున్నాము అని చెబుతూనే ఎప్పుడు ? ఎక్కడ ? ఎలా ? అనే విషయాల మీద మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. అసలు ఈ వివాదం అంతా ఏర్పడింది సెప్టెంబర్ 10వ తేదీన సినిమా విడుదల చేస్తున్న అందుకే కానీ ఇప్పుడు మాత్రం హరీష్ పెద్ది సినిమా ఎప్పుడు రిలీజ్ చేస్తున్నాము అనే విషయం మీద క్లారిటీ ఇవ్వలేదు. ఇండస్ట్రీ వర్గాల లో జరుగుతున్న ప్రచారం మేరకు ఒక్కసారి అమెజాన్ ప్రైమ్ సంస్థకు లేదా ఏదైనా ఓటీటీ సంస్థకు అమ్మి వేస్తే సినిమా ఎప్పుడు విడుదల చేయాలి అనే విషయాలు మన చేతిలో ఉండవని ఆ హక్కులన్నీ సదరు సంస్థకు చెందుతాయి అని అంటున్నారు. దీంతో లవ్ స్టోరీ సినిమా మరో వారం వెనక్కి వాయిదా పడే అవకాశాలు కనిపిస్తున్నాయి

  English summary
  After a huge controversy on tuck jagadish digital release finally producer harish peddi opens up on the issue.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X