పది తలలు కాదు.. మూడు చాలూ.. పోకిరి పోలీస్ విక్రమ్ మాటల తూటాలు!
15 సంవత్సరాల క్రితం వీరి కాంబినేషన్‌లో వచ్చిన 'సామి' చిత్రం ఘన విజయం సాధించిన విషయం అందరికీ తెలిసిందే. ఆ చిత్రానికి సీక్వెల్‌గా వస్తున్న 'సామి స్క్వేర్' చిత్రాన్ని తెలుగులో 'సామి'గా విడుదల చేస్తున్నారు. ఈ చిత్రంలో చియాన్ విక్రమ్ సరసన మహానటి కీర్తి సురేష్ నటిస్తున్నది.
హరి దర్శకత్వంలో, రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ సంగీత సారథ్యంలో రూపుదిద్దుకున్న చిత్రం 'సామి' చిత్రంలో ఇంకా ఐశ్వర్య రాజేష్, బాబీ సింహా, ప్రభు తదితరులు ఇతర పాత్రలలో నటించారు.
తెలుగులో వస్తున్న సామి ట్రైలర్‌లో విక్రమ్ పవర్‌ఫుల్ డైలాగ్స్ అదరొట్టారు. యాక్షన్‌తో విలన్లను ఆటాడుకొన్నట్టు తెలుస్తున్నది.
'మత్స్యస్వామి, కూర్మస్వామి, వరాహస్వామి, నరసింహస్వామి, రావణ స్వామి, పరశురామస్వామి' అంటూ విక్రమ్ డైలాగ్స్ మరో పవర్‌పుల్ స్టోరితో పోలీస్ సినిమా రాబోతున్నదనే విషయం స్పష్టమైంది.

ట్రైలర్‌లో విలన్ మాట్లాడుతూ 'పది తలలు ఉన్న రాక్షసరాజును' అంటే నాకు కావాల్సింది మూడు తలలు అని విక్రమ్ చెప్పిన డైలాగ్ ఆకట్టుకొంటున్నది. చివరికి నేను పోలీసు కాదు.. పోకిరి' అంటూ డైలాగ్‌ను తూటాల పేల్చడం గమనార్హం.


Click it and Unblock the Notifications











