twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Vishal: కథ నచ్చితే కౌగిలించుకుంటా.. లేకుంటే చితక్కొడతా.. షాకింగ్ గా విశాల్ కామెంట్స్

    |

    తమిళ స్టార్ హీరో విశాల్ కు తెలుగులోనూ మంచి మార్కెట్ ఉంది. అందుకే ఆయన ప్రతి సినిమాను తెలుగులో కూడా విడుదల చేస్తుంటారు. అంతేకాకుండా ఆయనకు టాలీవుడ్ లో కూడా ఫ్యాన్స్ ఉన్నారు. సామాజిక అంశాలపై ఎక్కువగా సినిమాలు చేసే విశాల్ తాజా చిత్రం లాఠీ. యాక్షన్ ఎంటర్టైనర్ గా ప్రేక్షకుల ముందుకు వస్తున్న లాఠీ సినిమాలో విశాల్ పోలీస్ గా నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ లో విశాల్ పలు సార్లు గాయాలపాలు కూడా అయ్యారు. అవంతరాలు దాటుకుని ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు వస్తున్న లాఠీ సినిమా టీజర్ లాంచ్ ఈవెంట్ హైదరాబాద్ లో జరిగింది. ఈ కార్యక్రమంలో కథలో విషయం గురించి విశాల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

    సేవా కార్యక్రమాలు కూడా..

    సేవా కార్యక్రమాలు కూడా..

    తమిళ హీరో విశాల్ కు తెలుగులో కూడా మంచి పాపులారిటీ ఉంది. సామాజిక అంశాలపై ఎక్కువగా సినిమాలు తెరకెక్కిస్తూ తనదైన శైలీలో ముందుకు సాగుతున్నాడు హీరో విశాల్. దాదాపుగా ఆయన సినిమాలన్నీ తెలుగులో డబ్ అవుతుంటాయి. అందులో కొన్ని బ్లాక్ బస్టర్ హిట్ కూడా సాధించాయి. సినిమాలతోపాటు విశాల్.. సేవా కార్యక్రమాలు కూడా చేస్తుంటారు. ఇలా ఆయనకు ప్రజల్లో మంచి క్రేజ్ ఏర్పడింది.

    యువన్ శంకర్ రాజా సంగీతం..

    యువన్ శంకర్ రాజా సంగీతం..

    ఇటీవల అభిమన్యు, యాక్షన్, ఎన్మీ చిత్రాలతో అలరించిన విశాల్ ఇప్పుడు లాఠీ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఏ వినోద్ కుమార్ దర్శకత్వంలో రానా ప్రొడక్షన్స్ పై రాబోతున్న హై ఆక్టేన్ యాక్షన్ ఎంటర్టైనర్ గా లాఠీ చిత్రాన్ని తెరకెక్కించారు. రమణ, నంద సంయుక్త నిర్మాణంలో భారీగా తెరకెక్కిస్తున్నారు. లాఠీ సినిమాలో విశాల్ కు జోడిగా సునయన నటించగా యువన్ శంకర్ రాజా సంగీతం అందించారు.

    కథల సెలెక్షన్ తదితర అంశాలపై..

    కథల సెలెక్షన్ తదితర అంశాలపై..

    విశాల్ లాఠీ సినిమాను డిసెంబర్ 22న తెలుగు, తమిళం, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో పాన్ ఇండియా చిత్రంగా విడుదల చేయనున్నారు. ఈ సినిమా టీజర్, ఫస్ట్ సింగిల్, గ్లింప్స్ లాంచింగ్ ఈవెంట్ ను హైదరాబాద్ లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కథల సెలెక్షన్ తదితర అంశాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు విశాల్. "నేను జీవితంలో చాలా కింద స్థాయిలో ఉండే కష్టాలను చూశాను. అలాగే గొప్పవాళ్లు పొందే ఆనందాన్ని చూశాను. స్కూల్, కాలేజీల్లో చెప్పే పాఠాల కంటే సినిమా నేర్పించే పాఠాలు చాలా గొప్పవి.

    రూ. 10 వేలు మాత్రమే..

    రూ. 10 వేలు మాత్రమే..

    నేను చాలా కష్టపడ్డానని చెప్పింది నేను చేసిన తప్పుల వల్ల కాదు. కొందరు నిర్మాతల వల్ల నష్టపోయాను. దీంతో విశాల్ ఫిల్మ్ ఫ్యాక్టరీ (VFF) పెట్టాను. నిజానికి అది వెంజెన్స్ (ప్రతికారం) ఫిల్మ్ ఫ్యాక్టరీ. అప్పుడు నా దగ్గర రూ. 10 వేలు ఉన్నాయి. ఛాంబర్ లో అంత అమౌంటే కట్టాలి. నేను నమ్మే దేవుడే నన్ను నడిపించాడు. నాకు మొదటి నుంచి ఒక అలవాటు ఉంది.

     లోపలికి రమ్మని కొడతా..

    లోపలికి రమ్మని కొడతా..

    నా దగ్గరకు వచ్చి ఎవరైనా కథలను రికమండ్ చేస్తే.. అది బాగుంటే వెంటనే వాళ్లను కౌగిలించుకుంటాను. నచ్చకపోతే లోపలికి రమ్మని నటించి.. తలుపులు వేసి మరి చితక్కొడతాను. కానీ ఈ లాఠీ కథ నాకు చాలా నచ్చింది. మీ అందరికీ కూడజా నచ్చుతుంది. నా ప్రతి సినిమాలానే.. ఈ సినిమాను ఎంతమంది చూస్తారో ఆ డబ్బుల్లో ఒక టికెట్ కు ఓ రూపాయి చొప్పున రైతులకు ఇస్తాను" అని విశాల్ తెలిపారు.

    English summary
    Kollywood Hero Vishal Shocking Comments About Story Selection And VFF Production In Lathi Movie Teaser Launch Event At Hyderabad
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X