twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఆలోచనాత్మకంగా ‘హాఫ్ గర్ల్ ఫ్రెండ్’ (వీడియో)

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: షార్ట్ ఫిల్మ్.....వినడానికి ఈ పేరు చిన్నగా ఉన్నా ఈ ఇంటర్నెట్ కాలంలో ప్రతిభను నిరూపించుకోవడానికి యువ దర్శకులకు పెద్ద సాధనంగా మారింది. రామ్ గోపాల్ వర్మ లాంటి వారు కూడా మెయిన్ స్ట్రీమ్ సినిమాలను వదిలి షార్ట్ ఫిలింస్ మీద పడ్డారంటే విషయం అర్థం చేసుకోవచ్చు.

    ఈ మధ్య కాలంలో యూట్యూబులో కుప్పలు తెప్పలుగా షార్ట్ ఫిలింస్ వచ్చి పడుతున్నాయి. అయితే అందులో కొన్ని మాత్రం ఆలోచనాత్మకంగా, విభిన్నంగా, సామాజిక పరిస్థితులను, యువత పోకడలకు అద్దం పట్టే విధంగా ఉంటున్నాయి. ఇటీవల యూట్యూబులో విడుదలైన ‘హాఫ్ గర్ల్ ఫ్రెండ్' అనే షార్ట్ ఫిల్మ్ ఆలోచనాత్మకంగా అందరినీ ఆకట్టుకుంటోంది.

    ‘హాఫ్ గర్ల్ ఫ్రెండ్' అనేది చేతన్ భగత్ రాసిన బుక్ కాదు, అదే పేరు తో జయశంకర్ అనే కుర్రాడు తీసిన షార్ట్ ఫిలిం. ఈ షార్ట్ ఫిలిం కథ, మరియు టేకింగ్ టాక్ అఫ్ ఆకర్షణీయంగా ఆలోచనాత్మకంగా ఉంది. సిగ్మాండ్ ఫ్రాయిడ్ సిద్ధాంతం‌తో రూపొందిన ఈ షార్ట్ ఫిలింకి యూట్యూబ్‌లో మంచి ఆదరణ లభిస్తోంది.

    కథ విషయనికి వస్తే వరుణ్ అనే కుర్రాడికి ఫేస్‌బుక్‌లో అమ్మాయిల‌తో చాటింగ్ చెయ్యడం అలవాటు. అలా సంజన అనే అమ్మాయి తో పేస్ బుక్ లో పరిచయం చేసుకొని తన రూమ్ కి పిలుస్తాడు. వరుణ్ రూమ్‌లోకి వచ్చిన సంజన‌కి వాళ్ళ అమ్మకు కాల్ చేస్తుంది, నేను ముఖ్యమయిన ప్రాజెక్ట్ వర్క్‌లో ఉన్నాను, మళ్ళీ కాల్ చేస్తా అని కట్ చేస్తుంది ..తర్వాత వాళ్ళ మద్య రొమాన్స్ జరుగుతుంది.

     Half Girlfriend Telugu Short Film 2014

    వినడానికి చాలా నార్మల్ గా ఉన్న ఈ స్టొరీ‌కి డైరెక్టర్ తనదైన సృజనాత్మకత జోడించాడు. వరుణ్ తన ఫ్రెండ్‌తో మాట్లాడుతున్నపుడు సిగ్మాండ్ ఫ్రాయిడ్ కాఫి కప్పు మరిము పక్కన కాలుతున్న సిగరేట్ చూపెట్టడం అతని క్రియేటివిటీకి నిదర్శనం. ఎందుకంటే సిగ్మాండ్ ఫ్రాయిడ్ 24 గంటలు "మానవుడు సెక్స్ గురించి ఆలోచిస్తాడు" అని చెప్పాడు. వరుణ్ ఫోన్‌లో ఫ్రెండ్ తో అలా౦టి విషయాలే చర్చిస్తాడు. అలా ఆలోచిస్తే సిగరెట్‌లా ఎప్పటికయినా కాలి పోవలిసిందే అని మొదటి షాట్ లో డైరెక్టర్ వార్నింగ్ ఇస్తాడు నేటి యువత‌కి.

    తర్వాత సంజన వరుణ్ రూమ్‌కి వచ్చాక ఆమె చెప్పే డైలాగ్స్ ఆకట్టుకునే విధంగా ఉన్నాయి. మనకి సంతోషం, సుఖం ఇచ్చేవి ఈ సొసైటీ కి ఎప్పుడు తప్పే అని ఆమె డైలాగ్ చెబుతున్నపుడు....సిగరేట్ యాష్ ని చూపడం, వరుణ్ అండ్ సంజన‌ల మధ్య రొమాన్స్ జరుగుతున్నడు ‘వాట్ యంగ్ ఇండియా వాంట్స్' బుక్ చూపెట్టడం, బుక్ చుట్టూ మందు బాటిల్స్, డ్రగ్స్, కండోమ్, సిగరేట్ చూపి నేటి యువత ఇలాంటివి కోరుకుంటున్నారు అని దర్శకుడు ఆలోచనాత్మకంగా చెప్పే ప్రయత్నం చేసాడు. తర్వాత గోడ మీద al pacino ఫోటో మీద I kept Calm అని ఉండటం డైరెక్టర్ ప్రతిభ‌కి చిహ్నం.

    ఈ తతంగం పూర్తయిన తర్వాత..... 3 గంటలకు రావాల్సిన వరుణ్ చెల్లలు 6 గంటలకు వస్తుంది. ఎక్కడికి వెళ్ళవు అని వరుణ్ అడుగితే "ముఖ్యమైనన ప్రాజెక్ట్ వర్క్" కోసం ఫ్రెండ్ ఇంటికి వెళ్లాను అని చెపుతుంది. వరుణ్ ఒకసారిగా షాక్ అవుతాడు. అపుడు సంజన తన అమ్మ తో చెప్పిన విషయం గుర్తు వస్తుంది.

    వరుణ్ తన ఫేస్ బుక్‌ని క్లోజ్ చేయడం. karma will get back to u అని కాఫీ కప్పుకి మరో సైడ్ ఉండటం. అది చూసి వరుణ్ షాక్ అవ్వడం. తన రూమ్‌కి వెళ్ళిన వరుణ్ చెల్లెలు తన బాయ్ ఫ్రెండ్‌తో చాటింగ్ మొదలు పెట్టడంతో షార్ట్ ఫిలిం ఎండ్ అవుతుంది. నువ్వు ఏం చేసినా దాని పర్యవసానాలు నీకు మళ్లీ కనిపిస్తాయి అంటూ కర్మ సిద్ధాంతాన్ని గుర్తు చేసాడు దర్శకుడు. డేటింగులు, చాటింగులు అంటూ పాశ్చాత్యధోరణికి అవాటు పడుతున్న యువత ధోరణికి అద్దం పట్టే విధంగా ఆలోచనాత్మకంగా ఈ షార్ట్ ఫిల్మ్ తెరకెక్కించిన జయశంకర్ ఒక మంచి డైరెక్టర్ కావాలని బెస్టాప్ లక్ చెబుదాం.

    English summary
    Watch: Half Girlfriend Short Film. Directed by Jayashankarr.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X