రూ. 2కోట్లు: హైదరాబాద్‌లో సల్మాన్ చెల్లి లవ్ మ్యారేజ్
హైదరాబాద్: బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ సోదరి అర్పిత ఖాన్ ప్రేమ వివాహం చేసుకోబోతోంది. ఢిల్లీకి చెందిన ఆయుష్ శర్మతో అర్పిత ఖాన్ గత కొంత కాలంగా ప్రేమవ్యహారం నడుపుతోంది. ఇద్దరూ ఈవిషయాన్ని ఇంట్లోవారికి చెప్పి పెళ్లికి గ్రీన్ సిగ్నల్ తీసుకున్నారు. ఇరు కుటుంబాల అంగీకారంతో వివాహం జరుగబోతోంది.
విశేషం ఏమిటంటే....అర్పిత ఖాన్ వివాహం హైదరాబాద్‌లోని చారిత్రాత్మక ఫలక్‌నుమ ప్యాలెస్‌లో జరుగనుంది. రెండు రోజుల పాటు ఎంటైర్ హోటల్ సల్మాన్ బుక్ చేసారు. ఇటీవల సల్మాన్ కుటుంబ సభ్యులు కొందరు హైదరాబాద్ వచ్చి ఇక్కడి ఏర్పాట్లను పర్యవేస్తున్నారు. రెండు రోజుల ఈ వేడుక కోసం కేవలం ప్యాలెస్‌ను వాడుకున్నందుకు రూ. 2 కోట్లు చెల్లిస్తున్నట్లు సమాచారం.

నవంబర్ 18వ తేదీన ఈ వివాహ వేడుక జరుగనున్నట్లు తెలుస్తోంది. సల్మాన్ ఖాన్ సోదరి వివాహం అత్యంత ఆర్భాటంగా జరిపేందుకు కుటుంబ సభ్యులు ప్లాన్ చేస్తున్నారు. దేశంలోని ప్రముఖులంతా ఈ వివాహ వేడుకకు హజరు కానున్నారు. కోట్లాది రూపాయల ఖర్చుతో ఈ వివాహం జరుగబోతోంది. తన ముద్దుల చెల్లిలి కోసం ఎంత ఖర్చయినా చేయడానికి వెనకాడటం లేదట సల్మాన్. హిందూ, ముస్లిం సాంప్రదాయం ప్రకారం ఈ వివాహం జరుగనుంది.
ఈ వివాహ వేడుకకు దేశ వ్యాప్తంగా 250 ప్రముఖులకు ఆహ్వానం అందినట్లు సమాచారం. సల్మాన్ ఖాన్ ఫ్యామిలీ ఫ్రెండ్ అయిన వెంకటేష్ కూడా ఈ ఆహ్వానం అందుకున్నారు.


Click it and Unblock the Notifications











