twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ‘సచిన్’ ఎ బిలియన్ డ్రీమ్స్.... ఇది సినిమా కాదు, క్రికెట్ గాడ్ లైఫ్! (రివ్యూ)

    అత్యంత పిన్న వయసులో ఇంటర్నేషనల్ క్రికెట్లోకి అడుగు పెట్టిన సచిన్ కోట్లాది మంది ఆరాధించే క్రికెట్ దేవుడిగా ఎలా అవతరించాడు?

    By Bojja Kumar
    |

    Rating:
    2.0/5
    Star Cast: సచిన్ టెండూల్కర్, మయూర్ మోర్, మయురేష్ ప్రేమ్
    Director: జేమ్స్ ఎర్స్‌కైన్

    ఇండియా అంటే క్రికెట్... క్రికెట్ అంటే ఇండియా. ఇక్కడ ఎన్ని మతాలు ఉన్నా అందరి అభిమతం ఒక్కటే.... అదే క్రికెట్. ఈ ఆటను నరనరాన జీర్ణించుకున్న ఈ దేశంలో క్రికెట్‌ను మతంగా ఆరాధించడం చూసి ప్రపంచమే ఆశ్చర్యపోయింది. ఇలాంటి చోట కోట్లాది మంది క్రికెట్ అభిమానుల దేవుడుగా అవతరించాడు సచిన్ టెండూల్కర్.

    ఇండియన్ క్రికెట్‌కు వరంగా లభించిన ప్లేయర్స్ ఎవరు? అంటే.... ప్రతి భారతీయుడి నోట వినిపించే మొదటి పేరు సచినే అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. అత్యంత పిన్న వయసులో ఇంటర్నేషనల్ క్రికెట్లోకి అడుగు పెట్టిన సచిన్ కోట్లాది మంది ఆరాధించే క్రికెట్ దేవుడిగా ఎలా అవతరించాడు? అసలు సచిన్ క్రికెట్ జీవితం ఎలా మొదలైంది, ఈ స్థాయికి రావడానికి దోహదన పడిన అంశాలను ఒక చోట పేర్చి నిర్మించిన చిత్రమే 'సచిన్-ఎ బిలియన్ డ్రీమ్స్'.

    సచిన్

    సచిన్

    సచిన్ బయోపిక్ సినిమాగా వస్తుందనే విషయం తెలియగానే..... కోట్లాది మంది అభిమానుల్లో ఎన్నో అంచనాలు, ఎన్నో ఆశలు. సచిన్ గురించి తెలియని ఎన్నో విషయాలు తెలుసుకోవచ్చనే తపన, ఒక రకమైన ఉత్కంఠ.

    సినిమానా? డాక్యుమెంటరీనా?

    సినిమానా? డాక్యుమెంటరీనా?

    ఇప్పటికే క్రికెటర్లు ఎంఎస్ ధోనీ, అజారుద్దీన్ బయోగ్రఫీల మీద సినిమాలు వచ్చాయి. అయితే ఆయా సినిమాల్లో వారి వారి పాత్రల్లో బాలీవుడ్ నటులు నటించారు. అయితే సచిన్ సినిమాలో నటించేది సచినే కావడంతో అసలు ఈ సినిమా ఎలా ఉండబోతోంది? ధోని సినిమా మాదిరి రెగ్యులర్ సినిమా ఫార్మాట్లో దీన్ని తెరకెక్కిస్తారా? లేక డాక్యుమెంటరీ తరహాలో ఉంటుందా? ఇలా అనేక సందేహాలు.

    రియల్ పుటేజీ

    రియల్ పుటేజీ

    వాస్తవంగా చెప్పాలంట.... ‘సచిన్-ఎ బిలియన్ డ్రీమ్స్' సినిమా ఫార్మాట్లో తెరకెక్కించలేదు. సచిన్ చిన్నతనం నుండి అతడి రిటైర్మెంట్ వరకు జరిగిన సంగతులను ఒక క్రమ పద్దతిలో పేర్చి డాక్యుమెంటరీ తరహాలో తెరకెక్కించారు. ఎక్కువ శాతం సచిన్ జీవితంలోని రియల్ పుటేజీనే సినిమాలో పొందుపరిచారు.

    క్రికెటర్ గా ఎదిగిన వైనం

    క్రికెటర్ గా ఎదిగిన వైనం

    సినిమా ఎలా సాగింది అనే విషయాలను పరిశీలిస్తే.... సచిన్ ఆరేళ్ల వయసున్నప్పటి నుండి సినిమా మొదలవుతుంది. తన చిన్న తనంలో అల్లరి చిల్లరగా ఉండే బాలుడు ఇంత గొప్ప క్రికెటర్ గా ఎలా అవతరించాడు? చిన్నపుడు క్రికెట్ కంటే టెన్నిస్ ఇష్టపడే ఆ కుర్రాడు ఇటు వైపుగా ఎలా టర్న్ అయ్యాడు? దేశం గర్వించదగ్గ క్రికెటర్ అవ్వడానికి దోహద పడిన వ్యక్తులు, పరిస్థితులు ఏమిటి అనేది చాలా కూలకషంగా ఇందులో చూపించారు.

    అంజలి ప్రేమ వ్యవహారం, కుటుంబం

    అంజలి ప్రేమ వ్యవహారం, కుటుంబం

    దీంతో పాటు సచిన్, అంజలి ప్రేమ వ్యవహారం, సచిన్ కుటుంబం.... స్నేహితులతో అతడి రిలేషన్ షిప్ ఎలా ఉంటుంది అనే కోణాలను కూడా సినిమాలో ఫోకస్ చేసారు. వాటితో పాటు సచిన్ జీవితంలో అత్యంత ఆనంద క్షణాలు, క్లిష్టమైన పరిస్థితులు ఏమిటో కూడా ఇందులో చూపించారు.

    వరల్డ్ కప్ కోసం

    వరల్డ్ కప్ కోసం

    16 ఏళ్ల వయసులో ఇంటర్నేషనల్ క్రికెట్ లోకి అడుగు పెట్టిన సచిన్.... క్రికెట్ ప్రపంచంలో ఎవరూ సాధించని పరుగుల రికార్డులు, అవార్డులు, రివార్డులు సాధించారు. అయితే ఎన్ని సాధించినా సచిన్‌ను చాలా కాలం వేధించిన అంశం వరల్డ్ కప్. అది మిస్సయిన ప్రతి సారి సచిన్ పడ్డ మనో వేదన.... ఇలా ప్రతి అంశాన్ని సినిమాలో ఫోస్ చేసారు.

    మ్యాచ్ ఫిక్సింగ్

    మ్యాచ్ ఫిక్సింగ్

    దీంతో పాటు ఇండియన్ క్రికెట్ చరిత్రలో అత్యంత దుర్భరమైన అంశం.... మ్యాచ్ ఫిక్సింగ్. అప్పట్లో పలువురు క్రికెటర్లు మ్యాచ్ ఫిక్సింగులో దోషులుగా తేలి నిషేదానికి గురైన సంగతి తెలిసిందే. అపుడు సచిన్ పరిస్థితి ఏమిటి? అనేది కూడా ఇందులో చూపించారు.

    విమర్శల కాలంలో

    విమర్శల కాలంలో

    ఇండియన్ క్రికెట్ చరిత్రలో సచిన్ అందరికంటే బాగా ఆడిన ప్లేయర్ మాత్రమే కాదు...ఎక్కువ రోజులు ఆడిన ప్లేయర్ కూడా. అయితే ఒకానొక సందర్భంలో సచిన్ ఆట స్థాయి పడిపోవడం, అతడు ఇక రిటైర్మెంట్ తీసుకోవాలని, కొత్తవారికి అవకాశం ఇవ్వాలనే డిమాండ్లు, విమర్శలు కూడా వచ్చాయి. తనకంటే, కుటుంబం కంటే కూడా క్రికెట్ ఆటనే ఎక్కువగా ప్రేమించి, క్రికెటే శ్వాసగా జీవించిన సచిన్..... ఆ పరిస్థితుల్లో ఏం చేసాడు? తన చేతులతో వరల్డ్ కప్ అందుకునే వరకు ఇండియన్ క్రికెట్ టీంలో ఎలా మనుగడ సాగించాడు అనేది తెరపై చూడాల్సిందే.

    అజారుద్దీన్ తో విబేధాలు

    అజారుద్దీన్ తో విబేధాలు

    ఇక సచిన్ జీవితంలో అత్యంత వివాదస్పదమైన అంశం అజారుద్దీన్‌తో అతడి సంబంధాలు. అప్పట్లో సచిన్-అజారుద్దీన్ మధ్య అస్సలు పడటం లేదనే రూమర్స్ అనేకం వచ్చాయి. సచిన్ కు కెప్టెన్సీ వచ్చాక ఈ వ్యవహారం మరింత ముదిరింది. జట్టుల్లో అందరూ కలిసి కట్టుగా ఆడటం లేదని కెప్టెన్ గా సచిన్ చేసిన కామెంట్స్ అజారుద్దీన్ ను ఉద్దేశించి చేసినవే అనే వాదన. మరి దీనిపై సచిన్ సినిమాలో ఎలాంటి వివరణ ఇచ్చారు అనేది కూడా తెరపై చూడాల్సిందే.

    దర్శకత్వం

    దర్శకత్వం

    జేమ్స్ ఎరిక్సన్.... సచిన్ బయోగ్రపీని అభిమానులకు వివరించిన తీరు ఆకట్టుకుంది. అరటిపండు ఒలిచి చేతిలో పట్టినట్లు సచిన్ జీవిత విశేషాలను ఒక అద్భుతమైన నేరేషన్‌తో అందించారు. ఇండియాలో క్రికెట్ అంటే అభిమానం ఏ రేంజిలో ఉంటుందే అంశాలతో పాటు, సచిన్ కు ఇక్కడ ఉన్న ఫాలోయింగుతో పాటు సచిన్ పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ విశేషాలను బాగా చూపించాడు.

    సంగీతం

    సంగీతం

    ఏఆర్ రెహమాన్ సంగీతం..... ఈ సినిమాకు మరో హైలెట్. సినిమాలో పాటు లేక పోయినా ఆయా సన్నివేశాలను ఎలివేట్ చేస్తూ ఆయన అందించిన బ్యాగ్రౌండ్ స్కోర్ భావోద్వేగాలు పండటంలో ఎంతగానో దోహద పడింది.

    చివరగా...

    చివరగా...

    మీరు సచిన్ అభిమానులైనా కాక పోయినా, మీరు ఒక్కసారి థియేటర్లో కూర్చున్నారంటే పూర్తయ్యేవరకు ఎలాంటి బోర్ లేకుండా సినిమాను ఆస్వాదిస్తారు. క్రికెట్ ను ఆరాధించే కోట్లాది అభిమానుల డ్రీమ్స్ నిజం చేయడంలో తోడ్పడిన ఒక గొప్ప ఆటగాడి జీవితం గురించి తెలుసుకున్న సంతృప్తి మిగిలుతుంది.

    English summary
    Whether a Sachin Tendulkar fan or not, this film will leave you cheering and hooting for sure along with some nostalgia dripping! You will realize what was it about this Mumbai boy that made one of the greatest batsman of all times, Sir Donald Bradman once say, 'I see myself when I see Sachin batting'. In a nutshell, Sachin makes us fall in love with him all over again!
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X