»   » 102 నాటౌట్ ట్రైలర్ అదుర్స్: ఇలాంటి సినిమా ఇప్పటి వరకు రాలేదు!

102 నాటౌట్ ట్రైలర్ అదుర్స్: ఇలాంటి సినిమా ఇప్పటి వరకు రాలేదు!

Posted By:
Subscribe to Filmibeat Telugu

ప్రేక్షకులను ఎంటర్టెన్ చేసే సత్తా, టాలాంట్, నటనపై ఆసక్తి ఉంటేనే ఏ యాక్టర్ అయినా ఎక్కువ కాలం ఇండస్ట్రీలో కొనసాగుతారు. అమితాబ్ బచ్చన్, రిషి కపూర్ లాంటి నటుల్లో ఆ సత్తా, ఆసక్తి ఏ మాత్రం తగ్గకుండా ఇప్పటికీ ఉంది కాబట్టే వయసుతో సంబంధం లేకుండా దశాబ్దాలుగా ఇండస్ట్రీని ఏలుతూ ప్రేక్షకులను ఎంటర్టెన్ చేస్తున్నారు. తాజాగా ఈ ఇద్దరి కాంబినేషన్లో '102 నాటౌట్' అనే బాలీవుడ్ మూవీ తెరకెక్కుతోంది. తాజాగా ట్రైలర్ విడుదలవ్వగా సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి.

ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్, రిషి కపూర్ తండ్రీ కొడుకులుగా నటించారు. 102 ఏళ్ల తండ్రి పాత్రలో అమితాబ్, 75 ఏళ్ల కుమారుడి పాత్రలో రిషి కపూర్ నటించారు. 118 ఏళ్లకు పైగా జీవించిన చైనా వృద్ధుడి రికార్డు బద్దలు కొట్టాలనే కసితో ఉండే పాత్రలో అమితాబ్ నటించారు.

102 ఏళ్ల వయసులోనూ యువకుడిలా ఉత్సాహంగా ఉండే అమితాబ్.... తన 75 ఏళ్ల కుమారుడిని వృద్ధాశ్రమానికి పంపాలని నిర్ణయిస్తాడు. ఈ క్రమంలో సినిమాను దర్శకుడు బ్రిలియంట్ స్క్రీన్ ప్లేతో ఫన్నీగా రన్ చేసినట్లు ట్రైలర్ చూస్తే స్పష్టమవుతోంది.

మంచి వినోదాన్ని పంచుతూ... ఇప్పటి వరకు ఇండియన్ సినిమాలో రాని సరికొత్త పాయింటుతో ఈ చిత్రాన్ని తెరెక్కించారు. ఉమేష్ శుక్లా దర్శకత్వం వహించిన ఈ చిత్రం మే 4వ తేదీన ఈచిత్రం విడుదల కాబోతోంది.

English summary
There's a reason why veteran actors Amitabh Bachchan and Rishi Kapoor are still in the film-making business. They have entertained us all for over the past few decades, but they still manage to surprise us with their sheer acting talent and bring out something new on the celluloid. And that is what you witness when you will watch the recently released trailer of their upcoming film 102 Not Out.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X