twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    20 years of Lagaan: తృటిలో చేజారిన ఆస్కార్.. అమీర్ ఖాన్ కంటతడి.. ఆ బాలీవుడ్ మూవీ స్పూర్తితో..

    |

    భారతీయ సినిమా చరిత్రలో లగాన్ చిత్రానికి ప్రత్యేకమైన స్థానం ఉంది. బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్, దర్శకుడు అశుతోష్ గోవారికర్ కాంబినేషన్‌లో వచ్చిన ఈ చిత్రం దేశవ్యాప్తంగా అత్యధిక వసూళ్లను సాధించడమే కాకుండా ఆస్కార్ బరిలో నిలిచిన ఘనతను సాధించింది. ఈ చిత్రం 2001 జూన్ 15వ తేదీన విడుదలైంది. అంటే ఈ సినిమా రిలీజై నేటికి 20 ఏళ్లు పూర్తి చేసుకొన్నది. ఈ సందర్భంగా లగాన్ సినిమా గురించి మరిన్ని వివరాలు..

    నయా దౌర్ స్పూర్తితో

    నయా దౌర్ స్పూర్తితో

    లగాన్ సినిమాకు స్పూర్తి 1957లో రిలీజైన నయా దౌర్ అనే చిత్రం. ప్రముఖ దర్శకుడు బీఆర్ చోప్రా డైరెక్షన్‌లో అఖ్తర్ మీర్జా, కమిల్ రషీద్ కథను అందించారు. ఈ చిత్రంలో దిలీప్ కుమార్, వైజయంతీమాల, అజిత్ ఖాన్ తదితరులు నటించారు. క్రీడా నేపథ్యంతో రూపొందిన నయా దౌర్ చిత్రాన్ని స్పూర్తిగా తీసుకొని లగాన్ నిర్మించామని దర్శకుడు అశుతోష్ గోవారికర్ వెల్లడించారు.

    అమీర్ ఖాన్ అభ్యంతరం.. ఆ తర్వాత

    అమీర్ ఖాన్ అభ్యంతరం.. ఆ తర్వాత

    లగాన్ కథను మొదటిసారి అమీర్ ఖాన్ విన్నప్పుడు స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో సినిమా వద్దని అన్నారట. అయితే కథ మొత్తం విన్న తర్వాత అమీర్ ఖాన్ కంటతడి పెట్టుకొని సినిమాలో నటించడానికి ఒప్పుకొన్నారు. అయితే నిర్మాత లభించకపోవడంతో చివరకు లగాన్ సినిమాను తానే స్వయంగా నిర్మించడానికి అమీర్ ఖాన్ ముందుకొచ్చారు. అలా లగాన్ చిత్రం తెరపైకి రావడం జరిగింది.

    బ్రిటీష్ పాలకులు.. గ్రామస్థుల మధ్య

    బ్రిటీష్ పాలకులు.. గ్రామస్థుల మధ్య

    లగాన్ అంటూ వ్యవసాయంపై విధించే పన్ను అని అర్ధం. స్వతంత్రం రాకపూర్వం జరిగిన ఓ కథతో లాగన్ చిత్రం తెరకెక్కింది. బ్రిటిష్ పాలనలో విక్టోరియా పీరియడ్‌ నేపథ్యంగా కథ సాగుతుంది. ఓ గ్రామంలో కరువు తాండవిస్తున్న సమయంలో బ్రీటీష్ పాలకులు రైతులు, గ్రామస్థుల నుంచి పన్ను వసూలు పాల్పడుతారు.

    అయితే గ్రామస్థులు కట్టలేని పరిస్థితుల్లో ఆ పన్ను మినహాయింపు నుంచి తప్పించుకొనేందుకు ప్రొఫెషనల్స్ అయిన బ్రిటీష్ క్రికెటర్లతో క్రికెట్ ఆటకు సిద్దపడుతారు. ఆ గేమ్‌లో క్రికెట్ అంటే ఏమిటో తెలియని గ్రామస్థులు బ్రిటిషర్లను ఎలా ఓడించారనేది సినిమా కథ.

    ఆస్కార్ బరిలో 5వ స్థానం

    ఆస్కార్ బరిలో 5వ స్థానం

    లగాన్ సినిమాకు అంతర్జాతీయంగా అద్బుతమైన ఖ్యాతి దక్కింది. సినిమా రంగంలో నోబెల్ పురస్కారంగా భావించే ఆస్కార్ అవార్డుల బరిలో నిలిచింది. 2002లో ఉత్తమ విదేశీ చిత్రం విభాగం క్యాటగిరీలో ఈ చిత్రం ఆస్కార్ కోసం పోటీ పడింది. అయితే ఇతర చిత్రాలకు గట్టి పోటీ ఇచ్చి చివరకు లగాన్ చిత్రం 5వ స్థానంలో నిలిచింది. అప్పట్లో మదర్ ఇండియా, సలాం బాంబే తర్వాత ఆస్కార్‌కు నామినేట్ అయిన మూడో చిత్రంగా రికార్డును సొంతం చేసుకొన్నది.

    బాలీవుడ్‌లో లగాన్‌కు గట్టి పోటి

    బాలీవుడ్‌లో లగాన్‌కు గట్టి పోటి

    బాలీవుడ్‌లో లగాన్ చిత్రం రిలీజైనప్పుడు ఇతర సినిమాల నుంచి భారీ పోటీని ఎదుర్కొన్నది. అదే సమయంలో దేశభక్తి ప్రధానంగా తెరకెక్కిన గదర్: ఏక్ ప్రేమ కహానీ చిత్రం విశేషంగా ప్రేక్షకుల ఆదరణ దక్కించుకొన్నది. ఆ సమయంలో లగాన్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. పాకిస్థాన్‌కు వ్యతిరేక కథతో గదర్, బ్రిటీషర్లకు వ్యతిరేకంగా నడిచే ఈ రెండు కథా చిత్రాలకు ప్రేక్షకులు సమానంగా పట్టం కట్టారు.

    లగాన్ షూటింగు ప్రాంతంలో భూకంపం

    లగాన్ షూటింగు ప్రాంతంలో భూకంపం

    లగాన్ చిత్రాన్ని రూ.25 కోట్లతో తెరకెక్కించారు. గుజరాత్‌లోని భుజ్ ప్రాంతంలో భారీ సెట్లను వేశారు. ఈ సినిమా షూటింగు పూర్తయిన కొద్ది రోజులకే ఆ ప్రాంతంలో భారీస్థాయిలో భూకంపం సంభవించింది. పెద్ద మొత్తంలో ప్రాణ, ఆస్థి నష్టం జరిగింది. లగాన్ చిత్ర యూనిట్ ఈ ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకొన్నది. 2001 జూన్ 15వ తేదీన రిలీజైన ఈ చిత్రం 66 కోట్లు వసూలు చేసింది.

    ఆస్కార్ రాకపోవడంపై

    ఆస్కార్ రాకపోవడంపై

    ఆస్కార్ అవార్డు దక్కకపోవడంపై అప్పట్లో అమీర్ ఖాన్ స్పందిస్తూ.. ఆస్కార్ అవార్డులకు నామినేట్ కావడమే చాలా కష్టం. విదేశీ విభాగంలో ఉంటే కమిటీ సభ్యులంతా హాలీవుడ్, ఇతర దేశాలకు సంబంధించిన వారే ఉంటారు. కాబట్టి భారతీ సినిమాల ఆత్మను అర్ధం చేసుకోవడం వారికి చాలా కష్టం. విదేశీ క్యాటగిరీలో ఇండియన్ సినిమాకు అవార్డు రావడం మరీ కష్టంగా ఉంటుంది. 5వ స్థానంలో నిలిచామంటే.. విజయం సాధించినట్టే అని అన్నారు.

    Recommended Video

    Sushant Singh Rajput Biopic Motion Poster Viral సూసైడ్ or మర్డర్?
    లగాన్‌లో నటించిందెవరు? సాంకేతిక నిపుణులు..

    లగాన్‌లో నటించిందెవరు? సాంకేతిక నిపుణులు..

    నటీనటులు: అమీర్ ఖాన్, గ్రేసీ సింగ్, రాచెల్ శెల్లీ, పాల్ బ్లాక్‌హోమ్, కుల్‌భూషణ్ ఖర్బందా, ప్రదీప్ రావత్, యష్‌పాల్ శర్మ తదితరులు

    దర్శకత్వం: అశుతోష్ గోవారికర్
    నిర్మాత: అమీర్ ఖాన్
    స్కీన్ ప్లే: అశుతోష్ గోవారికర్, సంజయ్ దేమా
    డైలాగ్స్: కేపీ సక్సేనా, అశుతోష్ గోవారికర్
    మ్యూజిక్: ఏఆర్ రెహ్మాన్
    ఎడిటింగ్: బల్లు సలుజా
    బ్యానర్: అమీర్ ఖాన్ ప్రొడక్షన్స్
    నిడివి: 224 నిమిషాలు
    రిలీజ్ డేట్: 2001-06-15

    English summary
    One oth Most prestigious film of Indian cinema Lagaan completes 20 years. This movie produced and acted by Aamir Khan, Directed by Ashutosh Gowariker. This movie is released on 15 June 2001. In this occassion, Telugu filmibeat brings insights of the film.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X