»   » ‘జీవితంతో ఆడుకొన్నారు.. సూసైడ్‌కు ప్రయత్నించా’.. హీరోయిన్ సంచలన వ్యాఖ్యలు

‘జీవితంతో ఆడుకొన్నారు.. సూసైడ్‌కు ప్రయత్నించా’.. హీరోయిన్ సంచలన వ్యాఖ్యలు

Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  లిపిస్టిక్ అండర్ మై బుర్ఖా చిత్రంతో ప్రేక్షకుల ద‌‌ృష్టిని ఆకర్షించిన అహానా కుమ్రా బాలీవుడ్‌కు దూరంగా నిలిచింది. అందుకు కారణం హిందీ చిత్ర పరిశ్రమలోని పరిస్థితులు తనకు నచ్చకపోవడమేనని తాజాగా వెల్లడించింది. బాలీవుడ్‌లో దర్శక, నిర్మాతల తీరుతో తాను విసిగిపోయానని ఆమె సంచలన విషయాలు బయటపెట్టింది. మీ టూ ఉద్యమం బలంగా కొనసాగుతుండటంతో అహానా కుమ్రా తాను పడిన బాధలను ఏకరువు పెట్టింది. ఇంతకీ అహానా చెప్పిన విషయాలు ఏమిటంటే..

  నా జీవితాన్ని బాలీవుడ్...

  నా జీవితాన్ని బాలీవుడ్...

  బాలీవుడ్ పరిశ్రమలోని పరిస్థితులు నా జీవితాన్ని కుంగదీశాయి. ఓ దశలో అత్మహత్య చేసుకొందామా అనే ప్రయత్నం చేశాను. కానీ అలాంటి ఆలోచనను మానుకోవడంతో ప్రస్తుతం మరో ప్రపంచంలో బతుకుతున్నాను. ఐదేళ్ల క్రితం దారుణమైన పరిస్థితుల్లో కూరుకుపోయాను. దానిని నుంచి బయటకు లాగే వారే కనిపించలేదని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది.

  ఆత్మహత్యే శరణ్యమని

  ఆత్మహత్యే శరణ్యమని

  బాలీవుడ్‌లో నాకు ఎదురైన కష్టాల కారణంగా ఆత్మహత్యే శరణ్యమనిపించింది. నా తల్లిదండ్రుల ప్రతిష్ట, పరువు, వారి అంచనాలకు దూరంగా ఉన్నాను. సూసైడ్ చేసుకోవడానికి అన్ని ఏర్పాట్లు చేసుకొన్నాను. కానీ చివరి నిమిషంలో చావు పరిష్కారం కాదని నిర్ణయించుకొన్నాను. నా తల్లిదండ్రుల కోసం జీవించాలనుకొన్నాను అని అహానా పేర్కొన్నది.

  ఓ దారుణమైన గ్రూప్‌లో

  ఓ దారుణమైన గ్రూప్‌లో

  ఓ ప్రొఫెషనల్‌గా బాలీవుడ్‌లో అడుగుపెడితే ఏదో ఓ గ్రూప్‌తో కలిసిపోవాలి. ఇష్టం ఉన్నా లేకపోయినా వారితో కలిసి కొన్ని పనులు చేయాల్సి వస్తుంది. పరిస్థితులకనుగుణంగా నీవు నీ అస్థిత్వాన్ని కోల్పోతావు. నీవు కాకుండా మరో మనిషి నీలో కనిపిస్తాడు. నా దురదృష్టం కొద్ది నేను దారుణమైన గ్రూప్‌లో పడిపోయాను అని అహానా వెల్లడించారు.

  నన్ను తాకరాని చోట తాకి

  నన్ను తాకరాని చోట తాకి

  ఓసారి ఓ వ్యక్తి చెప్పలేని చోట తాకితే షాక్ తిన్నాను. అలాంటి పరిస్థితులను ఎప్పుడూ చూడలేదు. ఇంతకు ముందు నాకు ఎదురుకాలేదు. నా జీవితంలో నేను పాటించాలనుకొన్న కొన్ని నిబంధనలు గాలికి ఎగిరిపోయాయి. నా ఎలాంటి పరిస్థితుల్లో కూరుకుపోయానో అర్థం చేసుకొనే సరికి నేను నాలా కనిపించలేదు అని అహానా కన్నీటిపర్యంతమైంది.

  నా ఫొన్ నంబర్లన్నీ డిలీట్

  నా ఫొన్ నంబర్లన్నీ డిలీట్

  నా జీవితంలో గురించి తలుచుకొంటూ నేలపై కూర్చుండిపోయాను. నా ఫోన్‌లో నేను బ్లాక్ చేసిన నంబర్లన్నీ డిలీట్ చేశాను. నాకు ఫోన్ చేసి విసిగించిన డైరెక్టర్లు, అసిస్టెంట్ డైరెక్టర్లు, నిర్మాతలకు దూరంగా ఉన్నాను. వారికి నేను ఇప్పుడు అందుబాటులో లేను. బాలీవుడ్‌కు దూరంగా కొత్త జీవితాన్ని ప్రారంభించాను అని అహానా వెల్లడించింది.

  English summary
  Lipstick Under My Burkha actress Aahana Kumra opened up about her struggle in Bollywood as well as the ongoing #MeToo movement. She said I was on the verge of committing suicide, because this culture is so normalised by certain people. I couldn't live with who I was anymore.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more