For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Ira Khan: ప్రియుడితో స్టార్ హీరో కుమార్తె నిశ్చితార్థం, త్వరలో పెళ్లి.. ఫొటోలు వైరల్

  |

  బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ తన విలక్షణమైన నటనతో అనేకమంది అభిమానులను సంపాదించుకున్నాడు. విభిన్నమైన సినిమాలలో నటించి మంచి పేరు తెచ్చుకున్నారు. అలాగే పలు వివాదాల్లో కూడా నిలిచారు. ఇటీవల లాల్ సింగ్ చద్దా సినిమాతో వచ్చి బాక్సాఫీస్ వద్ద ఓటమి చవిచూశారు. ఇక అమీర్ ఖాన్ కుమా్ర్తె ఐరా ఖాన్ గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు. తన బాయ్ ఫ్రెండ్ తో హాట్ హాట్ గా దిగిన ఫొటోలను సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు షేర్ చేస్తూ ఫుల్ ఫేమస్ అయింది. ఇక వీరిద్దరి లవ్ ట్రాక్ ఎన్నోసార్లు హద్దు దాటింది. అయితే తాజాగా వీరిద్దరు పెళ్లి చేసుకోనున్నారని టాక్ వినిపిస్తోంది.

  నిర్మాతగా రానున్న ఐరా ఖాన్..

  నిర్మాతగా రానున్న ఐరా ఖాన్..

  బాలీవుడ్ సూపర్ స్టార్, మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ మొదటి భార్య కూతురు ఐరా ఖాన్ మొదట హీరోయిన్ గా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టబోతున్నట్లుగా అనేక రకాల వార్తలు వచ్చాయి. కానీ ఆమెకు నటన మీద పెద్దగా ఆసక్తి లేదని ఆ తర్వాత క్లారిటీ ఇచ్చింది. అనంతరం ఆమె ఫిలిం ప్రొడక్షన్లోకి కూడా రాబోతున్నట్లు నిర్మాతగా కెరీర్ స్టార్ట్ చేయబోతున్నట్లు మరో టాక్ వినిపించింది. అయితే నిర్మాతగా రానున్న ఐరా ఖాన్ సోషల్ మీడియాలో హాట్ ఫొటోలతో నిత్యం వార్తల్లో నిలిచింది.

  కొన్నాళ్లుగా ప్రేమాయణం..

  కొన్నాళ్లుగా ప్రేమాయణం..

  ఐరా ఖాన్ ఎక్కువగా తన బాయ్ ఫ్రెండ్ కు సంబంధించిన ఫోటోలు, అతనితో సన్నిహితంగా ఉండే పిక్స్ ను సోషల్ మీడియాలో తరచుగా షేర్ చేస్తూ ఉంటుంది. దీంతో సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారుతోంది. ఐరా ఖాన్.. సెలబ్రిటీస్ ఫిట్ నెస్ ట్రైనర్ అయిన నుపుర్ శికరేతో గత కొన్నాళ్లుగా ప్రేమాయణం సాగిస్తున్న విషయం తెలిసిందే. ఇటీవల ఐరాకు నుపుర్ శిఖరే రింగ్ తొడిగి మరి ప్రపోజ్ చేశాడు.

  ఘనంగా ఎంగేజ్ మెంట్ వేడుకలు..

  ఘనంగా ఎంగేజ్ మెంట్ వేడుకలు..

  అయితే ప్రస్తుతం ఈ జంట త్వరలోనే పెళ్లిపీటలు ఎక్కనుందని వార్తలు వస్తున్నాయి. శుక్రవారం (నవంబర్ 18)న వీరిద్దరి నిశ్చితార్థం వేడుకలు ఘనంగా జరిగాయని బాలీవుడ్ వర్గాల నుంచి వచ్చిన సమాచారం. అమీర్ ఖాన్ మాజీ భార్య రీనా దత్తా సహా బంధుమిత్రులంతా ఈ నిశ్చితార్థపు వేడుకకు హాజరై ఐరాఖాన్, నుపుర్ శిఖరేను ఆశీర్వదించారట. ఈ వేడుకకు సంబంధించిన వీడియో, ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

  కరోనా సమయంలో..

  కరోనా సమయంలో..

  ఐరా ఖాన్, నుపూర్ 2020 నుంచి ప్రేమలో కొనసాగుతున్నారు. అతను ఫిట్నెస్ ట్రైనర్ గా పరిచయమవ్వగా కొన్నాళ్ళకు ఇరా ప్రేమకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కరోనా సమయంలో ఐరాకు ఫిట్ నెస్ ట్రైనర్ గా వచ్చిన నుపుర్ తో ఆమెకు మంచి రిలేషన్ ఏర్పడింది. వాలెంటైన్స్ వీక్ సందర్భంగా, ఇరా తన ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌ను తీసుకుని, నుపూర్‌తో తన సంబంధాన్ని కూడా ప్రకటించింది. ఇక బయట ఇతర పుకార్లు వైరల్ కాకముందుకే ఆమె ఆ విధంగా క్లారిటీ ఇవ్వడంతో అప్పటినుంచి కూడా ఐరా ఖాన్ తన బాయ్ ఫ్రెండ్ కు సంబంధించిన ఫోటోలను నిత్యం సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటూనే ఉంది.

  నుపుర్ టెన్నిస్ ఆటగాడు..

  నుపుర్ టెన్నిస్ ఆటగాడు..

  నుపుర్‌ విషయానికి వస్థే అతను పూణేకి చెందిన వ్యక్తి. కామర్స్, ఎకనామిక్స్ గ్రాడ్యుయేట్ అయిన అతను రాష్ట్ర స్థాయి టెన్నిస్ ఆటగాడు. ఆ తరువాత సెలబ్రెటీలకు ఫిట్‌నెస్ ట్రైనర్‌గా మారాడు. ఇక ఇరా తండ్రి అమీర్ ఖాన్‌కు అప్పట్లో శిక్షణ కూడా ఇచ్చాడు. ఇక ఆ తరువాత ఐరా ఖాన్ కు పరిచయమైన అతను కొన్ని రోజుల్లోనే లవ్ ట్రాక్ లోకి ఎక్కేశాడు. ఇక త్వరలోనే అతను ఆమిర్ ఖాన్ కు అల్లుడు కాబోతున్నాడు.

  English summary
  Bollywood Superstar Aamir Khan And His Ex Wife Reena Dutta Daughter Ira Khan Engagement With Nupur Shikhare Pics And Vidoes Goes Viral
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X