twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అప్పులు ఇచ్చిన వాళ్ళు ఇంటిపైకి రావడంతో.. అమీర్ ఖాన్ కన్నీళ్ళ వ్యధ!

    |

    బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో అత్యధిక మార్కెట్ ఉన్న స్టార్ హీరోలలో అమీర్ ఖాన్ ఒకరు. సినిమా ప్రపంచంలో ఎంతో కష్టపడి స్టార్ హీరోగా ఎదిగిన అమీర్ ఖాన్ తన జీవితంలో ఎన్నో కష్టాలను కూడా ఎదుర్కొన్నాడు. ముఖ్యంగా అతని కుటుంబం ఒకానొక సమయంలో ఎన్నో అప్పుల బాధలను కూడా తట్టుకోలేక కన్నీళ్లు పెట్టుకున్న సందర్భాలు కూడా ఉన్నాయట. ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో అమిర్ తన జీవితంలో ఎదుర్కొన్న కొన్ని క్లిష్టమైన పరిస్థితుల గురించి కూడా వివరణ ఇచ్చాడు. ఆ వివరాల్లోకి వెళితే..

    టాలెంటెడ్ ఫిల్మ్ మేకర్

    టాలెంటెడ్ ఫిల్మ్ మేకర్

    బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును అందుకున్న అమీర్ ఖాన్ నేటితరం యువ నటీనటులకు కూడా ఎంతో స్ఫూర్తిగా నిలుస్తూ ఉంటాడు. అతను కేవలం నటనలోనే కాకుండా ఒక ఫిలిం మేకర్ గా కూడా ఇండస్ట్రీలో ఎంతగానో గుర్తింపు అందుకున్నాడు. నిర్మాతగా కూడా మంచి మార్కెటింగ్ స్ట్రాటజీతో సినిమాలను విడుదల చేస్తూ ఉంటారు.

     ఆ వయసులోనే కష్టాలు

    ఆ వయసులోనే కష్టాలు

    బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ చాలా రోజుల తర్వాత ఒక ప్రత్యేకమైన ఇంటర్వ్యూలో తన చిన్ననాటి కష్టాల గురించి చెప్పుకున్నాడు. అమిర్ మాట్లాడుతూ చిన్నప్పుడు పరిస్థితులు అయితే ఇప్పుడు ఉన్నట్లు ఉండేవి కావు. మా నాన్నగారు ఎంతో కష్టపడి మా కుటుంబాన్ని పోషించారు. నాకు పదేళ్లు ఉన్నప్పుడే నుంచి ఆయన కష్టాల గురించి అర్థమయింది అని అన్నారు.

    పెద్ద నిర్మాత కాకపోవడంతో

    పెద్ద నిర్మాత కాకపోవడంతో

    నాన్న నిర్మాతగా నా 10 ఏళ్ల వయసులో తాహిర్ హుస్సేన్ లాకెట్ అనే సినిమాను తెరపైకి తీసుకువచ్చారు. ఆ సినిమా కోసం స్టార్స్ ను తీసుకున్నారు. జితేంద్ర, రేఖ, ఖాదర్ ఖాన్ ఇలా ప్రముఖ నటీనటులు ఆ సినిమాలో నటించారు. అయితే నాన్న పెద్ద నిర్మాత కాకపోవడంతో వాళ్లు సరైన రీతిలో డేట్స్ అయితే ఇచ్చేవారు కాదు. ఇక సినిమా పూర్తి కావడానికి 8 ఏళ్ల వరకు కష్టపడాల్సి వచ్చింది.

     అప్పులు ఇచ్చిన వారు

    అప్పులు ఇచ్చిన వారు

    ఒకే ఒక్క సినిమా కారణంగా మా కుటుంబ పరిస్థితి ఒక్కసారిగా ఊహించని పరిస్థితుల్లోకి మారిపోయింది. ఆయన దగ్గర ఉన్న డబ్బులు అంతా సినిమాపై పెట్టడంతో మా పరిస్థితి కూడా రోడ్డు మీదకు వచ్చేసింది అంటూ అమీర్ ఖాన్ ఎమోషనల్ అయ్యారు. ఇక చివరికి మాకు అప్పులు ఇచ్చినవారు ఇంటి మీదకు వచ్చి గొడవ కూడా చేసిన సందర్భాలు ఉన్నాయి అని అమీర్ ఖాన్ చేదు అనుభవాలను గుర్తు చేసుకున్నాడు.

    ఏమీ చేయలేని పరిస్థితుల్లో

    ఏమీ చేయలేని పరిస్థితుల్లో

    అప్పుల వాళ్లకు సర్ది చెప్పేందుకు నాన్నగారు ఎంతగానో బ్రతిమాలేవారు. సినిమా పూర్తయితే డబ్బులు వస్తాయని అన్ని తిరిగి ఇచ్చేస్తాను అని ఎంతగానో బ్రతిమాలేవారు. కానీ అవన్నీ కూడా వారికి అవసరం లేదు అన్నట్లు మాట్లాడేవారు. నాకు అప్పుడు 10 ఏళ్ల వయసు. ఏమీ చేయలేని పరిస్థితుల్లో ఏడ్చేవాన్ని. నాన్న కష్టాలు నన్ను ఎంతగానో బాధించాయి.. అని అమీర్ ఖాన్ తన చిన్ననాటి చేదు అనుభవాలను గుర్తు చేసుకుంటూ ఎమోషనల్ అయ్యాడు.

    English summary
    Aamir khan emotional on his childhood sad incidents
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X