Aamir Khan: తాత వయసులో మూడో పెళ్లా? అమీర్ పై విరుచుకుపడ్డ బీజేపీ ఎంపీ
బాలీవుడ్ మిస్టర్ ఫర్‌ఫెక్ట్‌గా పేరు తెచ్చుకొన్న అమీర్ ఖాన్ తన రెండో భార్యకు విడాకులు ఇవ్వాలని నిర్ణయం తీసుకోవడంపై మిశ్రమ స్పందన వ్యక్తమవుతున్నది. ఇటీవల తన రెండో భార్య కిరణ్ రావు, అమీర్ ఖాన్ పరస్పర అవగాహనతో విడిపోవాలని నిర్ణయం తీసుకోవడం మీడియాలో పతాక శీర్షికలను ఆకర్షించింది. ఇదిలా ఉండగా, భార్య నుంచి అమీర్ ఖాన్ రెండోసారి విడాకులు తీసుకోవడంపై బీజేపీ ఎంపీ సుధీర్ గుప్తా ఘాటుగా స్పందిస్తూ...

15 సంవత్సరాల కాపురం తర్వాత
అమీర్ ఖాన్ విషయానికి వస్తే.. హీరోయిన్ రీనా దత్తాను పెళ్లి చేసుకొని 15 కాపురం చేశాడు. ఆ తర్వాత వ్యక్తిగత విభేదాల వల్ల వారిద్దరూ విడిపోయారు. అమీర్, రీనాకు ఇరా ఖాన్, జునైద్ ఖాన్ అనే ఇద్దరు సంతానికి వారికి కలిగారు. ఆ తర్వాత దర్శకురాలు కిరణ్ రావును ప్రేమించి పెళ్లి చేసుకొన్నాడు. ఆ తర్వాత వారిద్దరికి ఆజాద్ ఖాన్ అనే కుమారుడు కలిగాడు. 15 ఏళ్ల దాంపత్య జీవితం తర్వాత విడాకులు తీసుకోవాలని అనుకొన్నారు.

ఫాతీమా సనా షేక్‌తో డేటింగ్?
అయితే కిరణ్‌రావుతో విడాకులు వెనుక ఓ యువ హీరోయిన్‌తో అమీర్ ఖాన్ సన్నిహితంగా ఉండటమే అనే మాట వినిపిస్తున్నది. దంగల్ చిత్రంలో తనతో నటించిన ఫాతీమా సనా షేక్‌తో డేటింగ్ చేస్తున్నట్టు బాలీవుడ్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. అయితే ఈ వార్తలపై అటు అమీర్ గానీ, ఇటు ఫాతీమా సనా షేక్ స్పందించలేదు. దాంతో వారి అఫైర్‌పై అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

అమీర్ ఖాన్‌పై లవ్ జిహద్ ఆరోపణలు
ఇక రెండుసార్లు విడాకులు తీసుకొన్న అమీర్ ఖాన్‌పై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. హిందువు మహిళలను ఆకర్షిస్తూ పెళ్లి చేసుకోవడమే కాకుండా వారికి అన్యాయం చేస్తున్నారు అంటూ మండిపడ్డారు. అమీర్ ఖాన్ లవ్ జిహద్‌కు పాల్పడుతున్నారు అంటూ సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేశారు. ఇలాంటి క్రమంలో అమీర్‌పై మధ్యప్రదేశ్‌కు చెందిన బీజేపీ ఎంపీ సుధీర్ గుప్తా తీవ్ర ఆరోపణలు చేశారు.

తాత వయసులో మూడో పెళ్లి అంటూ
అమీర్ ఖాన్ తన మొదటి భార్య రీనా దత్తాకు విడాకులు ఇచ్చారు. ఆమె ద్వారా ఇద్దరు పిల్లల్ని కన్నాడు. ఆ తర్వాత కిరణ్ రావును పెళ్లి చేసుకొన్నాడు. ఆమెకు ఓ కుమారుడు ఉన్నాడు. ఇప్పుడు మళ్లీ విడాకులు ఇచ్చాడు. ఆయనకు ఇప్పుడు తాత అయ్యే వయసు. ఇప్పుడు మూడో భార్య కోసం ఎదురు చూస్తున్నాడు అని బీజేపీ ఎంపీ ఎద్దేవా చేశాడు.

అమీర్ ఖాన్ కెరీర్ ఇలా..
ఇక అమీర్ ఖాన్ కెరీర్ విషయానికి వస్తే.. ప్రస్తుతం లాల్ సింగ్ చద్దా అనే చిత్రాన్ని స్వయంగా నిర్మిస్తూ, దర్శకత్వం వహిస్తూ నటిస్తున్నారు కూడా. హలీవుడ్ మూవీ ఫారెస్ట్ గంప్ చిత్రానికి రీమేక్‌గా ఈ సినిమా రూపొందుతున్నది. ఈ చిత్రంలో కరీనా కపూర్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఈ చిత్రంలో టాలీవుడ్ నటుడు నాగచైతన్య అక్కినేని కీలక పాత్రలో కనిపించనున్నారు.


Click it and Unblock the Notifications











