»   » అమితాబ్ ఆరోగ్యంపై అమీర్ అప్‌డేట్. యాక్షన్ సీన్లలో గాయాలు..

అమితాబ్ ఆరోగ్యంపై అమీర్ అప్‌డేట్. యాక్షన్ సీన్లలో గాయాలు..

Posted By:
Subscribe to Filmibeat Telugu

భారతీయ సిని దిగ్గజం, బిగ్‌బీ అమితాబ్ బచ్చన్ అస్వస్థతకు గురైన విషయంపై మిస్టర్ పర్‌ఫెక్ట్ అమీర్ ఖాన్ వివరణ ఇచ్చారు. అమీర్ ఖాన్‌తో కలిసి బిగ్‌బీ థగ్స్ ఆఫ్ హిందూస్థాన్ చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌లో జరుగుతున్నది. ఆ సినిమా షూటింగ్ జరుగుతుండగా అమితాబ్ అస్వస్థతకు లోనవ్వగా ముంబై నుంచి వైద్యబృందం జోధ్‌పూర్‌కు వెళ్లిన సంగతి తెలిసిందే. అమితాబ్ ప్రస్తుత ఆరోగ్య పరిస్థితి గురించి అమీర్ ట్విట్టర్‌లో పేర్కొన్నారు.

 యాక్షన్ ఎపిసోడ్స్‌లో బిగ్‌బీ

యాక్షన్ ఎపిసోడ్స్‌లో బిగ్‌బీ

గతవారంగా థగ్స్ ఆఫ్ హిందూస్థాన్ చిత్రం విస్తృతంగా జరుగుతున్నది. కొద్దిరోజులుగా యాక్షన్ సీన్లను చిత్రీకరిస్తున్నాం. మార్చి 12వ తేదీ రాత్రి అమితాబ్‌పై కొన్ని సీన్లు చిత్రీకరించాం అని అమీర్ తెలిపారు.

 భుజానికి గాయాలు

భుజానికి గాయాలు

గతంలో అమితాబ్‌కు వెన్నునొప్పి, భుజానికి గాయలైన దాఖలాలు ఉన్నాయి. ఈ యాక్షన్ సీన్ల చిత్రీకరణ సందర్భంగా గాయాలు తిరగదోడటంతో బిగ్‌బీ అస్వస్థతకు గురయ్యాడు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి బాగుంది అని మిస్టర్ ఫర్‌ఫెక్ట్ వెల్లడించారు.

గ్యాప్ తర్వాత యాక్షన్ సీన్లలో

గ్యాప్ తర్వాత యాక్షన్ సీన్లలో

అమితాబ్ చాలా రోజుల తర్వాత యాక్షన్ సీన్లలో నటిస్తున్నారు. ఈ సినిమాలో ఆయన ఫైట్స్ చూసి ప్రేక్షకులు థ్రిల్ అవుతారు. వయసుకు మించిన పోరాట సన్నివేశాల్లో ఆయన పాల్గొంటున్నారు. అందుకే ఆయన అస్వస్థతకు గురయ్యారు.

అమితాబ్ బర్త్‌డే విషెస్

అమితాబ్ బర్త్‌డే విషెస్

అమితాబ్ సమక్షంలో బుధవారం నా బర్తేడ్‌ను జరుపుకొన్నాను. బిగ్‌బీ నుంచి నేరుగా జన్మదిన శుభాకాంక్షలు అందుకోవడం జీవితంలో మరిచిపోలేను. చిత్ర యూనిట్ ముందు గంభీరమైన స్వరంతో నాకు బర్త్ డే విషెస్ చెప్పడం చాలా ఆనందం కలిగింది. అమితాబ్ నుంచి విషెష్ అందుకోవడం ఇదే తొలిసారి అని అమీర్ ఖాన్ పేర్కొన్నారు.

స్పందించిన జయ బాధురీ

స్పందించిన జయ బాధురీ

కాగా, అమితాబ్ ఆరోగ్యంపై ఆయన సతీమణి జయా బాధురి స్పందించారు. ఆయన మెడనొప్పితో బాధపడుతున్నారు. థగ్స్ ఆఫ్ హిందూస్థాన్ సినిమా షూటింగ్‌లో బరువైన దస్తులు, అలంకరణ వస్తువులు ధరించడంతో దాని ప్రభావం మెడపైన పడింది అని తెలిపారు.

 బాగానే ఉన్నాను.. బిగ్‌బీ

బాగానే ఉన్నాను.. బిగ్‌బీ

అలాగే, తన ఆరోగ్యం బాగానే ఉందని అమితాబ్ తన బ్లాగ్‌లో స్పందించారు. నాకు కొంత అసౌకర్యంగా ఉంది. చికిత్స కోసం వైద్యులను పిలిపించాను. ఇప్పుడు బాగానే ఉన్నాను అని కవితాధోరణిలో అమితాబ్ చెప్పారు.

English summary
Bollywood actor Aamir Khan has revealed that his Thugs of Hindostan co-star Amitabh Bachchan suffered shoulder and back injury, but is doing well now. “I shot with him last night. He has problem in the back and shoulder as he has a lot of action sequences in the film. After a long time audience will get to see him doing action.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu