అమీర్ ఖాన్ -కిరణ్ రావు డివోర్స్.. ఆసక్తికరంగా ఇరా ఖాన్ ఫస్ట్ రియాక్షన్!

బాలీవుడ్ సూపర్ స్టార్ అమీర్ ఖాన్ ఆయన రెండో భార్య కిరణ్ రావు విడిపోతున్నట్లు ప్రకటించి కలకలం రేపిన సంగతి తెలిసిందే. పదిహేనేళ్ల తమ వివాహ జీవితానికి ముగింపు పలుకుతూ ఉన్నామని చెబుతూ ఇద్దరూ కలిసి ఒక సంయుక్త ప్రకటన చేశారు. తాము కలిసి ఉండలేమని చెబుతూ కొత్త జీవితాన్ని ప్రారంభిస్తామని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. తమ వైవాహిక జీవితంలో ఎన్నో తీపి జ్ఞాపకాలు, ఆనందాలు, హాయిగా గడిపిన రోజులు ఎప్పటికీ గుర్తుండి పోతాయని అయితే ఇక మీదట భార్యాభర్తలుగా విడిపోతూ తమ కుమారుడికి సహ తల్లిదండ్రులుగా ఉంటామని వారు వెల్లడించారు.

అలాగే సినిమాల విషయంలో అలాగే పాని ఫౌండేషన్ కార్యకలాపాలలో కూడా కలిసి పని చేస్తామని ఈ ఇద్దరూ సంయుక్త ప్రకటనలో పేర్కొన్నారు. అయితే వీరి విడాకుల ప్రకటన అనంతరం అమీర్ ఖాన్ కుమార్తె ఇరా ఖాన్ ఇంస్టాగ్రామ్ లో చేసిన ఒక పోస్ట్ ఆసక్తికర అంశంగా మారింది.. తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో తన ఫోటో షేర్ చేసి నెక్స్ట్ రివ్యూ రేపు ఉంటుంది అని పేర్కొంటూనే, దేనికి సంబంధించి ? అని ప్రశ్నిస్తూ కామెంట్ చేసింది.

Aamir Khans daughter Ira Khan breaks silence on divorce shares intresting post on Instagram

అయితే ఆమెకు పేస్ట్రీ స్టికర్ కూడా పోస్ట్ చేయడంతో ఇది ఒక రకంగా ఫుడ్ కి సంబంధించిన రివ్యూ అయి ఉండవచ్చని అందరూ భావిస్తున్నారు. ఎందుకంటే ఆమె చివరిగా చేసిన వీడియో కూడా ఒక ఫుడ్ కి సంబంధించిన వీడియోనే. అందులో ఒక చీజ్ కేక్ తిన్న ఆమె దాని గురించి ఒక పెద్ద రివ్యూ రాసుకుని వచ్చింది. దీంతో బహుశా ఆమె రివ్యూ ఇలాంటి ఏదైనా ఫుడ్ గురించి అయి ఉండవచ్చని కొందరు భావిస్తుంటే తన తండ్రి, సవతి తల్లి విడాకులు తీసుకోవడం గురించి స్పందించే అవకాశం ఉందని కొందరు పేర్కొంటున్నారు. అయితే ఆమె దేని గురించి స్పందిస్తుందో వేచి చూడాల్సి ఉంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X