twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ధనుష్ చేయాలనుకున్న ఆ బయోపిక్ లో అమీర్ ఖాన్.. కాంబో సెట్టయినట్లేనా?

    |

    బిగ్ స్క్రీన్ పై బయోపిక్ లకు ఏ రేంజ్ లో ఆదరణ దక్కుతుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మెయిన్ గా స్పోర్ట్స్ పర్సన్స్ కు సంబంధించిన సినిమాలకు వస్తున్న రెస్పాన్స్ అద్భుతంగా ఉంది. అప్పుడెప్పుడో వచ్చిన బాగ్ మిల్కా బాగ్ సినిమా నుంచి మొన్న వచ్చిన ఎమ్ఎస్.ధోని సినిమాక్ వరకు అన్ని కూడా ఒక ట్రెండ్ సెట్ చేశాయి. ఇక ఎప్పటికైనా అలాంటి కథలకు ఆడియెన్స్ కనెక్ట్ అవుతారని తేలుసుకున్న దర్శకులు అన్ని రకాల స్పోర్స్ బయోపిక్ ల గురించి ఆలోచిస్తున్నారు.

    అయితే ఈ సారి బాలీవుడ్ దర్శకుడు ఆనంద్ ఎల్.రాయ్ ఒక ప్రపంచం మెచ్చిన చదరంగం వీరుడు విశ్వనాథన్ ఆనంద్ కథను తెరకెక్కించాడానికి సిద్ధమవుతున్నట్లు గత ఏడాది నుంచి రూమర్స్ వస్తున్నాయి. చెస్ దిగ్గజం విశ్వనాథన్ ఆనంద్ ఏ స్థాయిలో వండర్స్ క్రియేట్ చేశాడో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. ఆ ఆటకు మన దేశంలో అంతగా గుర్తింపు లేకపోవడం వలన ఆనంద్ పేరు ఇంకా అనుకున్నంత స్థాయిలో పెరగలేదు.
    లేకుంటే మరో లెవెల్లో ఉండేది.

    Aamir khan second option for Chess legend Viswanathan Anand biopic

    చెస్ ఆటతో భారత్ కూడా ఇంటర్నేషనల్ లెవెల్లో ఇతర దేశాల దిగ్గజాలకు పోటీగా నిలవగలదని గుర్తింపు తీసుకొచ్చిన ఘనత ఆయనది. విశ్వనాథన్ చెస్ పోటీలలో ఎన్నో పథకాలు అందుకున్నారు. ఇక ఆయన బయోపిక్ కథలో మొదట ధనుష్ నటించనున్నట్లు టాక్ వచ్చింది. అయితే ధనుష్ వేరే కమిట్మెంట్స్ వల్ల బిజీగా ఉండడంతో దర్శకుడు అమీర్ ఖాన్ వైపు యూ టర్న్ తీసుకున్నట్లు సమాచారం. దంగల్ సినిమాతో సెన్సేషన్ క్రియేట్ చేసిన అమీర్ ఖాన్ చెస్ ప్లేయర్ బయోపిక్ ను వదులుకోవడానికి ప్రయత్నం అయితే చేయడు. ఆయన చేస్తే దేశమంతా చెస్ యొక్క గోప్పతనం ఎక్కువ మందికి తెలుస్తుందని అనడంలో ఎలాంటి సందేహం లేదు. మరి అమీర్ ఖాన్ ఒప్పుకుంటాడో లేదో చూడాలి.

    English summary
    The wave of biopics on the silver screen is not going away now. There has been an amazing response to upcoming movies on the lives of players in particular. All the films from Bagh Milka Bagh to MS Dhoni biopic are well known. But this time, unexpectedly, Bollywood director Anand L. Roy is preparing to tell the story of a world genius.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X