For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  గుర్తు పట్టని విధంగా మారిపోయిన సూపర్‌ స్టార్.. ఒరిజినల్ రూపంతో షాకిచ్చిన హీరోయిన్

  By Manoj
  |

  బాలీవుడ్ మిస్టర్ పర్‌ఫెక్ట్ అమీర్ ఖాన్.. ఈ పేరు తెలియని వారు చాలా అరుదు. తన విలక్షణ నటనతో దేశంలోనే కాదు.. ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు సంపాదించుకున్నారాయన. ఎన్నో వైవిధ్యమైన పాత్రలు చేస్తూ కుర్ర హీరోలతో పోటీ పడుతున్నారు. సినిమా కోసం అమీర్ ఖాన్‌ ఎంతో కష్టపడుతుంటారు. ఆ కష్టం తెరపైన కనిపిస్తుంది కూడా. అందుకే ఆయన సినిమాల కోసం ఫ్యాన్స్ మాత్రమే కాకుండా సాధారణ ప్రేక్షకులు కూడా ఎదురు చూస్తుంటారు. ఈ క్రమంలోనే ఆయనకున్న మార్కెట్ కారణంగా అమీర్ సినిమాలు భారీ వసూళ్లను రాబడుతుంటాయి. ఇక, తాజాగా ఆయన గుర్తు పట్టని విధంగా మారిపోయారు. ఆయనతో పాటు ఓ హీరోయిన్ కూడా ప్రేక్షకులకు షాకిచ్చింది. ఆ వివరాలేంటో చూద్దాం.

   భారీ పరాజయాన్ని అందుకున్నారు

  భారీ పరాజయాన్ని అందుకున్నారు

  బాలీవుడ్ స్టార్ యాక్టర్స్ బిగ్ బి అమితాబ్ బచ్చన్, అమిర్ ఖాన్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘థగ్స్ ఆఫ్ హిందూస్థాన్'. 19వ శతాబ్దం మొదట్లో భారతదేశంలో తమ దోపిడీలతో అప్పటి బ్రిటీష్ ప్రభుత్వానికి సవాల్ విసిరిన థగ్స్(దోపిడీదారులు) కథతో ఈ చిత్రం తెరకెక్కింది. ఎన్నో అంచనాలతో విడుదలైన ఈ సినిమా భారీ పరాభవాన్ని మూటకట్టుకుంది.

  సరికొత్త ప్రయోగం

  సరికొత్త ప్రయోగం

  అమీర్ ఖాన్ మరో ప్రయోగానికి సిద్ధం అయిపోయారు. ఆయన ప్రస్తుతం చేస్తున్న చిత్రం ‘లాల్ సింగ్ చద్దా'. హాలీవుడ్ చిత్రం `ఫారెస్ట్ గంప్‌` చిత్రానికి రీమేక్‌ గా ఈ సినిమాని తీస్తున్నారు. దీనికి అద్వైత్ చందన్ డైరెక్టర్. ఈ మూవీని ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించి అన్ని భాషల్లోనూ డిసెంబర్ 25, 2020న రిలీజ్ చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇందులో హీరోయిన్‌గా కరీనా కపూర్ నటిస్తోంది. అలాగే దక్షిణాది నటుడు విజయ్ సేతుపతి ముఖ్య పాత్రను చేస్తున్నాడు.

  సల్మాన్, షారూఖ్ కూడా ఉంటారట

  ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో అమీర్ ఖాన్, సల్మాన్ ఖాన్, షారుఖ్ ఖాన్ తొలిసారిగా కలిసి సినిమా చేస్తున్నట్లుగా బాలీవుడ్‌లో కొద్ది రోజులుగా వార్తలు ప్రచారంలో ఉన్నాయి. ఈ సినిమాను అమీర్ భార్య కిరణ్ రావు నిర్మిస్తుండడంతో ఈ వార్తలకు బలం చేకూరింది. ఆమె స్వయంగా వాళ్లిద్దరిని ఒప్పించిందని కూడా వార్తలు వెలువడ్డాయి. అయితే, దీనిపై చిత్ర యూనిట్ ఇప్పటి వరకు స్పందించలేదు.

   గుర్తు పట్టని విధంగా మారిపోయాడు

  గుర్తు పట్టని విధంగా మారిపోయాడు

  ప్రయోగాలు చేస్తూ.. తనను ఎప్పటికప్పుడు కొత్తగా చూపించడానికి ప్రయత్నాలు చేస్తుంటాడు అమీర్ ఖాన్. ‘లాల్ సింగ్ చద్దా'లో ఆయన సిక్కు వ్యక్తిగా కనిపించనున్నారు. దీనికి సంబంధించిన లుక్ ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. ఇందులో అమీర్ ఖాన్.. ముదురు గడ్డం, తలపాగాతో గుర్తు పట్టని విధంగా ఉన్నాడు. దీంతో ఈ పిక్ ఇంటర్నెట్‌లో వైరల్ అయిపోయింది.

  సూపర్ స్టార్‌పై ప్రశంసల వర్షం

  షూటింగ్ స్టాప్ నుంచి లీకైన అమీర్ ఖాన్ ఫొటోపై ప్రశంసల వర్షం కురుస్తోంది. నెటిజన్లు ఆయన డెడికేషన్‌ను కొనియాడుతున్నారు. ‘యాక్టర్ అంటే ఇలా ఉండాలి' అని కొందరు అంటుండగా, ‘అమీర్ ఖాన్ సర్దార్ గెటప్‌లో బాగున్నాడు. ఆయనను అస్సలు గుర్తు పట్టలేకపోయాము' అని మరికొందరు కామెంట్లు చేస్తున్నారు. సామాన్యులతో పాటు సినీ ప్రముఖులు సైతం ఈ పిక్‌పై తమ స్పందనను తెలియజేస్తుండడం విశేషం.

  Cine Box : Suriya’s Aakasam Nee Haddura First Look Is Out || 'రూలర్’లో ఆ సీన్‌కు పునకాలు ఖాయమట.!
  ఒరిజినల్ రూపంతో షాకిచ్చిన హీరోయిన్

  ఒరిజినల్ రూపంతో షాకిచ్చిన హీరోయిన్

  ఇక, ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది సీనియర్ హీరోయిన్ కరీనా కపూర్. ప్రస్తుతం ఆమె చండీఘర్‌లో జరుగుతున్న షూటింగ్‌లో పాల్గొంటోంది. షూటింగ్ జరుగుతున్న సమయంలో ఆమె పాత్రకు సంబంధించిన పిక్స్ కూడా లీక్ అయ్యాయి. వీటిలో ఆమె మేకప్ లేకుండా కనిపిస్తోంది. దీంతో అందరూ షాకైపోతున్నారు. ప్రస్తుతం ఈ ఫొటోలు కూడా ఇంటర్నెట్‌లో చక్కర్లు కొడుతున్నాయి.

  English summary
  Laal Singh Chaddha is an upcoming 2020 Indian Hindi-language drama film directed by Advait Chandan, produced by Aamir Khan, Kiran Rao under banners Aamir Khan Productions and Viacom18 Motion Pictures. It features Aamir Khan, Vijay Sethupathi and Kareena Kapoor in the lead roles.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X