»   » 'మహాభారతం' కోసం తొలి అడుగు సక్సెస్.. రాజమౌళిలాగే అతడికి కూడా!

'మహాభారతం' కోసం తొలి అడుగు సక్సెస్.. రాజమౌళిలాగే అతడికి కూడా!

Subscribe to Filmibeat Telugu
కొత్త సంచలనానికి నాంది పడుతోందా ?

ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై మహాభారత కథలు చాలానే ఇప్పటివరకు మెరిసాయి. మహాభారతం అభిమానులని నిరాశపరచడం అంటూ ఉండదు. మహాభారతంలోని కథ, అందులో పాత్రల ప్రత్యేకత అంటువంటిది. మహాభారతాన్ని ఇప్పటివరకు చాలా మంది దర్శకులు వివిధ రూపాలలో అద్భుతంగా ఆవిష్కరించారు. సినిమాల్లో గ్రాఫిక్స్ పాత్ర పెరుగుతున్న ఇప్పటి రోజులో మహా భారతాన్ని ఇంకా అద్భుతంగా ఆవిష్కరించవచ్చు అనేది రాజమౌళి వంటి దర్శకుల అభిప్రాయం. అన్ని చిత్ర పరిశ్రమల్లో మహాభారతాన్ని తెరెకెక్కించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. బాలీవుడ్ స్టార్ హీరో అమిర్ ఖాన్ కూడా మహా భారతాన్ని తెరెకెక్కించడానికి తనవంతు ప్రయత్నాలు చేస్తున్నాడు. ఈ ప్రయత్నంలో తొలి అడుగు విజయవంతమైనట్లు వార్తలు వస్తున్నాయి.

 వందల కొద్దీ చిత్రాలు

వందల కొద్దీ చిత్రాలు

అన్ని చిత్ర పరిశ్రమల్లో మహా భారతంపై ఇప్పటి వరకు వందల కొద్దీ చిత్రాలు వచ్చాయి. కానీ మహా భారతం ఎప్పుడూ ఎవ్వరికి నిరాశ కలిగించదు. అదే మహాభారతం యొక్క ప్రత్యేకత.

 రాజమౌళి కోరిక

రాజమౌళి కోరిక

మహా భారతాన్ని తెరకెక్కించాలని దర్శకదీరుడు రాజమౌళికి కోరిక ఉంది. ఆ సమయం కోసం తాను ఎదురుచూస్తున్నానని రాజమౌళి గతంలో పలుమార్లు తెలిపాడు.

 అమిర్ ఖాన్ కూడా

అమిర్ ఖాన్ కూడా

మహా భారతాన్ని తెరకెక్కించాలని కోరిక టాలీవుడ్ లో రాజమౌళికి ఉంటె బాలీవుడ్ లో అమిర్ ఖాన్ అదే ఆశయంతో ఉన్నాడు. మహాభారత చిత్రాన్ని తెరకెక్కించడం తన చిరకాల కోరిక అని అమిర్ ఖాన్ గతంలోనే తెలిపాడు.

తొలి అడుగు పడింది

తొలి అడుగు పడింది

అమిర్ ఖాన్ కల నెరవేరే దిశగా తొలి అడుగు పడ్డట్లు తెలుస్తోంది. మహాభారతాన్ని నిర్మించడానికి సరైన వ్యక్తే ముందుకు వచ్చాడట. మహాభారతం వంటి చిత్రాన్ని నిర్మించాలనే బడ్జెట్ విషయంలో ముందు వెనకా ఆలోచించకూడదు. ఈ చిత్రానికి భారీ స్థాయిలో డబ్బు ఖర్చు అవుతుంది.

నిర్మాతగా ముకేశ్ అంబానీ

నిర్మాతగా ముకేశ్ అంబానీ

ఈ చిత్రాన్ని నిర్మించడానికి ముకేశ్ అంబానీ ముందుకు వచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. మహా భారత చిత్రాన్ని భాగాల రూపంలో పూర్తి చేసినప్పటికీ కనీసం పదేళ్లు పడుతుందని అమిర్ ఖాన్ భావిస్తున్నాడు.

ఎప్పుడు మొదలవుతుందో

ఎప్పుడు మొదలవుతుందో

అమిర్ ఖాన్ తో ముఖేష్ అంబానీ చర్చలు జరపడం మహా భారతం విషయంలో తొలి అడుగు మాత్రమే. మహా భారతం ఎప్పుడు ప్రారంభం అవుతుందో అని అభిమానులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

English summary
Aamir’s Mahabharata to be produced by Mukesh Ambani. First step is success
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X