twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అవి ఫ్యామిలీఫేర్ అవార్డ్స్.. అందుకే బహిష్కరించాను.. బాలీవుడ్‌పై అభయ్ డియోల్ ఘాటు వ్యాఖ్యలు

    |

    సుశాంత్ సింగ్ ఆత్మహత్య ఘటన తరువాత బాలీవుడ్‌లో ఆగ్రహ జ్వాలలు వెల్లువెత్తుతున్నాయి. ఇన్నాళ్లు పాతుకుపోయిన బంధుప్రీతి, మూవీ మాఫియాపై అందరూ కన్నెర్ర చేస్తున్నారు. వీటిపై ఒక్కొక్కరుగా స్పందిస్తూనే ఉన్నారు. ఇక సోషల్ మీడియాలో అయితే కరణ్ జోహర్, అలియా భట్, సల్మాన్ ఖాన్, మహేష్ భట్ వంటివారిని ఓ రేంజ్‌లో ట్రోల్ చేస్తున్నారు. తాజాగా బాలీవుడ్ నటుడు అభయ్ డియోల్ బాలీవుడ్ అవార్డు వేడుకల గురించి సెటైర్స్ వేశాడు.

    బాలీవుడ్‌పై ఫైర్..

    బాలీవుడ్‌పై ఫైర్..

    ప్రస్తుతం బాలీవుడ్‌కు గట్టి సెగ తగులుతోంది. ఎంతో ప్రతిభ, భవిష్యత్తు ఉన్న సుశాంత్ ఆత్మహత్య వెనుక బాలీవుడ్ పెద్దల హస్తం ఉందని నెటిజన్లు ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. సుశాంత్ మృతిపై సీబీఐ దర్యాప్తు చేయించాలని, కరణ్ జోహర్ వంటి వారిని అందులో విచారించాలని డిమాండ్ చేస్తున్నారు.

    కంగనా ఫైర్..

    కంగనా ఫైర్..


    బాలీవుడ్ నెపోటిజం గురించి కంగనా మొదటి నుంచి చెప్పుకొస్తూనే ఉంది. నాడు కంగనా మాట్లాడిన విషయాలన్నీ నేడు మళ్లీ వైరల్ అవుతున్నాయి. తాజాగా కంగనా సైతం బాలీవుడ్‌ను తప్పు బట్టింది. ఏనాడు కూడా నటీనటులకు క్రెడిట్ ఇవ్వలేదు, స్టార్స్‌కు మాత్రమే ఇచ్చేవారని ఘాటుగా స్పందించింది.

    దబంగ్ డైరెక్టర్..

    దబంగ్ డైరెక్టర్..


    దబంగ్ డైరెక్టర్ అభినవ్ కశ్యప్ అయితే ఏకంగా సల్మాన్, ఆయన ఫ్యామిలీ గుట్టు విప్పేశాడు. దబంగ్ సినిమా తరువాత ఎంతలా హింసించారో, ఎలా బ్లాక్ మెయిల్ చేశారో పూస గుచ్చినట్టు వివరించాడు. ఎక్కడా కూడా పని దొరక్కుండా చేశారని, ఫ్యామిలీని చంపేస్తామని బెదిరించారని తెలిపాడు.

    సోను నిగమ్ సైతం..

    సోను నిగమ్ సైతం..


    బాలీవుడ్ సింగర్ సోను నిగమ్ సైతం ఆసక్తికర కామెంట్స్ చేశాడు. త్వరలోనే సంగీత ప్రపంచంలోనూ చావులు చూడబోతారని సోషల్ మీడియా ద్వారా రాసుకొచ్చాడు. సినిమా ప్రపంచంలో కంటే సంగీత ప్రపంచంలోనే మాఫియా ఎక్కువని, రెండు కంపెనీలే అంతా డిసైడ్ చేస్తాయని చెప్పుకొచ్చాడు.

    అవి ఫ్యామిలీ ఫేర్ అవార్డ్స్..

    అవి ఫ్యామిలీ ఫేర్ అవార్డ్స్..


    2011 లో విడుదలైన జిందగి నా మిలేగి దోబారా చిత్రానికి గానూ బెస్ట్ లీడ్ రోల్స్‌కు హృతిక్ కరీనాలను ఎంచుకున్నారని, అయితే సపోర్టింగ్ రోల్స్ కోసం మమ్మల్ని సెలెక్ట్ చేసి అవమానించారని తెలిపాడు. నిజానికి ఆ చిత్రంలో ఈ ముగ్గురి పాత్రలు సరిసమానమే అయినా.. తమను కావాలనే అలా చేశారని చెప్పుకొచ్చాడు. మనకు వ్యతిరేకంగా పని చేస్తూ లాబీయింగ్ చేసేవాళ్లు ఎంతోమంది ఉంటారని, అవి ఫ్యామిలీఫేర్ అవార్డ్స్ అంటూ చెప్పుకొచ్చాడు. అందుకే నేను వాటికి బహిష్కరించానని తెలిపాడు.

    English summary
    Abhay Deol Satires On Filmfare Awards Calling As Familyfare Awards. Zindagi Na Milegi Dobara”, released in 2011. Need to chant this title to myself everyday nowadays! Also a great watch when anxious or stressed.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X