twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సంచలనం రేపుతున్న ట్రైలర్: మన్మోహన్, సోనియా, రాహుల్ గాంధీ... కాంగ్రెస్ మీద ప్రభావం?

    |

    2019 సాధారణ ఎన్నికలు సమీపిస్తున్న వేళ విడుదలవుతున్న కొన్ని సినిమాలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశం అయ్యాయి. అలాంటి చిత్రాల్లో ఒకటి 'ది యాక్సిడెంటల్‌ ప్రైమ్‌ మినిస్టర్‌'. 2004 నుండి 2008 మధ్యకాలంలో మన్మోహన్ నేషనల్‌ సెక్యూరిటీ అడ్వైజర్‌‌గా పని చేసిన సంజయ్ బారు రాసిన వివాదాస్పద బుక్... 'ది యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్: ది మేకింగ్ అండ్ అన్ మేకింగ్ ఆఫ్ మన్మోహన్ సింగ్' ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు.

    తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ విడుదలైంది. మన్మోహన్ సింగ్ పాత్రలో అనుపమ్ ఖేర్ నటించారు. ఆయన లుక్ అచ్చం మన్మోహన్ సింగ్ పోలి ఉండటం ఆశ్చర్యపరుస్తోంది. విజయ్‌ రత్నాకర్‌ దర్శకత్వం వహించిన మూవీలో సోనియా గాంధీ పాత్రలో సుసాన్నే బెర్నెట్‌, ప్రియాంక గాంధీ పాత్రలో అహనా కుమ్రా, రాహుల్‌ గాంధీ పాత్రలో అర్జున్‌ మాథుర్‌ నటించారు.

    మహాభారతంలో రెండు కుటుంబాలుండేవి. కానీ భారత్‌లో ఒకటే ఉంది

    మహాభారతంలో రెండు కుటుంబాలుండేవి. కానీ భారత్‌లో ఒకటే ఉంది

    మన్మోహన్ మీడియా అడ్వైజర్ సంజయ్‌ బారు పాత్రలో అక్షయ్ ఖన్నా నటించారు. ‘నాకు డాక్టర్‌ సాబ్‌ను చూస్తుంటే భీష్ముడు గుర్తుకొస్తున్నారు. ఆయనలో ఏ చెడూ లేదు. కానీ ఫ్యామిలీ డ్రామా బాధితుల్లో ఆయన ఒకరు', ‘మహాభారతంలో రెండు కుటుంబాలుండేవి. కానీ భారత్‌లో ఒకటే ఉంది' అనే డైలాగ్స్ సంచలనం రేపుతున్నాయి.

    ఓ ప్రధాని ఏం చేయాలో ఎన్‌ఎస్‌ఏ నిర్ణయిస్తారా?

    ఓ ప్రధాని ఏం చేయాలో ఎన్‌ఎస్‌ఏ నిర్ణయిస్తారా?

    తన జీవితం ఆధారంగా సంజయ్‌ బారు రాస్తున్న విషయం తెలియడంతో మన్మోహన్ ‘ఓ ప్రధాని ఏం చేయాలో ఎన్‌ఎస్‌ఏ నిర్ణయిస్తారా? ప్రధాని అంటే వ్యాపారం అనుకుంటున్నారా?' అని ప్రశ్నిస్తారు. ఇందుకు సంజయ్‌.. ‘నో నో..సర్‌. ది డాక్టర్‌ సింగ్‌ అంటే వ్యాపారం' అనే డైలాగ్స్ సినిమాపై ఆసక్తి మరింత పెంచాయి.

    కాంగ్రెస్ పార్టీపై ప్రభావం చూపుతుందా?

    కాంగ్రెస్ పార్టీపై ప్రభావం చూపుతుందా?

    2019లో సాధారణ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో..... సోనియా గాంధీ, రాహుల్ గాంధీ పాత్రలను కూడా ప్రధానంగా చూపిస్తున్న ఈ సినిమా కాంగ్రెస్ పార్టీపై ఎలాంటి ప్రభావం చూపుతుంది? అనేది హాట్ టాపిక్ అయింది.

    ట్రైలర్

    సునీల్‌ బోహ్రా, జయంతిలాల్‌ గదా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 2019 జనవరి 11న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తెచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారు.

    English summary
    Accidental Prime Minister trailer released. Anupam Kher plays Manmohan Singh in The Accidental Prime Minister and Akshaye Khanna plays his media advisor Sanjaya Baru. The film is based on the book The Accidental Prime Minister by Sanjaya Baru, Singh's media advisor.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X