»   »  బాలీవుడ్‌లో విడిపోయిన మరో జంట! హృతిక్ భార్యనే కారణామా?

బాలీవుడ్‌లో విడిపోయిన మరో జంట! హృతిక్ భార్యనే కారణామా?

By Rajababu
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  బాలీవుడ్‌లో మరో జంట విడిపోవడానికి రంగం సిద్ధమైంది. బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్ దంపతులు తమ 20 ఏళ్లకుపైగా దాంపత్య జీవితానికి ముగింపు పలకబోతున్నారు. ప్రస్తుతం అర్జున్ రాంపాల్, తన భార్య మెహర్ జెస్సికా తమ ఇంటి నుంచి బయటకు వచ్చి వేర్వేరుగా ఉంటున్నట్టు బాలీవుడ్ పత్రికల కథనం. వివరాల్లోకి వెళితే..

  అర్జున్ రాంపాల్‌ బ్రేకప్‌కు కారణం

  అర్జున్ రాంపాల్‌ బ్రేకప్‌కు కారణం

  అర్జున్ రాంపాల్, మెహర్ జెస్సికా దాంపత్యంలో విభేదాలు చోటుచేసుకోవడానికి బాలీవుడ్ నటుడు హృతిక్ రోషన్ భార్య సుజానే ఖాన్‌ కారణమని బాలీవుడ్ పత్రికలు కోడైకూసిన సంగతి తెలిసిందే. సుజానే ఖాన్‌తో అర్జున్ రాంపాల్ కొద్దికాలంగా అఫైర్ కొనసాగిస్తున్నారు. ఆ కారణంగానే హృతిక్, సుజానేలు విడిపోయారు అని సినీ వర్గాలు చెప్పుకొంటాయి.

  హృతిక్, సుజానే విడిపోవడానికి

  హృతిక్, సుజానే విడిపోవడానికి

  హృతిక్, సుజానే విడిపోయిన తర్వాత అర్జున్‌ రాంపాల్‌తో అతిసన్నిహితంగా వ్యవహరిస్తున్నట్టు వార్తలు వచ్చాయి. ఆ కారణంగానే మెహర్ జెస్పికా, అర్జున్ రాంపాల్ మధ్య గొడవలు ప్రారంభమయ్యాయని చెప్పుకొంటారు. సుజానే‌తో సంబంధం వల్లనే తాజాగా వారిద్దరూ విడిపోవడం జరిగిందని ఓ కథనంలో పేర్కొన్నారు.

  హృతిక్ బ్రేకప్‌పై స్పందన

  హృతిక్ బ్రేకప్‌పై స్పందన

  అయితే తమ వైవాహిక జీవితంలో కలతలు రావడానికి కారణం సుజానే కాదని నటుడు అర్జున్ రాంపాల్ ఓ ప్రకటన విడుదల చేశారు. హృతిక్, సుజానే బ్రేకప్‌కు తాను కారణం కాదని వివరణ ఇచ్చారు. వారి బ్రేకప్‌కు నేనే కారణం అని వచ్చిన వార్తలను నన్ను చాలా బాధించాయి అని అర్జున్ రాంపాల్ తన ఆవేదన వ్యక్తం చేశారు.

  నాపై వార్తలు రూమర్లే

  నాపై వార్తలు రూమర్లే

  హృతిక్ వైవాహిక జీవితం దెబ్బ తినడానికి తానే కారణమని వచ్చిన వార్తలను చదివాను. నాపై వచ్చిన వార్తలు కేవలం రూమర్లు మాత్రమే. వారిద్దరు విడిపోవాల్సి రావడం దురదృష్టకరం. ఆ సమయంలో మెహర్, నేను చాలా బాధపడ్డాం. వారి జీవితాలు సుఖ: సంతోషాలతో ఉండాలని కోరుకొన్నాం అని అర్జున్ రాంపాల్ తన ప్రకటనలో వెల్లడించారు.

  అర్జున్, జెసియా విడాకుల కోసం

  అర్జున్, జెసియా విడాకుల కోసం

  హృతిక్, సుజానే బ్రేకప్ తర్వాత అర్జున్ రాంపాల్ వైవాహిక జీవితం గాడిలో పడినట్టు కనిపించింది. అర్జున్ కూతుళ్లు మహిఖ, మైరా, భార్య మెహర్‌తో కలిసి కొన్నిరోజులపాటు ఆనందంగా ఉన్నారు. కానీ ఈ మధ్య వారి జీవితంలో మళ్లీ విభేదాలు చోటుచేసుకొన్నాయి. ఈ సారి వారి మధ్య పూడ్చలేని అగాధం ఏర్పడింది అని ఓ పత్రిక కథనాన్ని వెల్లడించింది.

  సుజానే కోసం అర్జున్ రాంపాల్

  సుజానే కోసం అర్జున్ రాంపాల్

  ప్రస్తుతం హృతిక్, సుజానే విడివిడిగానే ఉంటున్నారు. వారి పిల్లల కోసం అప్పుడప్పుడు కలుస్తున్నారు. కానీ మళ్లీ కలిసి జీవితాన్ని ప్రారంభించే అవకాశాలు కనిపించడం లేదు. సుజానేకు దగ్గరవ్వడానికే అర్జున్ రాంపాల్ తన భార్యకు దూరమవుతున్నారనే వార్త కూడా ప్రచారంలో ఉంది.

  English summary
  After two decades of marriage, Arjun Rampal and Mehr Jessia are headed for splitsville. Bollywood magazine reported that Arjun and Mehr's differences escalated to a point where he moved out of their house and is living separately. A few years ago, speculation was rife that Arjun's growing closeness with Sussanne Khan had resulted in cracks appearing in their respective marriages.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more