»   » త్వరలో శ్వేతబసు పెళ్లి.. గుట్టుచప్పుడు కాకుండా నిశ్చిత్తార్థం.. వరుడు ఎవరంటే!

త్వరలో శ్వేతబసు పెళ్లి.. గుట్టుచప్పుడు కాకుండా నిశ్చిత్తార్థం.. వరుడు ఎవరంటే!

By Rajababu
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  కొత్త బంగారు లోకంతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన అందాల తార శ్వేతబసు ప్రసాద్ త్వరలో వివాహం చేసుకొనున్నారు. హిందీ సినీ దర్శకుడు రోహిత్‌ మిట్టల్‌తో నిశ్చితార్థం జరిగింది. ఈ వార్త చాలా ఆలస్యంగా మీడియాలో వెలుగు చూసింది. 2002లో మక్డీ చిత్రంతో బాలతార సినీరంగంలో ప్రవేశించిన ఆమె పలు హిందీ, తెలుగు చిత్రాల్లో నటించారు. వరుణ్ ధావన్, ఆలియా భట్ నటించిన బద్రీనాథ్ కి దుల్హానియా చిత్రంలో చివరిసారిగా కనిపించారు.

  నాలుగేళ్లుగా శ్వేతబసు అఫైర్‌లో

  నాలుగేళ్లుగా శ్వేతబసు అఫైర్‌లో

  శ్వేతబసు, రోహిత్ నాలుగేళ్లుగా అఫైర్‌లో ఉన్నారు. గతేడాది వారి నిశ్చితార్థం జరిగింది. వారిద్దరూ కలిసి చాలా షార్ట్ ఫిలింస్ రూపొందించారు. వారి మధ్య ప్రేమ బలపడటానికి దర్శకుడు అనురాగ్ కశ్యప్ కారణం. ఆయన వల్లనే వారి మధ్య సన్నిహిత సంబంధాలు ఏర్పడ్డాయి అని ఓ ఆంగ్ల దినపత్రిక తన కథనంలో పేర్కొన్నది.

  ప్రేమలో పడ్డారిలా..

  ప్రేమలో పడ్డారిలా..

  శ్వేత, రోహిత్ మధ్య ప్రేమ చాలా ఆశ్చర్యకరమైన రీతిలో చిగురించింది. తొలుత గోవాలో రోహిత్‌కు శ్వేత ప్రపోజ్ చేసింది. తన ప్రేమను వ్యక్తీకరించడానికి రోహిత్ కాస్త సమయం తీసుకొన్నారు. ఆ తర్వాత పూణేలో శ్వేతబసు ప్రేమను రోహిత్ అంగీకరించారు.

  నిశ్చితార్థం నిజమే

  నిశ్చితార్థం నిజమే

  నిశ్చితార్థం తర్వాత శ్వేత, రోహిత్ తొందరపడకుండా ఆచీతూచి పెళ్లి చేసుకోవాలనే నిర్ణయానికి వారిద్దరు వచ్చినట్టు సమాచారం. తన నిశ్చితార్థం వార్తపై స్పందిస్తూ.. రోహిత్ ఎంగేజ్‌మెంట్ జరిగింది నిజమే. మా అఫైర్ పూర్తిగా వ్యక్తిగతం. దాని గురించి ఎక్కువ మాట్లాడలేను అని శ్వేతబసు మీడియాతో అన్నారు.

  వివాదంలో శ్వేతబసు

  వివాదంలో శ్వేతబసు

  శ్వేతబసు కేవలం వెండితెరపైనే కాకుండా బుల్లితెరపైనా కూడా రాణించారు. కహాని ఘర్ ఘర్ కీ, కరిష్మా కా కరిష్మా, కుటుంబ్, ఇతర సీరియల్స్‌లో నటించారు. త్వరలోనే ఆమె నటించిన ది తాష్కెంట్ ఫైల్స్ సీరియల్ ప్రసారం కానున్నది. తెలుగులో ఆమె నటించిన కొన్ని చిత్రాలు మంచి విజయాన్ని సాధించాయి. ఓ వివాదం కారణంగా తెలుగు సినీ పరిశ్రమకు ఆమె దూరమయ్యారు.

  English summary
  Actor Shweta and Director Rohit Mittal had been dating for about four years before finally getting engaged in 2017. Shweta known for her brilliant performace in Kotta Bangaru Lokam. Shweta was last seen in Varun Dhawan and Alia Bhatt starrer Badrinath Ki Dulhania but she's been pretty active in Telugu cinema.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more