For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Actor Sidharth Shukla Death: సిద్ధార్థ్ శుక్లా ఎమోషనల్ మెసేజ్.. ఇన్‌స్టాలో చేసిన చివరి పోస్ట్ ఇదే!

  |

  ఈ మధ్య కాలంలో దేశ వ్యాప్తంగా ఉన్న అన్ని సినీ ఇండస్ట్రీలో వరుసగా ప్రముఖుల మరణాలు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే ఎంతో మంది నటీనటులు, టెక్నీషియన్లు, సినీ కార్మికులు పలు కారణాలతో ప్రాణాలను కోల్పోయారు. కరోనా మహమ్మారి బారిన పడి మరికొందరు కన్నుమూశారు. ఇలాంటి పరిస్థితుల్లో తన నటనతో దేశ వ్యాప్తంగా గుర్తింపును తెచ్చుకున్న ప్రముఖ సీరియల్ నటుడు, బిగ్ బాస్ పదమూడో సీజన్ విన్నర్ సిద్ధార్థ్ శుక్లా గుండెపోటుతో మరణించాడు. ఈ నేపథ్యంలో అతడు చివరి సారిగా ఇన్‌స్టాగ్రామ్‌లో చేసిన పోస్ట్ వైరల్ అవుతోంది. ఇంతకీ అందులో ఏముంది? చూద్దాం పదండి!

  అలా మొదలైన కెరీర్‌... స్టార్‌గా

  అలా మొదలైన కెరీర్‌... స్టార్‌గా

  నలభై ఏళ్ల సిద్ధార్థ్ శుక్లా మొదట సీరియల్ యాక్టర్‌గా కెరీర్‌ను ఆరంభించాడు. ఈ క్రమంలోనే ఎన్నో సీరియళ్లలో నటించాడు. అందులో 'బాలిక వధు' (చిన్నారి పెళ్లి కూతురు) అతడిని దేశ వ్యాప్తంగా స్టార్‌ను చేసేసింది. దీని తర్వాత పలు సీరియళ్లు, రియాలిటీ షోలు చేశాడు. ఈ క్రమంలోనే గత ఏడాది బిగ్ బాస్ 13వ సీజన్ విన్నర్‌గా నిలిచాడు. దీంతో అతడి పేరు మారుమ్రోగిపోయింది.

  టాప్‌ తీసేసి హీరోయిన్ హాట్ సెల్ఫీ: పెళ్లైన తర్వాత కూడా అందాలు మొత్తం చూపించిందిగా!

  ఆమెతో లవ్ ట్రాక్.. చివరిసారి

  ఆమెతో లవ్ ట్రాక్.. చివరిసారి

  సిద్ధార్థ్ శుక్లా బిగ్ బాస్ హౌస్‌లో ఉన్న సమయంలో షెహనాజ్ గిల్‌తో ప్రేమాయణం నడిపినట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అందులో వీళ్లిద్దరూ చెట్టాపట్టాలేసుకుని తిరగడమే దీనికి కారణం. ఇక, ఇటీవలే మొదలైన బిగ్ బాస్ ఓటీటీ సీజన్‌లోకి వీళ్లిద్దరూ జంటగా ఎంట్రీ ఇచ్చారు. సిద్ధార్థ్ శుక్లా చివరిసారి అందులోనే కనిపించాడు. అతడు ప్రస్తుతం పలు సిరీస్‌లు, సినిమాలు చేస్తున్నాడు.

  ఆ రెండు రంగాల్లో తీవ్ర విషాదం

  ఆ రెండు రంగాల్లో తీవ్ర విషాదం

  సీరియల్ నటుడిగా కెరీర్‌ను ప్రారంభించి.. ఇప్పుడు బాలీవుడ్‌లో స్థిరపడిన సిద్ధార్థ్ శుక్లా కొద్ది సేపటి క్రితం ముంబైలోని కూపర్ ఆస్పత్రిలో కన్నుమూశాడు. గుండెపోటుతో ఆయన మరణించినట్లు ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. దీంతో అటు టెలివిజన్ రంగంలోనూ, ఇటు బాలీవుడ్‌లోనూ విషాద ఛాయలు అలముకున్నాయి. సిద్ధార్థ్ శుక్లా మృతిపై ప్రముఖులంతా సంతాపం తెలుపుతున్నారు.

  మహేశ్ బాబు అదిరిపోయే రికార్డ్: పవన్‌కు బిగ్ షాక్.. అగ్రస్థానంలో ప్రభాస్‌.. ఏ హీరో ర్యాంక్ ఎంతంటే!

  మృతిపై అనుమానాలు వ్యక్తం

  మృతిపై అనుమానాలు వ్యక్తం

  సిద్ధార్థ్ శుక్లా మొదట గుండెపోటు కారణంగానే మరణించినట్లు వార్తలు వచ్చాయి. ఆ తర్వాత ఆయన మృతిపై సందేహాలు ఉన్నట్లు ప్రచారం మొదలైంది. బాలీవుడ్ వర్గాల్లో వైరల్ అవుతోన్న సమాచారం ప్రకారం.. బుధవారం రాత్రి పడుకునే ముందు సిద్ధార్థ్ శుక్లా ఏవో టాబ్లెట్లు వేసుకున్నాడట. ఈ కారణంగానే అతడు మరణించి ఉండొచ్చన్న టాక్ కూడా గట్టిగానే వినిపిస్తోంది.

  ఇన్‌స్టాలో చివరి పోస్ట్ వాళ్లపై

  ఇన్‌స్టాలో చివరి పోస్ట్ వాళ్లపై


  సిద్ధార్థ్ శుక్లా సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉంటాడు. దీని ద్వారా తన అభిమానులతో నిత్యం టచ్‌లో ఉండేవాడు. దాదాపు అన్ని సామాజిక మాధ్యమాల్లో అకౌంట్లు ఓపెన్ చేసిన అతడు.. సుదీర్ఘ కాలంగా తన అప్‌డేట్స్ ఇస్తున్నాడు. ఇక, చివరిగా ఆగస్టు 24న ఫ్రంట్‌లైన్ వారియర్స్ గురించి సిద్ధార్థ్ శుక్లా ఎమోషనల్ మెసేజ్ చేశాడు. ఇందులోనే తన వెబ్ సిరీస్‌‌ను ప్రమోట్ చేశాడు.

  అషు రెడ్డి ప్రైవేటు పార్ట్‌ను చూపించిన ఆర్జీవీ: పవన్ కల్యాణ్‌ కోసం ఆమెను బుక్ చేసేశాడుగా!

  Recommended Video

  Sohel Fun With House Arrest Movie Kids..నవ్వులే నవ్వులు
  ధైర్యంగా నిలబడ్డారు అంటూ

  ధైర్యంగా నిలబడ్డారు అంటూ

  సిద్ధార్థ్ శుక్లా చివరిగా చేసిన పోస్టులో 'ఫ్రంట్‌లైన్ యోధులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. మీరు మీ జీవితాలను పణంగా పెడతారు. లెక్కలేనన్ని గంటలు పని చేస్తారు. వారి కుటుంబాలతో ఉండలేని రోగులను ఓదార్చారు. మీరు నిజంగా ధైర్యవంతులు. ముందు వరుసలో ఉండటం అంత సులభం కాదు. కానీ మీ ప్రయత్నాలను మేము నిజంగా అభినందిస్తున్నాము. #MumbaiDiariesOnPrime ఈ సూపర్ హీరోలకు తెల్లని కేప్‌లు, నర్సింగ్ సిబ్బంది వారి లెక్కలేనన్ని త్యాగాలకు ఆదర్శం. ఆగష్టు 25న ట్రైలర్ విడుదల అవుతుంది' అని పేర్కొన్నాడు.

  English summary
  Famous Actor, Bigg Boss 13 Winner Sidharth Shukla Paased Away Due to Cardic Arrest in Cooper Hospital in Mumbai today.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X