Don't Miss!
- News
ఢీ అంటే ఢీ అంటున్న రెండు పవర్ సెంటర్లు?
- Finance
Home Loan: హోమ్ లోన్ తీసుకోవాలనుకుంటున్నారా..? కొత్త టాక్స్ సిష్టం బెటరా..? పాతదే మేలా..?
- Travel
సందర్శకులను కనువిందుచేసే కొల్లేరు బోటు షికారు!
- Sports
INDvsAUS : ఈ మూడు విషయాలే సిరీస్ విజేతను నిర్ణయిస్తాయి..!
- Technology
వన్ ప్లస్ 11 స్పెసిఫికేషన్లు లీక్ ! లాంచ్ మరో రెండు రోజుల్లోనే ...!
- Lifestyle
Valentines Day 2023: వాలెంటైన్స్ డే రోజు ఈ పనులు అస్సలే చేయొద్దు, ఉన్న మూడ్ పోయి సమస్యలు రావొచ్చు
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
ఉదయం పెళ్లి, రాత్రి మందు పార్టీ చేసుకొని ప్రమాదానికి గురైన హీరో.. గుట్టుచప్పుడు కాకుండా
బాలీవుడ్ యువ హీరో వరుణ్ ధావన్ తన చిన్ననాటి ప్రియురాలు నటాషా దలాల్‌ను ఈ రోజు (జనవరి 24) వివాహం చేసుకోనున్నారు. అలీబాగ్‌లోని మాన్షన్ హౌస్‌లో వారి వివాహ వేడుక జరుగుతుంది. అయితే శుభకార్యానికి వెళుతున్న సందర్భంలో అనుకోకుండా హీరో యాక్సిడెంట్ కు గురైనట్లు బాలీవుడ్ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి.
టీవీ యాంకర్ అర్చన విజయ: బికినిలో అందాలు ఆరబోత (ఫొటోలు)

అసలైతే గత ఏడాదిలోనే..
కోవిడ్ 19 మహమ్మారి కారణంగా వీరి వివాహం చాలా నెలలుగా వాయిదా పడుతూ వస్తోంది. అసలైతే గత ఏడాదిలోనే గ్రాండ్ గా నిర్వహించాలని అనుకున్నారు. ఇక మొత్తానికి నెలల తరబడి ఆలస్యం అయిన తరువాత, వరుణ్ ధావన్, నటాషా దలాల్ జనవరి 24న ఏడడుగులు వేయడానికి సిద్ధంగా ఉన్నారు. గత వారం నుంచే పెళ్లికి సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయి.

అనుకోకుండా అపశృతి
వివాహ వేడుకల కోసం అలీబాగ్‌లోని విలాసవంతమైన విల్లా, మాన్షన్ హౌస్‌ను బుక్ చేసుకున్నారు. వధువు, వరుడి కుటుంబాలు జనవరి 22న అలీబాగ్‌కు వెళ్లాయి. పలు పార్టీలతో ఎంతో ఆనందంగా పెళ్లి వేడుకలు కొనసాగాయి. కానీ ఫైనల్ గా పెళ్లికి ఒక రోజు ముందు సిద్దమవుతున్న తరుణంలో అనుకోకుండా ఒక అపశృతి చోటు చేసుకోవడం కొంత ఆందోళనను కలిగించింది.

యాక్సిడెంట్ కు గురైన వరుడు
బాలీవుడ్ మీడియాలో వచ్చిన కథనాలు ప్రకారం వరుణ్ స్నేహితులు పెళ్లి వేదికకు కొద్ది దూరంలో ఉన్న మరో విల్లా వద్దా వరుడి కోసం బ్యాచిలర్ పార్టీని నిర్వహించారు. అయితే శనివారం జరిగిన ఈ పార్టీలో అలీబాగ్ వెళ్తుండగా వరుణ్ కారుకు చిన్న ప్రమాదం జరిగింది. అదృష్టవశాత్తూ అది పెద్ద ప్రమాదం కాదని తెలుస్తోంది.

గుట్టుచప్పుడు కాకుండా
ఇక కారులో ఎవరికీ ఎటువంటి గాయాలు కాలేదు. వరుణ్ గుట్టుచప్పుడు కాకుండా ఆ విషయాన్ని క్లోజ్ చేసినట్లు తెలుస్తోంది. అందరికి తెలిస్తే మళ్ళీ పెళ్లిలో అదొక నెగిటివ్ వాతావరణాన్ని క్రియేట్ చేసే అవకాశం ఉందని ఎవరితోను చెప్పలేదని టాక్ వస్తోంది. కానీ అప్పటికే యాక్సిడెంట్ ను చూసిన కొందరు బయటవాళ్ళు మీడియాకు సమాచారం అందించినట్లు తెలుస్తోంది.

పెళ్లికి రాబోయే బాలీవుడ్ స్టార్స్..
ఇక వివాహ వేడుకకు వరుణ్ ధావన్ తండ్రి డేవిడ్ ధావన్ ఏర్పాట్లయితే గ్రాండ్ గా నిర్వహించినట్లు సమాచారం. ఇక వేడుకకు కేవలం అతికొద్ది మంది అతిధులు మాత్రమే రానున్నట్లు సమాచారం. బాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి వరుణ్ ధావన్ కు సన్నిహితులైన హీరో హీరోయిన్స్ అలాగే సల్మాన్ ఖాన్ కత్రినా కైఫ్ వంటి స్టార్స్ రాబోతున్నారు. పెళ్లి అనంతరం ముంబైలోని ఒక స్టార్ హోటల్ లో మళ్ళీ బాలీవుడ్ తారల కోసం ప్రత్యేకంగా ఒక రిసెప్షన్ పార్టీని నిర్వహించనున్నట్లు సమాచారం.