Don't Miss!
- News
అమరావతి కేసు విచారణ-సుప్రీం నిర్ణయంపై ఉత్కంఠ ? ఫాస్ట్ ట్రాక్ విజ్ఞప్తి, ఫిర్యాదుల నేపథ్యం !
- Finance
బిగ్ రిలీఫ్.. భారీగా తగ్గుతున్న బంగారం ధరలు; నేడు హైదరాబాద్, ప్రధాన నగరాల్లో ధరలిలా!!
- Technology
బెట్టింగులు, లోన్లు అంటూ ప్రజలను వేధిస్తున్న 230 యాప్ లు బ్యాన్!
- Sports
SA20 : దంచికొట్టిన సన్‌రైజర్స్ బ్యాటర్.. చిత్తుగా ఓడిన క్యాపిటల్స్!
- Lifestyle
Chanakya Niti: చాణక్య నీతి ప్రకారం ఈ పనులు చేసిన తర్వాత తప్పనిసరిగా స్నానం చేయాలి
- Travel
సందర్శకులను కనువిందుచేసే కొల్లేరు బోటు షికారు!
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
Rs.200 crore cheating case: జాక్వలైన్ ఫెర్నాండేజ్‌కు జైలు నుంచే డాన్ ఫోన్.. ఈడీ విచారణకు బాలీవుడ్ బ్యూటీ
మానీలాండరింగ్ కేసులో అరెస్ట్ అయిన సుఖేష్ చంద్రశేఖర్ వ్యవహారం బాలీవుడ్ నటి జాక్వలైన్ ఫెర్నాండేజ్ మెడకు చుట్టుకొనేలా కనిపిస్తున్నది. ఈ కేసులో ఆగస్టు 31వ తేదీన జాక్వలైన్ ఫెర్నాండేజ్‌ను విచారించిన ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) మరోసారి బాలీవుడ్ నటిని విచారించేందుకు సిద్ధమైంది. ముందస్తుగా జారీ చేసిన సమన్ల ప్రకారం జాక్వలైన్ ఫెర్నాండేజ్ శనివారం అంటే సెప్టెంబర్ 25వ తేదీన ఈడీ విచారణకు హాజరుకానున్నది. ఈ కేసు విచారణలోకి వెళ్తే..

రాన్ బాక్సీ కంపెనీ ప్రమోటర్లతో చీటింగ్
రాన్ బాక్సీ కంపెనీ ప్రమోటర్లు శివిందర్ సింగ్, మల్విందర్ సింగ్‌ను 200 కోట్ల మేరకు చీటింగ్ చేశారనే అభియోగాలపై సుఖేష్ చంద్రశేఖర్‌ను విచారించారు. ఆయన చెన్నై సముద్ర తీరంలో ఉన్న ఆయన నివాసంపై మెరుపు దాడులు నిర్వహించి రూ.85 లక్షల నగదు, భారీగా విలాసవంతమైన వస్తువులు, కీలక పత్రాలను స్వాధీనం చేసుకొన్నారు. ఆయన ఇంటిలో డజనుకుపైగా లగ్జరీ కార్లను ఈడీ అధికారులు సీజ్ చేశారు.

17 ఏళ్ల వయసులోనే నేరస్థుడిగా
ఇక సుఖేష్ చంద్రశేఖరన్ విషయానికి వస్తే.. బాల్యం నుంచి నేర ప్రవృత్తి కలిగి ఉన్నాడనే విషయం పోలీసులు విచారణలో బయటకు వచ్చింది. 17 ఏళ్ల వయసులో ఉన్నప్పుడే నేర ప్రపంచంలోకి ప్రవేశించాడు. ఆయనపై పలు కేసుల్లో ఎఫ్‌ఐఆర్‌లు నమోదయ్యాయి. ప్రస్తుతం రోహిణి జైలులో ఉన్నారు. ప్రస్తుతం నేరపూరిత కుట్ర, చీటింగ్, బెదిరించి డబ్బులు వసూలు చేయడంతోపాటు ప్రస్తుతం 200 కోట్ల చీటింగ్ వ్యవహారంపై ఈడీ దృష్టిపెట్టంది.

సుఖేష్ భార్య కారణంగానే జాక్వలైన్
అయితే సుఖేష్ చంద్రశేఖరన్ మనీలాండరింగ్ కేసులో భార్య పన్నిన ఉచ్చులో జాక్వలైన్ ఇరుక్కుపోయారనే విషయం బాలీవుడ్ వర్గాల్లో చర్చనీయాంశమైంది. అయితే ఈ కేసులో జాక్వలైన్ పాత్ర ఏమిటో ఇంత వరకు బయటకు రాలేదు. కానీ ఆమెను ఇప్పటికే పలుమార్లు విచారించారు. అయితే ఆమెను నిందితురాలిగా కాకుండా సాక్షిగానే విచారిస్తున్నామని ఈడీ అధికారులు పేర్కొన్నారు.

రోహిణి జైలు నుంచి జాక్వలైన్‌తో ఫోన్‌లో
అయితే రోహిణి జైలులో ఉంటూనే సుఖేష్ చంద్రశేఖర్ తన నేర కార్యకలాపాలను కొనసాగించారు. జైలులో ఉంటూ జాక్వలైన్ ఫెర్నాండేజ్‌తో ఫోన్‌లో మాట్లాడారు. ఆమెకు మెసేజ్‌లు పంపుతూ కొన్ని వ్యవహారాలపై సంభాషించారనే విషయం ఈడీ విచారణలో బయటపడింది. ఈ విషయంలో జాక్వలైన్‌కు సుఖేష్ చంద్రశేఖర్‌కు ఉన్న సంబంధాలపై ఆరా తీస్తున్నారు. ఈ కేసులో గత నెల ఐదు గంటలపాటు విచారించిన అధికారులు మరోసారి సెప్టెంబర్ 25వ తేదీన విచారించేందుకు సిద్దమయ్యారు.
Recommended Video

జాక్వలైన్ ఫెర్నాండేజ్ కెరీర్ ఇలా
బాలీవుడ్‌లో అగ్ర హీరోలతో నటిస్తున్న జాక్వలైన్ ఫెర్నాండేజ్ ప్రస్తుతం సల్మాన్ ఖాన్, అక్షయ్ కుమార్, రణ్‌వీర్ సింగ్‌తో నటిస్తున్నారు. ఇటీవల ఆమె నటించిన బూత్ పోలీస్ చిత్రం విడుదలైంది. ప్రస్తుతం జాన్ అబ్రహంతో ఎటాక్ చిత్రంలో, సల్మాన్ ఖాన్‌తో కిక్2 చిత్రం, రణ్‌వీర్ సింగ్‌తో సర్కస్, అక్షయ్ కుమార్‌తో రామ్ సేతు, ఇంకా బచ్చన్ పాండే చిత్రాల్లో నటిస్తున్నారు.