Don't Miss!
- News
గవర్నర్ పై తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం..!?
- Sports
ఇదో చెత్త పిచ్.. టీ20లకు పనికిరాదు: హార్దిక్ పాండ్యా
- Lifestyle
హాట్ అరోమా ఆయిల్ మేనిక్యూర్ గురించి మీకు తెలుసా? రఫ్ హ్యాండ్స్ ని చేతిని మృదువుగా చేస్తుంది!
- Finance
BharatPe: భారత్ పే వ్యవస్థాపకుడి జీతం ఎంతో తెలుసా..? మిగిలిన వారి జీతాలు ఇలా..
- Automobiles
మార్కెట్లో విడుదలకానున్న కొత్త మారుతి కార్లు.. మరిన్ని వివరాలు
- Technology
20 లక్షల మంది Active వినియోగదారులను కోల్పోయిన Jio ! కారణం తెలుసుకోండి!
- Travel
పచ్చని గిరులు మధ్య దాగిన పుణ్యగిరి జలపాతం!
రాఖీ సావంత్ అరెస్ట్.. మరో స్టార్ హీరోయిన్ ఫిర్యాదుతో..
శృంగార తార రాఖీ సావంత్‌ను ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు. తనను కించపరిచే విధంగా వీడియోను రిలీజ్ చేయడంతో మరో శృంగార తార షెర్లీన్ చోప్రా పోలీసులకు ఫిర్యాదు చేశారు. షెర్లీన్ ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు రాఖీని అంబోలి పోలీసులు అరెస్ట్ చేయడం బాలీవుడ్‌లో చర్చనీయాంశమైంది. రాఖీ సావంత్ అరెస్ట్ వార్తను షెర్లీన్ ధృవీకరించారు. ఆ వివాదం వివరాల్లోకి వెళితే..
రాఖీ సావంత్ అరెస్ట్ వార్తను ధృవీకరిస్తూ షెర్లీన్ చోప్రా ట్వీట్ చేసింది. బ్రేకింగ్ న్యూస్.. నా ఫిర్యాదును గౌరవించి రాఖీ సావంత్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. 883 సెక్షన్ 2022 ప్రకారం ఆమెను అరెస్ట్ చేశారు. అరెస్ట్ నుంచి తప్పించుకోవడానికి రాఖీ సావంత్ చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. ఆమె దాఖలు చేసిన పిటిషన్‌ను ముంబై పోలీసులు తిరస్కరించారు అని షెర్లీన్ చోప్రా ట్వీట్‌లో తెలిపారు.

రాఖీ సావంత్ అరెస్ట్ తర్వాత మీడియాతో షెర్లీన్ చోప్రా మాట్లాడుతూ.. నాపై అభ్యంతరకరమైన వీడియోలు పోస్ట్ చేసింది. నేను చేసిన ఫిర్యాదును పోలీసులు గౌరవించారు. నవంబర్‌లో నేను దాఖలు చేసిన పిటిషన్‌కు సానుకూలంగా స్పందించి అరెస్ట్ చేశారు. ఈ దేశంలో చట్టాలను ఉల్లంఘించే ఏ ఒక్కరు కూడా శిక్ష నుంచి తప్పించుకోలేరని ముంబై పోలీసుల నిరూపించారు.
ఏ మహిళనైనా మరో మహిళ దూషించకూడదు. వారి ఫోటోలను, వీడియోలను అభ్యంతరకరంగా చూపించకూడదు అని చట్టం చెబుతుంది. కానీ రాఖీ సావంత్ మీడియాను పిలిచి.. ఇవి షెర్లీన్ చోప్రా న్యూడ్ ఫోటోలు, వీడియోలు ఇవి. చూడండి.. చూడండి అంటూ పిలిచి చూపించింది అని షెర్లీన్ చెప్పింది.
అయితే రాఖీ సావంత్‌తో నాకు ఎలాంటి వివాదం, గొడవ లేదు. అయితే నేను అమ్మాయిలను మోసం చేసి.. వేషాల పేరుతో వాడుకొనే వారిపైనే నా పోరాటం. వారికి రాఖీ సావంత్ అండగా ఉంటుంది. అందుకే నేను కేసు నమోదు చేశాను.