నా బ్రెస్ట్ సైజ్ సరిపోదట, అలా చేయమని అసభ్యంగా.. దర్శకుడిపై నటి ఆరోపణలు
సినీ ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఎప్పటి నుంచో ఉన్న ఈ క్యాస్టింగ్ కౌచ్ పై అప్పట్లో నటీమణులు నోరు విప్పలేదు. కానీ ఈ మధ్య సోషల్ మీడియా వాడకం పెరగడం, మీటూ ఉద్యమం యాక్టివ్ గా రన్ కావడంతో ప్రతి ఒక్కరూ తమ జీవితాల్లో ఎదుర్కొన్న చేదు అనుభవాలను ఒక్కొక్కటిగా బయటపెడుతున్నారు. ఈ క్రమంలో ఇటీవల ఎక్కువగా ఈ క్యాస్టింగ్ కౌచ్ వివాదం ఎదుర్కొంటున్న డైరెక్టర్ సాజిద్ ఖాన్. ప్రస్తుతం బిగ్ బాస్ హిందీ 16వ సీజన్ లో పార్టిస్ పేట్ చేస్తున్న ఈ డైరెక్టర్ పై తాజాగా మరో నటి షాకింగ్ కామెంట్స్ చేసింది.

2018లో మీటూ ఉద్యమం..
బాలీవుడ్ దర్శక నిర్మాత సాజిద్ ఖాన్ పై ఆరోపణలు వెల్లువెత్తడం తగ్గట్లేదు. 2018లో మీటూ ఉద్యమం జరిగినప్పుడు అతనిపై అనేక ఆరోపణలు వచ్చాయి. ఇప్పటికే చాలా మంది నటీమణలు సాజిద్ ఖాన్ పై ఆరోపణలు చేశారు. తమతో మిస్ బిహేవ్ చేశాడని, ఆఫర్స్ ఇప్పిస్తానని చెప్పి తమను వాడుకున్నాడని, సంభోగం, ప్రైవేట్ పార్ట్స్ ఇలా అసభ్యకరంగా ప్రవర్తించాడని విమర్శలు వెల్లువెత్తాయి.

దర్శకుడిపై నటీమణుల ఆరోపణలు..
ఇక ఈ దర్శకనిర్మాత సాజిద్ ఖాన్ ఇటీవల బాలీవుడ్ కండల వీరుడు హోస్ట్ చేస్తున్న బిగ్ బాస్ హిందీ 16వ సీజన్ లో పార్టిస్ పేట్ చేస్తున్నాడన్న విషయం తెలిసినప్పటి నుంచి విమర్శలు, ఆరోపణలు మరింత ఎక్కువయ్యాయి. ఇప్పటివరకు ఆయనపై షెర్లిన్ చోప్రా, కనిష్క సోని, ఆహానా కుమ్రా, ఉర్ఫీ జావేద్, తనుశ్రీ దత్తా, రాణి ఛటర్జీ, మోడల్ ఫౌలా వంటి తదితరులు అనేక ఆరోపణలు చేశారు.

సుమారు 14 ఏళ్ల క్రితం..
అలాగే సాజిద్ ఖాన్ కు బిగ్ బాస్ లో అవకాశం ఇవ్వడంపై బిగ్ బాస్ ను కూడా తప్పు బట్టారు. అయితే ఇప్పుడు తాజాగా సాజిద్ ఖాన్ పై మరో నటి షీలా ప్రియా సేథ్ విమర్శలు చేసింది. సుమారు 14 ఏళ్ల క్రితం సాజిద్ ఖాన్ తనతో అసభ్యంగా ప్రవర్తించాడని చెప్పుకొచ్చింది. ఇంతకు ముందు సౌత్ ఇండియా లాంగ్వేజెస్ అయిన తమిళం, కన్నడ, మలయాళం తదితర భాషల్లో నటించే సమయంలో ఈ అనుభవం ఎదురైందని చెప్పింది.

కొన్ని ఆయిల్స్ వాడాలని..
"నేను డైరెక్టర్ సాజిద్ ఖాన్ ను 2008లో మొదటిసారి కలిశాను. అతని అప్ కమింగ్ ప్రాజెక్ట్ లో నటించడానికి నాకు అవకాశం ఇవ్వమని కోరాను. కానీ అతను చేసిన చేష్టలకు అడగడం మానేశాను. అతను ఐదు నిమిషాలపాటు నా ప్రైవేట్ పార్ట్స్ వైపు చూస్తూనే ఉన్నాడు. అలా చూశాకా నీ బ్రెస్ట్ సైజ్ బాలీవుడ్ కు సరిపోదు. నువ్ వాటికి సర్జరీ చేసుకోవాలి. వక్షోజాలు పెరగడానికి కొన్ని ఆయిల్స్ వాడాలని చెప్పారు.

తానే మసాజ్ చేస్తానన్నాడు..
ఆ ఆయిల్స్ తో రోజు తానే మసాజ్ చేస్తానని, అలా అయితేనే సినిమాల్లో నటించగలవని చెప్పాడు" అని నటి షీలా ప్రియా సేథ్ చెప్పుకొచ్చింది. ఇదంతా చూస్తుంటే రోజురోజుకీ డైరెక్టర్ సాజిద్ ఖాన్ పై విమర్శలు ఎక్కువ అవుతున్నాయి. ప్రస్తుతం ఆయన బిగ్ బాస్ హిందీ 16వ సీజన్ లో పాల్గొంటున్నాడు కాబట్టి పెద్దగా ప్రభావం కనపడట్లేదు. ఆయన హౌజ్ నుంచి బయటకు వచ్చాకా ఈ ఆరోపణలపై ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.

షోను నిలిపివేయాలని వినతి..
కాగా ఇటీవల సాజిద్ ఖాన్ బిగ్‌బాస్‌లోకి వెళ్లిన తర్వాత ముంబైలో షెర్లీన్ చోప్రా స్పందించింది. ఇలాంటి చరిత్ర ఉన్న సాజిద్‌ను ఎలా షోలోకి తీసుకొంటారు. నేర చరిత్ర ఉన్న సాజిద్‌ను బిగ్‌బాస్ ఇంటి నుంచి బయటకు పంపాలని ఆమె డిమాండ్ చేశారు. అలాగే బిగ్‌బాస్ 16 షోను నిలిపివేయాలని కేంద్ర సమాచార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్‌కు విన్నపం చేశానని షెర్లీన్ చోప్రా చెప్పారు.


Click it and Unblock the Notifications











