For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Shilpa Shetty ఊపిరే జీవితానికి ప్రాణం.. భర్త అరెస్ట్ తర్వాత శిల్పాశెట్టి ఎమోషనల్

  |

  జూలై 19న శిల్పా శెట్టి భర్త రాజ్ కుంద్రా అశ్లీల చిత్రాల నిర్మాణానికి సంబంధించిన కేసులో అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి ముంబై పోలీసు క్రైమ్ బ్రాంచ్ కూడా శిల్పా వాంగ్మూలాన్ని కూడా నమోదు చేశారు.ఆమె గత కొన్ని రోజుల క్రితం విచారణలో పాల్గొన్నారు. మొదట కేసు విషయంలో సైలెంట్ గానే ఉన్న శిల్పా శెట్టి అనంతరం తీవ్ర స్థాయిలో నెగిటివ్ కామెంట్స్ పై మండిపడ్డారు. ముఖ్యంగా మీడియాలో వస్తున్న కథనాలపై కూడా ఆమె అసహనం వ్యక్తం చేశారు. శిల్పా శెట్టికి కూడా రాజ్ కుంద్రా చేస్తున్న పనుల్లో భాగస్వామ్యం ఉన్నట్లు పలు హిందీ న్యూస్ ఛానెల్స్ లో కొన్ని కథనాలు రావడం ఆమెను అసహనానికి గురి చేశాయి.

  శిల్పాశెట్టి రాజ్ కుంద్రా అరెస్ట్‌ తో పాటు కొనసాగుతున్న పోర్న్ చిత్రాల కేసులో ఒక ప్రకటనను విడుదల చేశారు. మీడియాతో పాటు ప్రజలు తమ ప్రైవేసిని గౌరవించాలని అభ్యర్థించారు, ముఖ్యంగా ఆమె పిల్లల విషయంలో కూడా ప్రత్యేకంగా వివరణ ఇచ్చారు. గత నెలలలో రాజ్ కుంద్రాను అరెస్టు చేసిన తర్వాత, నటి శిల్పా శెట్టి ఒక ప్రకటన గురించి తప్పితే.. ఆ తరువాత బహిరంగంగా ఎక్కడ కనిపించ లేదు. ఆమె చేసే రియాలిటీ షోలను కూడా దూరం పెట్టేసింది. ఇక ఈ వివాదం మధ్యలో ఆమె కోవిడ్ -19 నిధుల సేకరణ కార్యక్రమం కోసం ఆమె కెమెరా ముందుకి వచ్చారు. వి ఫర్ ఇండియా కోసం ఆమె మొదటిసారి కెమెరా ముందుకి వచ్చి నటించింది. రాజ్ కుంద్రా అశ్లీల కంటెంట్‌ను తయారు చేసి దానితో వ్యాపారం కూడా చేస్తున్నాడని ఆరోపణల వలన అరెస్టు చేయబడ్డారు. ప్రస్తుతం అతను జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు.

  ఇక శిల్పా శెట్టి షూటింగ్ విషయానికి వస్తే.. వి ఫర్ ఇండియా నిధుల సేకరణ కార్యక్రమంలో మలైకా అరోరా, అర్జున్ కపూర్, విద్యాబాలన్ అలాగే దియా మీర్జా సహా పలువురు బాలీవుడ్ ప్రముఖులు పాల్గొన్నారు. అలాగే ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గొనడానికి ముందుండె శిల్పా అందుకు సంబంధించిన సన్నివేశాల్లో శ్వాస వ్యాయామాలను ప్రదర్శించారు. మెదడు కణాలకు ఆక్సిజన్ సరిగ్గా చేరడం యొక్క ప్రాముఖ్యత గురించి వివరణ ఇచ్చారు. అంతా శ్వాస మీద ఆధారపడిన కాలంలోనే మనం బ్రతుకుతున్నాం. శ్వాస తీసుకోవడం సరిగ్గా ఉంటే మొత్తం వ్యవస్థను కాపాడుకోవచ్చు. మీ నాసికా మార్గం స్పష్టంగా ఉంటే, ఆక్సిజన్ మెదడు కణాలకు సులభంగా చేరుతుంది. అప్పుడు రోగనిరోధక శక్తికి దారితీస్తుంది.. అని శిల్పా శెట్టి తనదైన శైలిలో చెప్పారు.

  Actress Shilpa Shetty First Virtual Appearance After Raj Kundras Arrest

  నెగిటివ్ ఆలోచనలను ఎలా అధిగమించాలంటే.. కష్ట సమయాల్లో అలాంటి ఆలోచనలు రావడం సహజమే. కానీ ఆ ఎమోషన్స్ ను కంట్రోల్ చేయడానికి శ్వాసను నియంత్రించడం చాలా ముఖ్యం. అందుకే వీలైనంత వరకు పాజిటివ్ గా ఉండటానికి ప్రయత్నం చేయాలి. అంతే కాకుండా మీ శ్వాసను మెరుగుపరచడానికి, 'ప్రాణాయామం' మరింత ముఖ్యమైనది అంటూ ఆమె వివరణ ఇచ్చారు. అంతే కాకుండా ఈ సీనియర్ నటి కోవిడ్ కు సంబంధించిన జాగ్రత్తలు పాటించాలని చెబుతూ.. టీకాలు కూడా వేయించుకోవాలని వారికి గుర్తు చేశారు.

  English summary
  Actress Shilpa Shetty First Virtual Appearance After Raj Kundra's Arrest
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X