For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  పబ్లిక్‌లోనే హీరోయిన్ శ్రీయ కొంటె పని: నా భర్తకు అలా చేస్తేనే ఇష్టమంటూ షాకింగ్‌గా!

  |

  తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎంతో మంది హీరోయిన్లు స్టార్ స్టేటస్‌తో సుదీర్ఘ కాలం పాటు హవాను చూపించారు. అలాంటి వారిలో సొట్టబుగ్గల చిన్నది శ్రీయ సరన్ ఒకరు. చాలా ఏళ్ల పాటు వరుస సినిమాలతో సందడి చేసిన ఈ భామ.. పెళ్లైన తర్వాత పెద్దగా అవకాశాలను అందుకోలేకపోతోంది. అయినప్పటికీ అన్ని భాషల్లోనూ కనిపించేలా సినిమాలను ప్లాన్ చేసుకోగలుగుతోంది. ఇలా ఇప్పటికీ కెరీర్‌ను చక్కగానే ముందుకు తీసుకెళ్తోంది. ఈ నేపథ్యంలో ఇటీవలే శ్రీయ ఓ విషయంలో విమర్శలను ఎదుర్కొంటోంది. తాజాగా దీనిపై ఆమె స్పందించింది. ఆ వివరాలు మీకోసం!

  అలా ఎంట్రీ.. స్టార్ హీరోయిన్

  అలా ఎంట్రీ.. స్టార్ హీరోయిన్

  శ్రీయ సరన్ 'ఇష్టం' అనే తెలుగు సినిమాతో హీరోయిన్‌గా పరిచయమైంది. ఆ తర్వాత 'సంతోషం' మూవీతో మొదటి సక్సెస్‌ను సొంతం చేసుకుంది. అప్పటి నుంచి వెనక్కి తిరిగి చూడని ఈ బ్యూటీ.. దాదాపు అందరు స్టార్ హీరోలతోనూ శ్రీయ సరన్ తెరను పంచుకుంది. ఇలా చాలా కాలం పాటు స్టార్‌గా హవాను చూపించింది. అలా దేశ వ్యాప్తంగా అన్ని భాషల్లో సినిమాలు చేసింది.

  Bigg Boss: ఫ్యామిలీ ఎపిసోడ్‌లో రేవంత్‌కు షాక్.. కనికరించని బిగ్ బాస్.. ఆమె కోసం పెద్ద త్యాగం

  లవ్ మ్యారేజ్.. తల్లైన బ్యూటీ

  లవ్ మ్యారేజ్.. తల్లైన బ్యూటీ

  వరుస సినిమాలు చేస్తూ ఫుల్ ఫామ్‌లో ఉన్నప్పుడే శ్రీయ సరన్.. ఆండ్రీ అనే రష్యన్‌తో డేటింగ్ చేసింది. ఇలా చాలా కాలం పాటు అతడితో ప్రేమాయణం సాగించిన తర్వాత.. అంటే 2018లో అతడిని అగ్నిసాక్షిగా వివాహం చేసుకుంది. అలాగే, మూడేళ్ల తర్వాత ఓ బిడ్డకు తల్లినయ్యానని ప్రకటించింది. దీంతో ఆమె అభిమానులతో పాటు సినీ ప్రియులు అందరూ ఆశ్చర్యపోయారు.

  తెలుగులో రెండు.. సీక్వెల్‌తో

  తెలుగులో రెండు.. సీక్వెల్‌తో

  గతంలో జెట్ స్పీడుగా సినిమాలు చేసిన శ్రీయ సరన్.. ఈ మధ్య కాలంలో పెద్దగా సందడి చేయడం లేదు. కానీ, కొద్ది రోజుల క్రితమే ఆమె 'గమనం', RRR మూవీలోనూ భాగమైంది. కానీ, ఇవి శ్రీయ కెరీర్‌కు పెద్దగా ఉపయోగపడలేదు. ప్రస్తుతం ఈ భామకు పెద్దగా ఆఫర్లు రావడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఇటీవలే ఈ స్టార్ హీరోయిన్ 'దృశ్యం 2'లో నటించి మెప్పించింది.

  Bigg Boss Elimination: ఒక్కసారిగా మారిన ఓటింగ్.. ఆమె మళ్లీ సేఫే.. ఎలిమినేషన్ ప్రమాదంలో మంచోళ్లు!

  ఈవెంట్‌తో భర్తకు ముద్దులు

  శ్రీయ సరన్ ఇటీవలే హిందీలో 'దృశ్యం 2' మూవీలో నటించింది. అజయ్ దేవగణ్ హీరోగా నటించిన ఈ చిత్రం నవంబర్ 18వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అంతకు ముందే ఈ సినిమా ఈవెంట్‌ను నిర్వహించారు. దీనికి శ్రీయ భర్తతో కలిసి హాజరైంది. అందులో వీళ్లిద్దరూ స్టేజ్ మీదనే లిప్ కిస్ పెట్టుకున్నారు. అంతేకాదు, మళ్లీ పెట్టమని ఆమె అడిగి రెచ్చిపోయింది.

  సోషల్ మీడియాలో ట్రోల్స్

  సోషల్ మీడియాలో ట్రోల్స్

  'దృశ్యం 2' ఈవెంట్ స్టేజ్ మీదనే భర్తతో లిప్ కిస్‌లు చేసుకోవడంతో హీరోయిన్ శ్రీయ సరన్‌ను నెటిజన్లు ఆడుకుంటున్నారు. అంతేకాదు, ఆమె మళ్లీ ముద్దు పెట్టు అన్నట్లుగా సైగలు చేసిన వీడియోను షేర్ చేస్తూ ఆమెను ట్రోల్స్ చేస్తున్నారు. అలాగే, పబ్లిక్‌లో ఇలాంటి పనులు చేస్తావా? అంటూ ప్రశ్నిస్తూ శ్రీయపై మండిపడుతున్నారు. దీంతో ఈ వ్యవహారం హాట్ టాపిక్ అయింది.

  హీరోయిన్ ప్రణిత బెడ్‌రూం పిక్స్ వైరల్: టాప్ తీసేసి.. అతడిపై వాలిపోయి!

  స్పందించిన శ్రీయ.. ఇష్టమని

  స్పందించిన శ్రీయ.. ఇష్టమని

  'దృశ్యం 2' ఈవెంట్‌లో భర్తతో లిప్‌ కిస్‌లు పెట్టించుకుని విమర్శలపాలు అవుతోన్న హీరోయిన్ శ్రీయ సరన్‌ ఎట్టకేలకు ఈ వ్యవహారంపై స్పందించింది. తాజాగా ఓ మీడియా ప్రతినిథి దీనిపై స్పందించమని ఆమెను కోరాడు. దీంతో శ్రీయ 'ఆండ్రీ వాళ్ల కల్చర్‌లో ఇవన్నీ సర్వసాధారణమైనవే. అలా పబ్లిక్‌లో కిస్ చేస్తేనే వాళ్లకు ఇష్టం. అలా చేయకపోతేనే తప్పు' అని షాకిచ్చింది.

  అందులో తప్పేముందంటూ

  అందులో తప్పేముందంటూ

  ఆ తర్వాత శ్రీయ సరన్ కంటిన్యూ చేస్తూ 'పబ్లిక్‌లో ముద్దు పెట్టుకున్నాం అంటున్నారు. అందులో తప్పేముంది. మేమిద్దరం భార్య భర్తలం కదా. దీన్ని ఎందుకు రాద్దాంతం చేస్తున్నారో అర్థం కావడం లేదు. దయచేసి ఈ వ్యవహారాన్ని ఇంతటితో వదిలేయండి' అంటూ తనను తాను సమర్ధించుకుంటూ మాట్లాడింది. దీనిపై కూడా పలువురు విమర్శలు చేస్తూనే ఉన్నారు.

  English summary
  Tollywood actress and a former model Shriya Saran Recently Kissed her Husband at Drishyam 2 Event. Now She Responds on This.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X