twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నాట్య మయూరి సుధా చంద్రన్‌కు తీవ్ర విషాదం.. తుది శ్వాస ఉన్నంత వరకు అంటూ ఎమోషనల్

    |

    మయూరి చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు సుపరిచితులైన నాట్య కళాకారిణి, నటి సుధా చంద్రన్‌ తీవ్ర విషాదంలో మునిగిపోయారు. తన తండ్రి, సీనియర్ నటుడు కేడీ చంద్రన్ మరణంతో తీవ్ర దిగ్బ్రాంతికి గురయ్యారు. పితృ వియోగంతో బాధపడుతున్న సుధా చంద్రన్‌కు సినీ వర్గాలు ఫోన్ ద్వారా, సోషల్ మీడియా ద్వారా సంతాపం తెలుపుతూ పరామర్శిస్తున్నారు. కేడీ చంద్రన్ మృతి వివరాల్లోకి వెళితే...

    కిడ్నీ వ్యాధితో బాధపడుతూ

    కిడ్నీ వ్యాధితో బాధపడుతూ

    నటుడు కేడీ చంద్రన్ గత కొద్దికాలంగా కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారు. ఇటీవల ముంబైలోని ప్రముఖ హాస్పిటల్‌లో ఆయనను చేర్పించి చికిత్స అందిస్తున్నారు. చికిత్స పొందుతున్న సమయంలోనే గుండెపోటు రావడంతో మే 17 తేదీ సోమవారం ఉదయం తుదిశ్వాస విడిచారు అని కుటుంబ సభ్యులు తెలిపారు.

    ఇటీవలే జన్మదినం జరుపుకొని

    ఇటీవలే జన్మదినం జరుపుకొని

    నటుడు కేడీ చంద్రన్ ఇటీవలే అంటే మే 8 తేదీన జన్మదినం జరుపుకొన్నారు. ఈ సందర్భంగా తండ్రికి సుధా చంద్రన్ ప్రేమతో కూడిన సందేశాన్ని ఇన్స్‌టాగ్రామ్‌లో పోస్టు చేశారు. హ్యాపీ బర్త్ డే నాన్న.. నాకు మంచి విలువలతో కూడిని జీవితాన్ని ఇచ్చి ముందుకు నడిపించినందుకు ధన్యవాదాలు. నీ కూతురిగా ఎప్పటికీ గర్వపడుతాను అంటూ సుధా చంద్రన్ పోస్టు పెట్టారు. అంతలోనే తండ్రిని మృత్యువు కబలించడంతో తీవ్ర దిగ్బ్రాంతికి గురయ్యారు.

     నాన్న.. తుదిశ్వాస ఉన్నంత వరకు

    నాన్న.. తుదిశ్వాస ఉన్నంత వరకు

    తండ్రి మరణంతో విషాదంలో మునిగిపోయిన సుధా చంద్రన్ తన ఇన్స్‌టాగ్రామ్ అకౌంట్‌లో భావోద్వేగమైన లేఖను పోస్టు చేశారు. నాన్న నీకు అశ్రునివాలి. మమల్ని విడిపోయిన నీవు ఏ లోకంలో ఉన్నప్పటికీ మీ ఆత్మకు శాంతి కలగాలి. నీ కూతురిగా చాలా గర్వ పడుతాను. నీ అనుభవాలను, నీ విలువలను, నిజాయితీని నా చివరి శ్వాస ఉన్నంత వరకు పాటిస్తూనే ఉంటాను. మళ్లీ నీ కూతురిగానే పుట్టాలని భగవంతుడిని కోరుకొంటున్నాను అని సుధా చంద్రన్ పేర్కొన్నారు.

     కేడీ చంద్రన్ కెరీర్

    కేడీ చంద్రన్ కెరీర్

    నటుడు కేడీ చంద్రన్ కెరీర్ విషయానికి వస్తే పలు బాలీవుడ్ చిత్రాల్లో నటించారు. మైనే మాధురీ దీక్షిత్ బన్నా చాహ్తీ హూ, కోయి మిల్ గయా, షరారత్, హరద్ దిల్ జో ప్యార్ కరేగా, చైనా గేట్, తేరే మేరే సప్నే, హమ్ హై రాహీ ప్యార్ కే లాంటి చిత్రాల్లో నటించారు.

    సుధా చంద్రన్ కెరీర్ ఇలా...

    సుధా చంద్రన్ కెరీర్ ఇలా...

    ఇక సుధా చంద్రన్ విషయానికి వస్తే.. నాట్యకారిణిగా సుపరిచితులైన ఆమె ప్రమాదంలో కాలు పోగోట్టుకోవడం విషాదంగా మారింది. అయితే జైపూర్ కాలు అమర్చుకొని మళ్లీ నాట్యకారిణి పలు ప్రదర్శనలు ఇచ్చారు. ఈనాడు అధినేత రామోజీ రావు నిర్మాతగా రూపొందిన మయూరి చిత్రం ద్వారా నటిగా మారారు. పలు హిందీ, తమిళం, మలయాళ చిత్రాల్లో నటించారు.

    English summary
    Actress Sudha Chandran's father, Actor KD Chandran passes away due to cardiac arrest. In this tragic moment, Sudha Chandran wrote that, Goodbye Appa... till we meet again... so proud to be your daughter... I promise you that I will follow your principles and experience and your values till the last breath of my life...
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X