For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Kali poster Row: మహువా మోయిత్రాకు స్వర భాస్కర్ మద్దతు.. ఆడుకుంటున్న నెటిజన్లు

  |

  బాలీవుడ్ నటి స్వర భాస్కర్ ముక్కుసూటిగా మాట్లాడే వ్యక్తిగా పేరు తెచ్చుకుంది. ఇప్పుడు 'కాళీ' పోస్టర్ వివాదం కేసులో తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మొయిత్రాకు ఆమె మద్దతు పలికారు. ఈ క్రమంలో స్వరా భాస్కర్ ట్రోలర్ల టార్గెట్‌కి అవుతూ ఉండగా ఆమె హిందూ రైట్ వింగ్ వారికి ఒక ట్వీట్‌లో సలహాలు కూడా ఇచ్చింది. హిందూమతంలో వైవిధ్యం ఉందని, అలాంటి పరిస్థితుల్లో మీరు ఈ మతంలోని విభిన్న ఆచారాలు, సంప్రదాయాలను పాటించకపోతే అది మతాన్ని అవమానించడమేనని స్వరా చెప్పుకొచ్చింది. ఆ వివరాల్లోకి వెళితే..

  కాళీ పోస్టర్ వివాదం

  కాళీ పోస్టర్ వివాదం


  'తను వెడ్స్ మను' మరియు 'రాంఝనా' వంటి సినిమాలతో ఫేమస్ అయిన నటి స్వరా భాస్కర్ బుధవారం మహువా మొయిత్రాకు మద్దతు పలుకుతూ ట్వీట్ చేస్తూ, 'మహువా మొయిత్రా యు ఆర్ ది బెస్ట్. మీ స్వరానికి బలం చేకూరుతుందని పేర్కొంది. వివాదాస్పద 'కాళి' చిత్రం యొక్క పోస్టర్‌ను సమర్థిస్తూ మహువా మోయిత్రా ప్రకటన తర్వాత స్వరా ట్వీట్ చేసింది.
  భారతీయ సంతతికి చెందిన కెనడియన్ ఫిల్మ్ మేకర్ లీనా మణిమేఖలై డాక్యుమెంటరీ ఫిల్మ్ KAALI పోస్టర్ పెను సంచలనం సృష్టించింది. పోస్టర్‌లో కాళీ పాత్రలో కనిపించిన ఓ నటి సిగరెట్ తాగుతున్నట్లు చూపించారు. దీనితో పాటు, ఆమె చేతిలో LGBTQ జెండా కూడా కనిపిస్తుంది.

   మహువా మొయిత్రా కలకలం

  మహువా మొయిత్రా కలకలం


  ఈ క్రమంలో తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మొయిత్రా మంగళవారం 'ఇండియా టుడే కాన్క్లేవ్'కి హాజరయ్యారు. అక్కడ 'కాళి' పోస్టర్ గురించి అడిగినప్పుడు, కాళీ మా దేవత మాంసాహారం మరియు మద్యం సేవించే దేవత అని ఆమె అన్నారు. మీరు తారాపీఠానికి వెళితే అక్కడ ధూమపానం చేస్తున్న సాధువులు కనిపిస్తారని అన్నారు. ప్రజలు ఈ కాళి రూపాన్ని పూజిస్తారు. నేనే కాళీమాతను ఆరాధించే దాన్ని అని చెప్పుకున్న ఆమె కాళీమాతను నాదైన రీతిలో ఊహించుకునే హక్కు నాకు కూడా ఉందని, ఇది నా స్వేచ్చ అని ఆమె చెప్పుకొచ్చింది. మహువా చేసిన ఈ ప్రకటనపై పెను దుమారం రేగుతోంది.

  మహువా మొయిత్రా

  మహువా మొయిత్రా


  అయితే దీనిపై వివాదం ముదిరిపోవడంతో మహువా మొయిత్రా కూడా తాను తన ఉద్దేశం చెప్పాను కానీ ఏ సినిమాకు సపోర్ట్ చేయలేదని చెప్పింది. ఇక ఈ విషయంలో స్వరా బుధవారం రెండు ట్వీట్లు చేసింది. మొదటి ట్వీట్లో స్వరా ఆమెకు సపోర్ట్ చేయగా తన రెండవ ట్వీట్‌లో, 'ప్రియమైన హిందూ రైట్-వింగ్స్ మరియు ఇతర భయపడే మితవాదులారా, మీరు హిందూ మతం యొక్క వైవిధ్యాన్ని అర్థం చేసుకోకపోతే, మీరు దాని విభిన్న ఆచారాలు మరియు సంప్రదాయాలను అంగీకరించకపోతే, మన మతానికి అవమానమే అంటూ పేర్కొంది.

  లైట్ తీసుకోమని

  లైట్ తీసుకోమని


  దీంతో స్వర భాస్కర్ ట్విట్టర్‌లో ట్రోల్స్ కు గురవుతోంది. స్వరా హిందూ మతానికి చెందిన వారికి సలహాలు ఇచ్చే విధంగా, ఇతర మతాల వారికి ఇలాంటి మాటలు చెప్పడం ఎప్పుడూ చూడలేదని చాలా మంది నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. స్వరాకు అనవసరంగా ప్రతి విషయంలోనూ తన అభిప్రాయాన్ని చెప్పే అలవాటు ఉందని, కాబట్టి ఆమెను సీరియస్‌గా తీసుకోకూడదని ఒక నెటిజన్ పేర్కొన్నారు.

   ట్వీట్ తొలగింపు

  ట్వీట్ తొలగింపు


  ఇక మరోవైపు 'కాళి' పోస్టర్‌పై వివాదం పెరుగుతోంది. దీనిపై చిత్ర నిర్మాత లీనా మణిమేఖలై క్షమాపణలు చెప్పారు. కానీ భారతదేశంలో, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ మరియు ఢిల్లీలో ఆమెపై ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి. ఈ సందర్భంలో, కెనడియన్ మ్యూజియం కూడా క్షమాపణలు చెప్పింది, అక్కడే సినిమా పోస్టర్ విడుదల చేయబడింది. ఇదిలా ఉంటే, మోడీ ప్రభుత్వ ఆదేశాల మేరకు, భారతదేశంలోని లీనా మణిమేఖలై ట్వీట్‌ను కూడా ట్విట్టర్ బ్లాక్ చేసింది, అందులో ఆమె 'కాళి' చిత్రం పోస్టర్‌ను సోషల్ మీడియాలో షేర్ చేసింది.

  English summary
  Actress Swara Bhasker Supports Mahua Moitra Over Her Comments On Kaali Poster Controversy.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X