»   » ఇండస్ట్రీలో హీరోయిన్లపై లైంగిక వేధింపులు నిజమే.. ఐశ్వర్యరాయ్

ఇండస్ట్రీలో హీరోయిన్లపై లైంగిక వేధింపులు నిజమే.. ఐశ్వర్యరాయ్

Posted By:
Subscribe to Filmibeat Telugu
Aishwarya Rai Talks About Industry Culture In #METoo

హీరోయిన్లు, సినీ తారలపై హలీవుడ్ దర్శకుడు హార్లీ వెయిన్‌స్టెయిన్ అకృత్యాల తర్వాత సినీ పరిశ్రమలో లైంగిక వేధింపులపై ఒక్కొక్కరుగా పెదవి విప్పుతున్నారు. మీటూ అంటూ సోషల్ మీడియాలో హ్యాష్ ట్యాగ్‌తో తమకు జరుగుతున్న అన్యాయాలపై ఉద్యమమే చేస్తున్నారు. ఇటీవల ఓ స్టోర్ ఓపెనింగ్ కోసం ఆస్ట్రేలియాలోని సిడ్నీకి వెళ్లిన ఐశ్వర్యరాయ్ #MeToo గురించి బహిరంగ వ్యాఖ్యలు చేశారు. లైంగిక వేధింపులు కేవలం సినిమా పరిశ్రమకే పరిమితం కాలేదు. అన్ని రకాల పరిశ్రమల్లో కూడా ఉన్నాయి అని ఐశ్వర్య అన్నారు.

లైంగిక వేధింపులపై

లైంగిక వేధింపులపై

సినీ పరిశ్రమలో లైంగిక వేధింపుల అంశంపై భారీగా చర్చ జరుగుతున్నది. అనేక మంది తమ అభిప్రాయాలను పంచుకొంటున్నారు. ఇలాంటి విషయంపై స్పందించడం చాలా మంచి పరిణామం. సినీ తారలపై జరుగుతున్న వేధింపులను దాచిపెట్టడం సరికాదు. వాటిని వెలుగులోకి తీసుకురావాల్సిన అవసరం ఉంది అని ఐశ్వర్యరాయ్ అన్నారు.

సినీ పరిశ్రమకే పరిమితం

సినీ పరిశ్రమకే పరిమితం

లైంగిక వేధింపులు, దాడులు కేవలం సినీ పరిశ్రమకే పరిమితం కాలేదు. అన్ని రంగాల్లో ఈ సమస్య ఉన్నది. సినీ పరిశ్రమలో స్వేచ్ఛ ఉన్నది. మీడియా అందుబాటులో ఉంది కాబట్టి ఈ విషయాలు ఎక్కువగా సినీ పరిశ్రమలోనే ఉన్నట్టు ఓ భ్రాంతి కలుగుతున్నది అని ఐశ్వర్యరాయ్ అన్నారు.

 ఆయుధంగా సోషల్ మీడియా

ఆయుధంగా సోషల్ మీడియా

తమ భావాలను పంచుకోవడానికి సోషల్ మీడియా బలమైన ఆయుధంగా ఉపయోగపడుతున్నది. కానీ కొన్ని విషయాల్లో సోషల్ మీడియా తప్పుదారి పడుతున్నది. సోషల్ మీడియా కారణంగా వ్యక్తిగత స్వేచ్ఛ హరిస్తున్నది అనే అభిప్రాయాన్ని ఐశ్వర్యరాయ్ వ్యక్తం చేశారు.

 కీడు కంటే మేలే ఎక్కువగా

కీడు కంటే మేలే ఎక్కువగా

సోషల్ మీడియా వల్ల కీడు కంటే మేలే ఎక్కువ జరుగుతున్నది. ప్రతీ విషయం వెలుగులోకి వస్తున్నది. ఏదైనా జరిగితే అందరి అభిప్రాయాలు తెలుసుకునే వీలు కలుగుతున్నది. సంఘటన తీవ్రత ఏంటో తెలుసుకునే వీలు కలుగుతున్నది అని ఐశ్వర్య చెప్పింది.

ఫన్నేఖాన్ చిత్రంలో

ఫన్నేఖాన్ చిత్రంలో

బాలీవుడ్‌లో బిజీగా మారేందుకు ఐశ్వర్యరాయ్ తన కెరీర్‌ను ప్లాన్ చేసుకొంటున్నారు. ప్రస్తుతం అనిల్ కపూర్‌తో కలిసి ఫన్నే ఖాన్ అనే చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానున్నది.

English summary
Aishwarya Rai Bachchan recently shared her views on sexual harassment in the workplace. The actress said that it is a menace that existed in 'all walks of life' and was not limited to 'showbiz or the film industry'. Rai Bachchan, who was in Sydney last month for the opening of a store, bared her heart about the #MeToo movement.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X