»   » సూసైడ్ చేసుకొంటా.. చేతికి రక్తం.. తలకు గాయం.. ప్రేమ కోసం సల్మాన్ తెగింపు

సూసైడ్ చేసుకొంటా.. చేతికి రక్తం.. తలకు గాయం.. ప్రేమ కోసం సల్మాన్ తెగింపు

By Rajababu
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
  Salman Khan Talks About Break-Up With Aishwarya Rai | Filmibeat Telugu

  బాలీవుడ్‌లో కండలవీరుడు సల్మాన్ ఖాన్, ప్రపంచ సుందరి ఐశ్వర్యరాయ్ ప్రేమకథ 90 దశకంలో మీడియాకు క్రేజీ అంశం. 1999లో హమ్ దిల్ దే చుకె సనమ్ చిత్రంతో మొదలైన ఈ ఇద్దరి ప్రేమకథ 2002లో వివాదాస్పదంగా ముగిసంది. ఓ దశలో పిచ్చి పిచ్చిగా ప్రేమించుకొన్న సల్మాన్, ఐశ్వర్య ప్రేమకథ పెళ్లి పీటల దాకా చేరలేకపోయింది. వారి ప్రేమ విఫలం కావడానికి దారి తీసిన ఓ సంఘటన తాజాగా చర్చనీయాంశమైంది.

  ఐశ్వర్యరాయ్ అపార్ట్‌మెంట్ వద్ద

  ఐశ్వర్యరాయ్ అపార్ట్‌మెంట్ వద్ద

  సల్మాన్ ఖాన్, ఐశ్వర్యరాయ్ ప్రేమ కథలో 2001 నవంబర్ నెలలో ఓ రోజు కాళరాత్రిగా మారింది. అదే రోజు ఏదో గొడవపడిన సల్మాన్ ఖాన్ తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో నేరుగా ఐశ్వర్యరాయ్ ఇంటికి వెళ్లి తలుపులు గట్టిగా కొట్టాడట. ఐశ్వర్య తలుపులు తెరువకపోవడంతో గొడవ చేశారట. బయటకు రాకపోతే ఆత్మహత్య చేసుకొంటానని బెదిరించారట.

  పెళ్లి చేసుకోమని సల్మాన్ బలవంతం

  పెళ్లి చేసుకోమని సల్మాన్ బలవంతం

  సల్మాన్ బెదిరింపులకు ఓ దశలో ఐశ్వర్య లొంగిపోలేదట. సల్మాన్ వెళ్లి పోకుండా అలానే గొడవ చేస్తుండటంతో ఫైనల్‌గా డోర్లు తెరిచిందట. అప్పుడు చేతుల నుంచి రక్తం కారుతూ సల్మాన్ కనపించాడట. అప్పుడు పెళ్లి చేసుకొంటానని ఐశ్వర్యను ప్రామిస్ చేయమని బలవంతం పెట్టారట. అయితే ఐశ్వర్య ఏ మాత్రం తగ్గకుండా సల్మాన్‌ను బుజ్జగించి పంపించిందని అపార్ట్‌మెంట్‌లోని ప్రత్యక్ష సాక్షుల వెల్లడించినట్టు ఓ పత్రిక కథనాన్ని అప్పట్లో వెల్లడించింది.

  నా ప్రియురాలితోనే పోరాటం

  నా ప్రియురాలితోనే పోరాటం

  ఐశ్వర్య ఇంటి వద్ద జరిగిన సంఘటన గురించి సల్మాన్ ఓ ఇంటర్వ్యూలో వెల్లడిస్తూ.. నా ప్రేమను అంగీకరించడం లేదు. అందుకే నేను భావోద్రేకంతో వ్యవహరించాల్సి వచ్చింది. ప్రేమను దక్కించుకోవడానికి నీవు పోరాడాల్సిందే. నేను బయట వ్యక్తితో పోరాడలేదు. నేను అమితంగా ప్రేమించిన వ్యక్తి ప్రేమను పొందడానికి గొడవపడ్డాను.

  ఐశ్వర్య ప్రేమలో సోమి ఆలీ చిచ్చు

  ఐశ్వర్య ప్రేమలో సోమి ఆలీ చిచ్చు

  ఇలా సల్మాన్, ఐశ్వర్య మధ్య రిలేషన్ అంతమంత్రంగానే ఉన్న నేపథ్యంలో మరో ఘటన వారి ప్రేమ విఫలం చెందడానికి కారణమైంది. అమెరికాలో ఉండే తన పాత ప్రియురాలు సోమి ఆలీకి సహాయం చేయడానికి ఐశ్వర్యకు చెప్పకుండా వెళ్లడంతో వారి అఫైర్ బ్రేకప్ అయింది.

  నాపై చేయి చేసుకొన్నాడు

  నాపై చేయి చేసుకొన్నాడు

  సల్మాన్ ఖాన్‌తో బ్రేకప్ జరిగిందనే విషయాన్ని 2002లో ఐశ్వర్య ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది. ఎప్పుడుపడితే అప్పుడు ఫోన్ చేసి దుర్భాషలాడేవాడు. సహనటులతో అఫైర్ ఉందని అనుమానించే వాడు. కొన్నిసార్లు నాపై చేయి చేసుకొన్నాడు. అదృష్టం కొద్ది ఎలాంటి గాయాలు కాకుండా తప్పించుకొన్నాను అని ఐశ్వర్య చెప్పింది.

  నేనెప్పుడు గాయపరుచలేదు

  నేనెప్పుడు గాయపరుచలేదు

  అయితే తనపై దాడి చేశారని ఐశ్వర్య చెప్పిన మాటలను సల్మాన్ ఖాన్ ఖండించారు. నేనెప్పుడు కొట్టలేదు. ఎమోషనల్‌ అయ్యాను. నాకు నేను గాయపరుచుకొన్నాను. ఐశ్వర్య ప్రేమ కోసం నా తలను గోడకు కొట్టుకొన్నాను. అంతేకాని ఎవరిపై దాడి చేయలేదు అని సల్మాన్ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.

  English summary
  The Salman Khan-Aishwarya Rai Bachchan couple's affair started during their film Hum Dil De Chuke Sanam (1999) and ended with a bang in 2002. The two, who were once so madly in love, don't even acknowledge each other today. Salman said, "I have never beaten her. I get emotional and hurt myself. I have banged my head against the wall but I cannot hurt anyone else."
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more