Don't Miss!
- News
ప్రధాని మోదీకి ఫుల్ సపోర్ట్ ప్రకటించిన రష్యా..!!
- Lifestyle
సంబంధంలో సాన్నిహిత్యం, నమ్మకాన్ని పెంపొందించడానికి చిట్కాలు
- Finance
household income: భారతీయ కుటుంబాలపై సర్వే.. ఆదాయం, పొదుపులు ఎంతో తెలుసా ?
- Sports
అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన టీమిండియా స్టార్ ఓపెనర్!
- Technology
Oppo నుండి కొత్త టాబ్లెట్, లాంచ్ కు సిద్ధం! ఆన్లైన్ లో స్పెసిఫికేషన్లు లీక్ ..!
- Automobiles
భారతీయ మార్కెట్లో Hero XOOM ఎలక్ట్రిక్ స్కూటర్ విడుదల: ప్రైస్, వేరియంట్స్ & కలర్ ఆప్సన్
- Travel
సందర్శనీయ ప్రదేశాలు.. ఆంధ్రప్రదేశ్‌లోని ఈ సరస్సులు!
విజయ్ కార్నిక్‌గా అజయ్ దేవగన్.. భారత్, పాక్ యుద్ద నేపథ్యంగా బయోపిక్!
బాలీవుడ్ హీరో అజయ్ దేవగన్ కెరీర్ పరంగా వరుస చిత్రాలతో అలరిస్తున్నాడు. అయితే ఎక్కువగా బయోపిక్‌లను ఎంపిక చేసుకోవడం హిందీ చిత్ర పరిశ్రమలో చర్చనీయాంశమైంది. భారతీయ ఫుట్‌బాల్ క్రీడాకారుడు, కోచ్ సయ్యద్ అబ్దుల్ రహీం బయోపిక్‌తోపాటు చత్రపతి శివాజీ సేనలో కీలక పాత్ర పోషించిన తానాజీ బయోపిక్‌లో కూడా అజయ్ దేవగన్ నటిస్తున్నాడు. అంతేకాకుండా తాజాగా స్వాడ్రన్ లీడర్ విజయ్ కర్నిక్ జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న భుజ్: ది ప్రైడ్ ఆఫ్ ఇండియా అనే చిత్రానికి కూడా అజయ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారట.
భుజ్: ది ప్రైడ్ ఆఫ్ ఇండియా చిత్రాన్ని గుల్షన్ కుమార్ సమర్పణలో టీ సిరీస్ కంపెనీ, సెలెక్ట్ మీడియా హోల్డింగ్స్ ఎల్ఎల్‌పీ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. అభిషేక్ దుదైయా రచించి దర్శకత్వం వహిస్తున్నారు. గిన్నీ ఖనూజా, వజీర్ సింగ్, భూషణ్ కుమార్, కిషన్ కుమార్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.
రాజమౌళికి ఆ హీరో ఝలక్... అందుకే జక్కన్న రాజీ పడ్డారా?

1971లో జరిగిన ఇండో పాకిస్థాన్ యుద్ధ సమయంలో స్క్వాడ్రన్ లీడర్ విజయ్ కర్నిక్ భుజ్ ఎయిర్‌పోర్టుకు ఇన్‌చార్జిగా వ్యవహరించారు. స్థానిక మహిళ, తన టీమ్ సహాయంతో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఎయిర్‌స్ట్రిప్‌ను గుజరాత్‌లో నిర్మించాడు. దానినే మనం ఇప్పుడు పెర్ల్ హార్బర్ అంటాం. వాస్తవ సంఘటనలు, భావోద్వేగాన్ని రగిలించే యుద్ధ సన్నివేశాలతో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్టు నిర్మాత భూషణ్ కుమార్ తెలిపారు.
అప్పటి ఘటనపై విజయ్ కార్నిక్ మాట్లాడుతూ.. భీకరంగా యుద్ధం జరిగే సమయం అది. అప్పుడు ఏ ఒక్క మహిళ గాయపడినా, మరణించినా ఆ లోటును పూడ్చలేకపోయేవాళ్లం. అందుకే ఎయిర్‌స్ట్రిప్‌ను నిర్మించాం అని అన్నారు. నా పాత్రను అజయ్ దేవగన్ పోషిస్తున్నారే విషయం తెలుసుకొని చాలా ఆనందపడ్డాను అని విజయ్ కార్నిక్ తెలిపారు.