For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఒక్కడిని చేసి ఆడుకుంటున్నారు.. ఇక నాచేతుల్లో ఏమీ లేదు.. హీరోయిన్‌కి ఘాటుగా రిప్లై!

|

గత ఏడాది మీటూ ఉద్యమం బాలీవుడ్ ని కుదిపేసింది. సీనియర్ హీరోయిన్ తనుశ్రీ దత్త ప్రముఖ నటుడు నానా పాటేకర్ పై చేసిన లైంగిక వేధింపుల సంచలనం సృష్టించాయి. ఈ వ్యాఖ్యలతోనే బాలీవుడ్ లో మీటూ ఉద్యమం మొదలైంది. తనుశ్రీ దత్తా ఇచ్చిన ధైర్యంతో చాలా మంది నటీమణులు తమకు ఎదురైన వేధింపులని వివరిస్తూ పలువురు దర్శకులు, నిర్మాతలు, నటుల పేర్లు బయట పెట్టారు. మీటూ ఉద్యమ ప్రభావంతో చాలా మంది దర్శకులు, నటులు సినిమాలు కోల్పోవలసి వచ్చింది. అజయ్ దేవగన్ కేంద్రంగా మరోమారు తనుశ్రీ దత్తా విమర్శలు గుప్పిస్తోంది. తనపై వస్తున్న విమర్శలకు అజయ్ దేవగన్ కూడా అంతే ఘాటుగా బదులిచ్చాడు.

 దే దే ప్యార్ దే

దే దే ప్యార్ దే

అజయ్ దేవగన్ తాజాగా నటిస్తున్న చిత్రం దే దే ప్యార్ దే. ఈ చిత్రంలో రకుల్ ప్రీత్ సింగ్, సీనియర్ నటి టబు హీరోయిన్లుగా నటిస్తున్నారు. రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా ఈ చిత్రం తెరకెక్కుతోంది. అకివ్ అలీ ఈ చిత్రానికి దర్శకుడు. ఈ చిత్రంలో సీనియర్ నటుడు అలోక్ నాథ్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. అసలు కొడవంతా ఇతడి వల్లే వచ్చింది. గత ఏడాది మీటూ ఉద్యమం సాగుతున్నప్పుడు ప్రముఖ రచయిత్రి వింటా నందా సంచలన ఆరోపణలు చేశారు. అలోక్ నాథ్ తనని రేప్ ఆమె కామెంట్స్ చేయడం హాట్ టాపిక్ గా మారింది.

 అజయ్ దేవగన్‌ని తిడుతూ

అజయ్ దేవగన్‌ని తిడుతూ

ఈ వ్యవహారంలో తనుశ్రీ దత్త అజయ్ దేవగన్ పై తీవ్రమైన విమర్శలు చేశారు. అలోక్ నాథ్ పై అత్యాచార ఆరోపణలు ఉన్నాయని తెలిసి కూడా అతడికి ఎందుకు మీ సినిమాలో అవకాశం ఇచ్చారు అంటూ తనుశ్రీ దత్తా ప్రశ్నించింది. మహిళల పట్ల మీకున్న గౌరవం ఇదేనా అంటూ అజయ్ దేవగన్ పై విమర్శలు చేసింది. అలోక్ నాథ్ పై అత్యాచార ఆరోపణలు వచ్చిన వెంటనే అతడిని మీ చిత్రం నుంచి తొలగించి ఉండాల్సింది. కానీ అలా చేయలేదు. దీనిని బట్టి అజయ్ దేవగన్ గురించి మేము ఎలా అర్థం చేసుకోవాలని అని తనుశ్రీ దత్తా ప్రశ్నించింది.

 జరిగింది ఇదీ

జరిగింది ఇదీ

తనుశ్రీ దత్తా ఆరోపణలపై అజయ్ దేవగన్ మౌనం వీడాడు. తనుశ్రీ దత్తాకు ఘాటుగా కౌంటర్ ఇస్తూనే అలోక్ నాథ్ విషయంలో వివరణ ఇచ్చే ప్రయత్నం చేశాడు. గత ఏడాది అక్టోబర్ లో మీటూ ఉద్యమం ప్రారంభమైనప్పుడు తాను చాలా మంది మహిళలకు మద్దతు తెలిపానని అజయ్ దేవగన్ గుర్తుచేసుకున్నారు. ఆరోపణలు ఎదుర్కొన్న ఎవరివైపునా నేను నిలబడలేదు. ఇప్పటికీ మీటూ విషయంలో నా నిర్ణయం మారలేదు. మీటూ ఉద్యమానికి కొన్ని నెలల ముందే దే దే ప్యార్ దే చిత్ర షూటింగ్ ప్రారంభమైందని అజయ్ దేవగన్ తెలిపారు.

షూటింగ్ దాదాపుగా

షూటింగ్ దాదాపుగా

మీటూ ఉద్యమం గత ఏడాది అక్టోబర్ లో ప్రారంభమైంది. సెప్టెంబర్ లోనే మా చిత్ర షూటింగ్ దాదాపుగా పూర్తయిపోయింది. అలోక్ నాథ్ ఈ చిత్రంలో చాలా కీలకమైన పాత్రలో నటించారు. దాదాపు 40 రోజుల పాటు ఆయన షూటింగ్ లో పాల్గొన్నారు. అతడిపై మీటూ ఆరోపణలు వచ్చిన తర్వాత సినిమా నుంచి తొలగించాలంటే మళ్ళీరీ షూట్ చేయాలి. అది నేనొక్కడినే తీసుకునే నిర్ణయం కాదు. అతడిని తొలగించి మరొకరిని తీసుకున్నా సినిమా బడ్జెట్ డబుల్ అవుతుంది అని అజయ్ దేవగన్ వివరణ ఇచ్చాడు.

ఒక్కడిని చేసి ఆడుకుంటున్నారు

ఒక్కడిని చేసి ఆడుకుంటున్నారు

అలోక్ నాథ్ ని తొలగించి సినిమా రీ షూట్ చేయడం చాలా ఖర్చుతో కూడుకున్న పని. సినిమాకు నష్టం కలిగించే నిర్ణయాన్ని నేనొక్కడినే తీసుకోలేను. ఇప్పుడు నా చేతుల్లో ఏమీ లేదు. ఇలాంటి వాస్తవాలని గ్రహించకుండా నన్ను ఒక్కడిని చేసి నిందించడం ఎంతవరకు కరెక్ట్ అని అజయ్ దేవగన్ తనుశ్రీ దత్తాని ప్రశ్నించారు. నేను ఇలా ఎందుకు టార్గెట్ గా మారుతున్నానో అర్థం కావడం లేదని అజయ్ దేవగన్ అన్నారు.

English summary
Ajay Devgn hits back at Tanushree Dutta on Alok Nath #MeToo row: Don't know why I'm singled out. Ajay Devgn has responded to Tanushree Dutta's accusations about working with Alok Nath in De De Pyaar De. He has released a lengthy statement, clarifying his stance.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more