twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    పవిత్ర ప్రదేశంలో ప్రారంభం కాబోతున్న ‘రామ్ సేతు’: అక్షయ్ కుమార్ క్రేజీ ప్రాజెక్టు అప్‌డేట్

    |

    పేరుకు బాలీవుడ్ హీరోనే అయినా.. దేశ వ్యాప్తంగా ఫాలోయింగ్‌ను సంపాదించుకున్నాడు టాప్ స్టార్ అక్షయ్ కుమార్. కొన్నేళ్లుగా వరుస విజయాలను అందుకుంటోన్న ఆయన.. జయాపజయాలతో సంబంధం లేకుండా ప్రాజెక్టులను పట్టాలెక్కించేస్తున్నాడు. అదే సమయంలో దేశ వ్యాప్తంగా మార్కెట్‌ను పెంచుకుంటున్నాడు. ఇటీవలి కాలంలోనే ఎన్నో రికార్డులను క్రియేట్ చేసిన అక్షయ్.. వ్యక్తిగతగానూ ఎక్కువ ఆదాయం ఆర్జిస్తున్న సినీ ప్రముఖుడిగా ఘనత సాధించాడు. సినిమా సినిమాకు వైవిధ్యాన్ని చూపిస్తోన్న ఆయన.. ప్రస్తుతం మరో ప్రాజెక్టుకి రెడీ అయ్యాడు.

    లాక్‌డౌన్ సమయంలో థియేటర్లు మూసి ఉండడంతో అక్షయ్ కుమార్ నటించిన 'లక్ష్మీ' హాట్‌స్టార్ యాప్‌లో విడుదలైంది. కాంచన సినిమాకు రీమేక్‌గా వచ్చిన ఇది నిరాశనే మిగిల్చింది. ఎన్నో అంచనాల నడుమ వచ్చిన ఈ మూవీ.. అంతగా ఆకట్టుకోలేకపోయింది. అయినప్పటికీ అతడు వరుసగా సినిమాలను పట్టాలెక్కిస్తూనే ఉన్నాడు. ఇందులో భాగంగానే డ్రీమ్ ప్రాజెక్టు 'రామ్ సేతు' ప్రారంభోత్సవానికి ముహూర్తం ఫిక్స్ చేసుకున్నాడు అక్షయ్ కుమార్. ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందనున్న ఈ సినిమాను మార్చి 18న జరిగే పూజా కార్యక్రమాలతో మొదలు పెట్టబోతున్నారు.

    Akshay Kumar Ram Setu Movie will Start at Ayodhya

    ఇక, శ్రీరాముడికి సంబంధించిన సినిమా కావడంతో 'రామ్ సేతు'ను హిందువుల పవిత్ర ప్రదేశం అయిన అయోధ్యలో ప్రారంభించబోతున్నారు. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇప్పటికే అనుమతి కూడా తీసుకుంది చిత్ర యూనిట్. ఈ సినిమాను అభిషేక్ శర్మ డైరెక్ట్ చేయనుండగా, అక్షయ్ కుమార్ తల్లి అరుణా భాటియాతోపాటు విక్రమ్ మల్హోత్రా నిర్మిస్తున్నారు. ఇదిలా ఉండగా.. అక్షయ్ కుమార్ నటించిన 'సూర్య వంశీ' ఏప్రిల్ 30న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు ఇటీవలే ప్రకటించారు. ప్రస్తుతం అతడు 'బెల్ బాటమ్', 'పృథ్వీ రాజ్' అనే సినిమాలు చేస్తున్నాడు.

    English summary
    Bollywood superstar Akshay Kumar is winning hearts with his humane gesture. Akshay, who has in the past too gone out of his way to help disaster-stricken families, took to Twitter to urge everyone to do their bit to help all affected in the Assam floods.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X