అల.. వైకుంఠపురములో హిందీ టైటిల్ ఫిక్స్.. అర్ధమేంటో తెలుసా?
అల.. వైకుంఠపురములో సినిమా గత ఏడాది సంక్రాంతికి వచ్చి ఒక్కసారిగా బాక్సాఫీస్ ను షేక్ చేసింది.. ఆ రికార్డుల మోత పక్క ఇండస్ట్రీలను కూడా తాకింది. దీంతో రీమేక్ చేయాలని చాలా నెలలుగా చర్చలు జరుపుతున్నారు. అసలైతే హిట్టవ్వగానే నిర్మాత అల్లు అరవింద్ కు బాలీవుడ్ బడా నిర్మాతల నుంచి అనేక ఫోన్ కాల్స్ వచ్చాయి. సినిమా హిందీ హక్కులు కావాలని చాలా అడిగారట.
కానీ అల్లు అరవింద్ ముందే టెంప్ట్ అవ్వకుండా చాలా నెలలు ఆ విషయాన్ని పక్కన పెట్టాడు. ఇక బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా గీతా ఆర్ట్స్ వాల్యూ పెంచాలని సొంతంగానే రీమేక్ చేయాలని డిసైడ్ అయ్యారు. అందుకోసం ఏక్తా కపూర్ ను సహా నిర్మాతగా సెట్ చేసుకొని ప్రీ ప్రొడక్షన్ పనులను స్టార్ట్ చేశారు. కార్తీక్ ఆర్యన్ హీరోగా సెట్టవ్వగా కృతి సనోన్ ను హీరోయిన్ గా ఫైనల్ చేశారు.

అయితే అల.. వైకుంఠపురములో కథకు హిందీలో ఎలాంటి టైటిల్ పెడతారని అనుకుంటున్న సమయంలో 'షెహ్ జాదా' అనే టైటిల్ ను ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది.
షెహ్ జాదా అంటే ప్రిన్స్ అని అర్థం. కథను పూర్తిగా నార్త్ ప్రేక్షకులకు నచ్చే విధంగా ట్రీట్మెంట్ ఇస్తున్నట్లు తెలుస్తోంది. అయితే సినిమా కథ తెలుగులో సక్సెస్ అవ్వడానికి త్రివిక్రమ్ మ్యాజిక్ తో పాటు థమన్ మ్యూజిక్ కూడా ఎంతగానో హెల్ప్ అయ్యింది. అలాగే అల్లు అర్జున్ న్యూ స్టైల్, డ్యాన్స్ వంటి అంశాలు కూడా హెల్ప్ అయ్యాయి. మరి బాలీవుడ్ లో కూడా అలాంటి మ్యాజిక్ క్రియేట్ చేస్తారో లేదో చూడాలి.


Click it and Unblock the Notifications











