పెళ్లి చేసుకొందాం పద.. బిగ్‌బాస్‌లో లవ్ డ్రామా.. కంటెస్టెంట్‌కు మ్యారేజ్ ప్రపోజల్!
బిగ్‌బాస్ ఇంటిలో జోరుగా ప్రేమ వ్యవహారాలు జరుగుతున్నాయి. సల్మాన్ ఖాన్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న బిగ్‌బాస్ త14 సీజన్‌లో కంటెస్టెంట్ల మధ్య పెళ్లి చర్చలు జోరందుకొన్నాయి. గతంలో కొన్ని జంటల మధ్య రొమాన్స్ జోరుగా సాగిన నేపథ్యంలో వారికి తోడుగా అలీ గోని, జాస్మిన్ భాసిన్ ఇంట్లో పెళ్లికి సిద్ధమవ్వడం చర్చానీయాంశమైంది. వారి మధ్య సంభాషణ ఎలా జరిగిందంటే..

బిగ్‌బాస్‌లో ప్రేమ పక్షులగా
హిందీ టెలివిజన్ సీరియల్స్‌తోపాటు ఫియర్ ఫ్యాక్టర్: ఖత్రోంకే ఖిలాడీ 9, 10, సీజన్లలో పాల్గొన్న అలీ గోని ప్రస్తుతం బిగ్‌బాస్‌లో రొమాంటిక్ స్టార్‌గా నటిస్తున్నారు. ఇక ఇదే సీజన్‌లో తమిళంలో వానమ్, కన్నడంలో కరోడ్‌పతి చిత్రాల్లో నటించిన జాస్మిన్ భాసిన్ కూడా తన అందాలను ఆరబోస్తూ గ్లామర్‌తో ఆకట్టుకొంటున్నారు.

జాస్మిన్ భాసిన్‌కు పెళ్లి ప్రతిపాదన
ఇటీవల జాస్మిన్ భాసిన్‌కు అలీ గోని పెళ్లి ప్రతిపాదన చేయడం చర్చనీయాంశమైంది. తన ముందు మోకాళ్లపై మోకరిల్లి అలీ గోని ప్రపోజ్ చేయమని జాస్మిన్ భాసిన్ కోరుకొన్నది. తాజా ఎపిసోడ్‌లో వారిద్దరు పెళ్లి గురించి సీరియస్‌గా చర్చలు జరిపారు.

లవర్‌ను వెతుక్కోవడం టైమ్ వేస్ట్
బిగ్‌బాస్ నుంచి ఎలిమినేట్ అయిన తర్వాత బయటకు వెళ్లి లవర్‌ను వెతుక్కోవడం, ఆమెతో కొద్దికాలం ట్రావెల్ చేసి ఆమె నా వ్యక్తిత్వానికి సరిపోతుందా? లేదా అనే విషయాన్ని ధృవీకరించుకోవడానికి సమయం తీసుకోవడం.. ఒకవేళ నచ్చకపోతే వదిలివేయడం టైమ్ వేస్ట్ అని అలీ గోనే అన్నారు.

బెస్ట్ ఫ్రెండ్‌తో పెళ్లి సేఫ్
లవర్‌తో వర్కవుట్ అవుతుందా లేదా అనే విషయాన్ని ధృవీకరించుకోవడానికి బదులు బెస్ట్ ఫ్రెండ్ లాంటి నిన్ను పెళ్లి చేసుకోవడం ఉత్తమం అని భావిస్తున్నాను. ఏదైనా విషయాన్ని నీతో సాల్వ్ చేసుకోనే అవకాశం ఉంది. లైఫ్ టైమ్ నీతో గడపడానికి ఎలాంటి సందేహాలు లేవు జాస్మిన్ ముందు పెళ్లి ప్రపోజల్‌ను అలీ గోని పెట్టారు.


Click it and Unblock the Notifications











