»   »  అలియాభట్‌కు ప్రమాదం.. గాయాలతో ఇండియాకు..

అలియాభట్‌కు ప్రమాదం.. గాయాలతో ఇండియాకు..

Posted By:
Subscribe to Filmibeat Telugu
గాయాలతో ఇండియాకు వచ్చేసిన బాలీవుడ్ అందాల తార

బాలీవుడ్ అందాల తార అలియాభట్ స్వల్పంగా గాయపడింది. బల్గేరియాలో జరుగుతున్న బ్రహ్మస్త్ర సినిమా షూటింగ్‌లో మంగళవారం ఉదయం గాయపడినట్టు నిర్ధారణ జరిగింది. గాయానికి గురైన ఆమెకు 15 రోజులపాటు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించడంతో ఆమెను ముంబైకి పంపించినట్టు సమాచారం.

 రణ్‌బీర్ కపూర్‌తో అలియా భట్

రణ్‌బీర్ కపూర్‌తో అలియా భట్

హీరో రణ్‌బీర్ కపూర్‌తో దర్శకుడు ఆర్యన్ ముఖర్జీ రూపొందిస్తున్న ఈ చిత్రంలో అలియాభట్ నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్ర షూటింగ్ కొన్ని రోజులుగా బల్గేరియాలో జరుగుతున్నది. ఈ షూటింగ్ సందర్భంగా కిందపడిపోవడంతో ఆమెకు గాయమైనట్టు చిత్ర యూనిట్ వెల్లడించింది.

కుడి భుజానికి గాయాలు

కుడి భుజానికి గాయాలు

చిత్ర యూనిట్ తెలిపిన ప్రకారం.. ఆలియాభట్‌పై ఓ సన్నివేశాన్ని చిత్రీకరిస్తుండగా ఆమె ఎత్తు నుంచి కింద పడింది. దాంతో కుడిభుజానికి, మోచేతికి గాయాలు అయ్యాయి. మోచేతి వద్ద చీలిక ఉన్నట్టు ఎక్స్‌రేలో స్పష్టమైంది. వైద్యులు ఆమెను విశ్రాంతి తీసుకోమని సూచించారు అని తెలిపారు.

15 రోజులు విశ్రాంతి

15 రోజులు విశ్రాంతి

గాయం నొప్పితో అలియా విపరీతంగా బాధపడుతున్నది. కుడిచేతికి బ్యాండేజ్ వేశారు. 15 రోజులపాటు భుజాన్ని కదుపడానికి కూడా వీలు లేదు. అందుచేత అలియాను ఇండియాకు పంపించాం. ఏప్రిల్ మొదటివారంలో మళ్లీ బల్గేరియాకు తిరిగి వచ్చే అవకాశం ఉంది.

 బ్రహ్మస్త్రలో అమితాబ్ బచ్చన్‌తో

బ్రహ్మస్త్రలో అమితాబ్ బచ్చన్‌తో

బ్రహ్మస్త్ర చిత్రాన్ని అడ్వెంచర్ ఫాంటసీగా ఆయన్ ముఖర్జీ రూపొందిస్తున్నారు. ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్, కూడా నటించడం విశేషం. రణ్‌బీర్, అలియా మొదటిసారి కలిసి నటిస్తున్నారు. ఈ చిత్రం వచ్చే ఏడాది ఆగస్టు 15వ తేదీన రిలీజ్ కానున్నది.

English summary
Bollywood actor Alia Bhatt fell on the sets of Brahmastra and hurt her right arm and shoulder, a DNA report claimed Tuesday morning. Alia is in Bulgaria where she is shooting for Ayan Mukerji’s film opposite Ranbir Kapoor. She has reportedly been advised bed rest and may not be able to work for 15 days.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X