Just In
- 16 min ago
2021 మొత్తం మెగా హీరోలదే హవా.. నెవర్ బిఫోర్ అనేలా బాక్సాఫీస్ పై దండయాత్ర
- 42 min ago
‘పుష్ప’ నుంచి ఊహించని సర్ప్రైజ్: ఈ రెండింటిలో ఒకటి గ్యారెంటీ.. ముందే బయటకొచ్చిందిగా!
- 53 min ago
అలా చేయడం వల్ల ఎంతోమంది సూసైడ్ చేసుకుంటున్నారు.. కోహ్లీ, తమన్నాలకు హైకోర్టు నోటీసులు
- 1 hr ago
మెహబూబ్ గుట్టు విప్పిన సోహెల్: అందుకే పైకి అలా కనిపిస్తున్నాడంటూ మేటర్ రివీల్ చేశాడు
Don't Miss!
- News
పిక్చర్ అభీ బాకీ హై... అది భగవంతుడికే తెలియాలి... దీప్ సిధు వివాదాస్పద వ్యాఖ్యల ఆంతర్యం..?
- Automobiles
భారత్ బెంజ్ ప్రవేశపెట్టిన 8 కొత్త వాహనాలు, ఇవే.. చూసారా..!
- Finance
దటీజ్ టీసీఎస్, ప్రపంచ బ్రాండ్లలో 3వ స్థానం, కాగ్నిజెంట్‌ను వెనక్కి నెట్టిన ఇన్ఫోసిస్
- Sports
BWF World Tour Finals 2021: శుభారంభం దక్కలేదు.. ఫస్ట్ మ్యాచ్‌లోనే సింధు, శ్రీకాంత్ ఓటమి!
- Lifestyle
శరీర బరువును వేగంగా తగ్గించే ఈ పుదీనా టీని ఎలా తయారు చేయాలి??
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
సుశాంత్ అభిమానులతో లాభపడ్డ సడక్ 2.. ఆ విషయంలో అలియా ఫుల్ హ్యాపీ!
ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీలోనే కాకుండా దేశవ్యాప్తంగా సడక్ 2పై తీవ్ర స్థాయిలో విమర్శలు వెలువడుతున్నాయి. సుశాంత్ సింగ్ మరణ వార్తతో ఒక్కసారిగా నెపోటిజమ్ కామెంట్స్ ని ఎదుర్కొన్న వారే సినిమాలో ఎక్కువగా ఫోకస్ అవ్వడం సరికొత్త వివాదానికి దారి తీసింది. అసలే కరోనా కల్లోలంలో ఎలాగైనా సినిమాను డిజిటల్ వరల్డ్ లో హిట్ చేయాలని అనుకుంటున్న సడక్ 2 టీమ్ కి జనాలు ఒక్కసారిగా షాక్ ఇచ్చారు. అయితే ఒక విధంగా అది సినిమాకు కొంత ఆదాయాన్ని తెచ్చిపెడుతోంది.

అలియాపై ఘాటైన విమర్శలు
సుశాంత్ సింగ్ మరణానికి కారణం అలియా భట్, మహేష్ భట్ వంటి వారు కూడా ఒక కారణమని డైరెక్ట్ గా సోషల్ మీడియాలో కామెంట్స్ వస్తున్న విషయం తెలిసిందే. కంగనా రనౌత్ లాంటి వాళ్ళు కూడా తీవ్ర స్థాయిలో అసంతృప్తి వ్యక్తం చేయడంతో కెరీర్ లోనే మొదటిసారి అలియా ఘాటైన విమర్శలు ఎదుర్కొంటోంది. ఇక సడక్ 2 ట్రైలర్ ని ఇటీవల రిలీజ్ చేయగా ఏ స్థాయిలో డిస్ లైక్స్ వచ్చాయో స్పెషల్ గా చెప్పనవసరం లేదు.

11 మిలియన్ డిస్ లైక్స్
ఇప్పటికే సడక్ 2 ట్రైలర్ 11మిలియన్ డిస్ లైక్స్ తో ప్రపంచంలోనే అత్యంత డిస్ లైక్స్ పొందిన ట్రైలర్ గా రికార్డుల్లోకి ఎక్కింది. అయితే ట్రైలర్ ని రిలీజ్ చేసిన మొదటి రోజే సడక్ 2పై వివాదాలు ఎక్కువయ్యాయి. డిస్ లైక్స్ రావడంతో అదే ఎక్కువ ప్రచారాన్ని ఇచ్చింది. దీంతో తెలియని వారు కూడా ట్రైలర్ పై ఒక లుక్కేశారు.

ఆదాయం పెరుగుతోంది
డిస్ లైక్స్ ఎన్ని వచ్చాయా అనేది యూ ట్యూబ్ రెవెన్యూపై ఏ మాత్రం ఎఫెక్ట్ చూపించదని అందరికి తెలిసిన విషయమే. ఇక డిస్ లైక్ కొట్టడానికి వచ్చిన వారు కూడా ట్రైలర్ ని క్లిక్ చేయాలి కాబట్టి ఒక వ్యూవ్ ఇచ్చి మరీ డిస్ లైక్ కొడుతున్నారు. దీంతో ఆ వ్యూవ్స్ సంఖ్య 55మిలియన్స్ కి చేరింది. చూస్తుంటే ఇంకా పెరిగేలా ఉన్నాయని కూడా అర్ధమవుతోంది. దీంతో ఆదాయం కూడా పెరుగుతుంది.

ప్రచారం అయితే గట్టిగానే జరిగింది
మహేష్ భట్ 20ఏళ్ళ తరువాత సడక్ సినిమాకు సీక్వెల్ గా సిద్ధం చేసిన ఈ సినిమాకు ఒక విధంగా సుశాంత్ అభిమానులే పరోక్షంగా ప్రచారం ఎక్కువగా చేస్తున్నారనే కామెంట్స్ కూడా వస్తున్నాయి. ట్రైలర్ ని ఏ మాత్రం పట్టించుకోకుండా ఉంటే వ్యూవ్స్ ఆ స్థాయిలో వచ్చేవి కావు. కానీ సినిమాకు జరగాల్సిన ప్రచారం అయితే గట్టిగానే జరిగింది. ఇక ఫుల్ సినిమా హాట్ స్టార్ లో త్వరలో రిలీజ్ కానుంది. అక్కడ కూడా ఎక్కువ మంది సినిమాను చూసి నెగిటివ్ రివ్యూలు మరింత ఎక్కువగా ఇస్తారేమో అనే కామెంట్స్ వస్తున్నాయి. మరి సడక్ 2 ఇంకా ఎలాంటి విమర్శలు ఎదుర్కుంటుందో చూడాలి.