twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఉత్కంఠ రేపుతున్న సంజు.. కనీసం 240 కోట్లు రావాలి, లేకపోతే.. సంజయ్ దత్ టెర్రరిస్ట్ కాదా!

    |

    ప్రఖ్యాత బాలీవుడ్ దర్శకుడు రాజ్ కుమార్ హిరానీ దర్శకత్వంలో రూపొందిన చిత్రం సంజు. వివాదాస్పద నటుడు సంజయ్ దత్ జీవిత చరిత్ర ఆధారంగా ఈ చిత్రం రూపొందింది. సంజయ్ దత్ జీవితంలో అనేక వివాదాలు ఎదుర్కొన్నారు. ఆ అంశాలని ఈ చిత్రంలో రాజ్ కుమార్ హిరానీ ఎలా చూపించారు అనే ఉత్కంఠ సర్వత్రా నెలకొని ఉంది. స్టార్ హీరో రణబీర్ కపూర్ సంజయ్ దత్ పాత్రలో ఒదిగిపోయి నటించాడు. ఈ విషయం చిత్ర ట్రైలర్ చూస్తే అర్థం అవుతుంది. ఇక సినిమాలో ఈమేరకు విశ్వరూపం చూపించాడో చూడాలి. భారీ అంచనాల నడుమ ఈ చిత్రం శుక్రవారం విడుదలకు సిద్ధం అవుతోంది. ఈ చిత్ర ప్రీరిలీజ్ బిజినెస్ కూడా ఇప్పుడు ట్రేడ్ వర్గాల్లో ఆసక్తిగా మారింది.

    దేశం మొత్తం ఆసక్తిగా

    దేశం మొత్తం ఆసక్తిగా

    దేశం మొత్తం సంజు చిత్రం కోసం ఆసక్తిగా ఎందురుచూస్తున్నారు. సంజయ్ దత్ వివాద భరిత జీవితాన్ని దర్శకుడు ఎలా ఆవిష్కరించాడు, రణబీర్ కపూర్ ఎలా నటించాడు అనే ఆసక్తి సర్వత్రా నెలకొంది.

    Recommended Video

    Sanjay Dutt Talks About His Love Matter
    కనీవినీ ఎరుగని అంచనాలు

    కనీవినీ ఎరుగని అంచనాలు

    అమీర్ ఖాన్, రాజ్ కుమార్ హిరానీ కాంబోలో వచ్చిన పీకే చిత్రం ఏస్థాయిలో వసూళ్లు రాబట్టిందో అందరికి తెలిసిందే. వివాదాలతోనే ఈ చితం వందలాది కోట్లు పిండుకుంది. పీకే తరువాత రాజ్ కుమార్ హిరానీ దర్శకత్వం వహించిన చిత్రం సంజు నే కావడం విశేషం. రాజ్ కుమార్ హిరానీ, సంజయ్ దత్ బ్రాండ్ తోనే ఈ చిత్రంపై భారీగా అంచనాలు ఏర్పడ్డాయి. ఇక ట్రైలర్ ఆ అంచనాలని మరో స్థాయికి తీసుకుని వెళ్ళింది.

     ప్రీరిలీజ్ బిజినెస్

    ప్రీరిలీజ్ బిజినెస్

    ఈ చిత్రంపై ఉన్న అంచనాల కారణంగా ప్రీరిలీజ్ బిజినెస్ కూడా రికార్డు స్థాయిలో జరిగింది. సంజు చిత్ర ప్రీరిలీజ్ బిజినెస్ 240 కోట్లు అని టాక్. అంటే ఈ చిత్ర బయ్యర్లు సేఫ్ కావాలనే కనీసం 240 కోట్ల షేర్ రాబట్టాలి. సంజు చిత్రాన్ని 150 కోట్ల బడ్జెట్ తో నిర్మించారు.

     ఆ సత్తా ఉందా

    ఆ సత్తా ఉందా

    రణబీర్ కపూర్ బాలీవుడ్ లో స్టార్ హీరోనే. కానీ సల్మాన్ ఖాన్, అమిర్ ఖాన్ స్థాయిలో తొలిరోజే బాక్స్ ఆఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించేంత స్థాయి లేదు. కాబట్టి సినిమాకు వచ్చే టాక్ బట్టే ఈ చిత్ర వసూళ్లు ఆధారపడి ఉంటాయని ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

    ఆ అంశాలే కీలకం

    ఆ అంశాలే కీలకం

    సంజయ్ దత్ జీవితంలో చోటు చేసుకున్న వివాదాలే ఈ చిత్రంలో ఆసక్తికర అంశాలు అనడంలో సందేహం లేదు. జైలు జీవితం, డ్రగ్స్ కు బానిసం కావడం వంటి సంఘటనలని దర్శకుడు ఎంత తీవ్రంగా చూపించగలిగితే సినిమా అంత రంజుగా ఉంటుందనే అభిప్రాయం ఉంది.

    ముంబై పేలుళ్లు

    ముంబై పేలుళ్లు

    సంజయ్ దత్ స్టార్ గా వెలుగొందుతున్న సమయంలో అక్రమ ఆయుధాలు, ముంబై పేలుళ్లలో ప్రమేయం వంటి కేసులు అతడి జీవితాన్ని తీవ్రమైన కుదుపుకు గురిచేశాయి. ముంబై పేలుళ్లలో సంజయ్ దత్ ప్రమేయం ఉందంటూ రుజువులు దొరకడంతో కోర్టు అతడికి జైలు శిక్ష విధించింది.

    టెర్రరిస్ట్ కాదా

    టెర్రరిస్ట్ కాదా

    సంజు ట్రైలర్ లో దర్శకుడు ఓ డైలాగ్ పెట్టాడు. నేను పోకిరిని, కానీ టెర్రరిస్ట్ కాదు అనే డైలాగ్ చాలా ఆసక్తికరంగా ఉంది. సంజయ్ దత్ పై ఉన్న అభియోగాలని తోసిపుచ్చి వాటితో సంజయ్ దత్ కు సంబంధం లేదనే విషయాన్ని దర్శకుడు ఎలా చూపిస్తాడు అనేది కూడా కీలకమే.

    English summary
    All eyes on Raj Kumar Hirani's Sanju movie. It will collect atleast 240 cr
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X