ఆ లెక్కలు చూసి షాక్... ‘బాహుబలి 2’ రికార్డ్ తుస్సుమనేదా?
బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ తన కెరీర్లో ఎన్నో సూపర్ హిట్స్ అందించారు. వాటిలో 'అమర్ అక్బర్ ఆంటోనీ' లాంటి కల్ట్ మూవీ ఒకటి. అప్పట్లో బాక్సాఫీసు వద్ద సంచలన వసూళ్లు సాధించిన ఈ సినిమా 2017లో విడుదలైతే 'బాహుబలి-2' రికార్డులను సైతం వెనక్కి నెట్టేసేదని తాజాగా ఓ అభిమాని వ్యాఖ్యానించడంతో అమితాబ్ సైతం ఆశ్చర్యపోయారు.
1977లో విడుదలైన 'అమర్ అక్బర్ ఆంటోనీ' చిత్రం గురించి ఓ అభిమాని చేసిన ట్వీట్ బిగ్ బి షేర్ చేశారు. అతడు చెప్పిన దాని ప్రకారం... 42 సంవత్సరాల క్రితం ఈ చిత్రం రూ. 7.25 కోట్లు వసూలు చేసింది. ద్రవ్యోల్బణం ప్రకారం లెక్క వేస్తే ఆ కలెక్షన్ ఇపుడు 'బాహుబలి-2' వసూళ్లను సైతం వెనక్కి నెట్టేదట.

అప్పట్లో ఆ సినిమాను 3,62,50,000 మంది చూశారు
1977లో ‘అమర్ అక్బర్ ఆంటోనీ' విడుదలైన సమయంలో యావరేజ్ టిక్కెట్ రేటు రెండు రూపాయలు. అప్పట్లో ఈ సినిమాను 3,62,50,000 మంది చూశారు. 2017లో బాహుబలి-2 విడుదలైన సమయంలో టిక్కెట్ రేటే రూ. 150. ఈ రేటు ప్రకారం లెక్కవేస్తే... అమితాబ్ మూవీ ఇపుడు రిలీజ్ అయితే రూ. 543 కోట్లు వసూలు చేసేది.
అమితాబ్ ఆశ్చర్యం
2017లో విడుదలైన ‘బాహుబలి 2' చిత్రం హిందీ వెర్షన్ ఇండియాలో దాదాపు 510 కోట్లు వసూలు చేసింది. అభిమాని ‘అమర్ అక్బర్ ఆంటోనీ' గురించి ఈ లెక్కలన్నీ వేసి చూపడంతో అమితాబ్ బచ్చన్ సైతం ఆశ్చర్యపోయాడు.

‘అమర్ అక్బర్ ఆంటోనీ'
1977లొ విడుదలైన ‘అమర్ అక్బర్ ఆంటోనీ' ఆ సంవత్సరంలో బిగ్గెస్ట్ గ్రాస్ సాధించిన చిత్రంగా నిలిచింది. ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్, రిషి కపూర్, వినోద్ ఖన్నా, షబానా అజ్మీ, నీతూ కపూర్, ప్రాణ్, పర్వీన్ బాబీ తదితరులు నటించారు. మన్మోహన్ దేశాయ్ దర్శకత్వం వహించగా, ఖాదర్ ఖాన్ డైలాగులు అందించారు.

బాహుబలి 2
2015లో వచ్చిన ‘బాహుబలి' చిత్రానికి కొనసాగింపుగా 2017లో బాహుబలి 2 విడుదలైన సంగతి తెలిసిందే. రాజమౌళి దర్శకత్వం వహించిన ఈచిత్రంలో ప్రభాస్, రానా దగ్గుబాటి, అనుష్క శెట్టి, తమన్నా, సత్యరాజ్, నాజర్, రమ్యకృష్ణ ముఖ్య పాత్రలు పోషించారు. ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా రూ. 1800 కోట్లు వసూలు చేసి దంగల్ తర్వాత హయ్యెస్ట్ గ్రాస్ సాధించిన రెండో చిత్రంగా రికార్డల కెక్కింది.


Click it and Unblock the Notifications











