»   » అమితాబ్‌కు తీవ్ర అనారోగ్యం.. జోధ్‌పూర్‌కు వైద్యబృందం పరుగులు

అమితాబ్‌కు తీవ్ర అనారోగ్యం.. జోధ్‌పూర్‌కు వైద్యబృందం పరుగులు

Posted By:
Subscribe to Filmibeat Telugu
అమితాబ్‌కు తీవ్ర అనారోగ్యం.. జోధ్‌పూర్‌కు వైద్యబృందం పరుగులు

భారతీయ సినీ దిగ్గజం, బిగ్ బీ అమితాబ్ బచ్చన్ తీవ్ర అనారోగ్యానికి గురయ్యాడు. 75 ఏళ్ల బిగ్‌బీ వృద్ధ్యాప్యంతో కూడిన సమస్యలతో బాధపడుతున్నట్టు సమాచారం. అమితాబ్‌కు చికిత్సనందించేందుకు వైద్యబృందం హుటాహుటిన జోధ్‌పూర్‌కు చేరుకొన్నది. ప్రస్తుతం జోధ్‌పూర్‌లో థగ్స్ ఆఫ్ హిందూస్థాన్ చిత్ర షూటింగ్‌లో బిజీగా ఉన్నారు.

 వారం రోజులుగా షూటింగ్ బిజీ

వారం రోజులుగా షూటింగ్ బిజీ

గత ఆరు నెలలుగా అమితాబ్ బచ్చన్ థగ్స్ ఆఫ్ హిందూస్థాన్ షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. గత వారంరోజులుగా ఎక్కువ గంటలు షూటింగ్ కేటాయించడంతో అస్వస్థతకు గురైనట్టు తెలుస్తున్నది.

ముంబైకి తరలించే అవకాశం

ముంబైకి తరలించే అవకాశం

బిగ్‌బీ అనారోగ్యానికి కారణాలు తెలియరాలేదు. అయితే ఆయన ఆరోగ్యానికి అంత ముప్పేమీ లేదని వైద్యులు వెల్లడించినట్టు తెలుస్తున్నది. అనారోగ్యం తీవ్రత మరింత ఎక్కువైతే ముంబైకి తరలించేందుకు ఏర్పాట్లు చేయాలని కుటుంబ సభ్యులు నిర్ణయించినట్టు సమాచారం.

కూలీ షూటింగ్ సమయంలో

కూలీ షూటింగ్ సమయంలో

గతంలో కూలీ షూటింగ్ సందర్భంగా అమితాబ్ తీవ్ర ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. ఆ సమయంలో మృత్యువుతో పోరాడి విజయం సాధించారు. ఆ తర్వాత ఈ మధ్యకాలంలో కడుపులో నొప్పితో ముంబైలోని ఓ ప్రముఖ హాస్పిటల్‌లో చేరగా ఆయనకు చికిత్సనందించారు.

 నవంబర్ 7న రిలీజ్

నవంబర్ 7న రిలీజ్

థగ్స్ ఆఫ్ హిందూస్థాన్ షూటింగ్‌లో అమీర్ ఖాన్, ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణులతో ప్రస్తుతం బిగ్‌బీ ఉన్నట్టు తెలిసింది. కత్రినా కైఫ్, ఫాతీమా సనా షేక్ నటిస్తున్న ఈ చిత్రం నవంబర్ 7న రిలీజ్ కానున్నది.

English summary
Amitabh Bachchan has fallen ill on the sets of Thugs of Hindostan. The 75-year-old actor complained of uneasiness after which a team of doctors was rushed to Jodhpur to tend to the megastar. For the last six months, Big B has been rigorously shooting for Thugs of Hindostan, and reports suggest that the long working hours might have taken a toll on his health.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu