అమితాబ్ హెల్త్ అప్‌డేట్.. అర్ధరాత్రి బిగ్‌బీ ట్వీట్ చేసి..

సూపర్‌స్టార్ అమితాబ్ బచ్చన్ కరోనావైరస్ పాజిటివ్‌తో బాధపడుతూ ముంబైలోని నానావతి హాస్పిటల్‌లో చికిత్సపొందుతున్న విషయం తెలిసిందే. బిగ్‌బీ తర్వగా కోలుకోవాలని సినీ ప్రముఖులు, అభిమానులు, సన్నిహితులు ప్రార్థిస్తున్న సంగతి తెలిసిందే. అయితే కరోనా సోకిన సమయంలో మనోధైర్యంతో అమితాబ్ ఉంటూ.. ప్రతీ రోజు నెటిజన్లు, అభిమానులు, సన్నిహితులతో ట్వీట్ల ద్వారా టచ్‌లో ఉంటున్నారు. గురువారం అర్ధరాత్రి తన ఆరోగ్యం గురించి ట్వీట్ చేసి తెలిపారు. అలాగే తన క్షేమాన్ని కోరిన ప్రతీ ఒక్కరికి ధన్యవాదాలు అంటూ ట్వీట్‌లో పేర్కొన్నారు.

నా ఆరోగ్యం కుదుట పడాలని మీరందరూ ప్రార్థనలు చేసినందుకు ధన్యవాదాలు. చాలా మంది నాకు ఎస్సెమ్మెస్, వాట్సాప్, ఇన్స్‌టాగ్రామ్, బ్లాగ్స్‌తోపాటు సోషల్ మీడియా యాప్స్ ద్వారా నాకు సందేశాలు పంపారు. అందుకు నేను రుణం ఎలా తీర్చుకోవాలో అర్థం కావడం లేదు. హాస్పిటల్ నిబంధనలు అతిక్రమించి మరింత సమచారాన్ని ఇవ్వలేకపోతున్నాను. మీ ప్రేమకు ధన్యవాదాలు అంటూ ట్వీట్ చేశారు.

Amitabh Bachchan Health Update: Big B Tweets from Nanavati Hospital

అమితాబ్ బచ్చన్, ఆయన కుమారుడు అభిషేక్ బచ్చన్ ఇద్దరూ కరోనావైరస్ బారిన పడటంతో జూలై 11వ తేదీ శనివారం రాత్రి నానావతి హాస్పిటల్‌లో చేరారు. అలాగే కోవిడ్ 19 బారిన పడిన ఐశ్వర్యరాయ్ బచ్చన్, ఆరాధ్య బచ్చన్ సొంత నివాసంలోనే క్వారంటైన్‌లో ఉన్నారు. జయబచ్చన్‌కు కరోనా నెగిటివ్ అని రావడంతో అభిమానులకు ఉపశమనం లభించింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X