»   » తను శ్రీ దత్తా, నానా వివాదంపై బిగ్‌బీ, అమీర్ ఖాన్ షాకింగ్ కామెంట్స్

తను శ్రీ దత్తా, నానా వివాదంపై బిగ్‌బీ, అమీర్ ఖాన్ షాకింగ్ కామెంట్స్

Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  బాలీవుడ్ చిత్రం హర్న్ ఓకే ప్లీజ్ సినిమా షూటింగ్ సమయంలో విలక్షణ నటుడు నానా పాటేకర్ తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని నటి తనుశ్రీ దత్తా ఆరోపణలు చేయడం హిందీ చిత్ర పరిశ్రమలో ప్రకంపనలు రేపాయి. ఆ సందర్భంలో సెట్లో నాపై ఉద్రేకపూర్వకంగా ప్రవర్తించారు. నన్ను అటూ ఇటూ తోస్తూ అసభ్యంగా ప్రవర్తించారు. నా గోడును ఎవరూ పట్టించుకోలేదు. నాపై చిత్రీకరించే సోలో సాంగ్‌లో తనతో అతిసన్నిహితమైన స్టెప్పులు వేయాలని బలవంత పెట్టారు. చెప్పలేని విధంగా వేధింపులకు పాల్పడ్డారు అని తను శ్రీ దత్తా కామెంట్ చేశారు.

  ఒళ్లు గగుర్బొడిచే విన్యాసాలు: 'థగ్స్ ఆఫ్ హిందూస్తాన్' అఫీషియల్ ట్రైలర్

  బాలీవుడ్‌లో ఈ వివాదం చర్చనీయాంశమైన నేపథ్యంలో థగ్స్ ఆఫ్ హిందూస్తాన్ ట్రైలర్ రిలీజ్ సందర్భంగా అమితాబ్‌ను స్పందించాల్సిందిగా కోరగా ఆయన షాకింగ్ సమాధానం ఇచ్చారు. నేను తను శ్రీ దత్తాను కాదు. అంతకంటే నానా పాటేకర్‌నూ కాదు అని బిగ్‌బీ మీడియాకు షాకిచ్చారు.

  Amitabh Bachchan on Tanushree Dutta and Nana Patekar Controversy

  అమీర్ ఖాన్‌ను స్పందించమని కోరగా.. ఆ వివాదం గురించి పూర్తిగా తెలియకుండా నేను మాట్లాడటం సరికాదు. ఏదో కామెంట్ చేస్తే బాగుండదు. ఇలాంటి వివాదం చోటుచేసుకోవడం మాత్రం ఓ విషాదమే. ఒకవేళ తనుశ్రీ దత్తా ఆరోపణల్లో నిజముందా అనే విషయాన్ని మీడియా లేదా ఇతరులు తేల్చాల్సిందే అని చెప్పారు. వారి అంతర్గత విషయాల్లో మనం జోక్యం చేసుకోవడం బాగుండదు అని అమీర్ ఖాన్ అన్నారు.

  ఈ వివాదంలో కొరియోగ్రాఫర్ గణేష్ ఆచార్య స్పందించారు. నానా పాటేకర్ అలా చేయలేదు అని ఆయనకు మద్దతుగా నిలిచారు. అయితే గణేష్ ఆచార్య చెప్పేవన్నీ అబద్ధాలే. నా వల్లే గణేష్‌కు అవకాశాలు వచ్చాయి. ఇప్పుడు నాకు వెన్నుపోటు పొడిచే విధంగా మాట్లాడుతున్నాడు అని తను శ్రీ మండిపడింది.

  English summary
  Tanushree Dutta recently opened up about being harassed by Nana Patekar on the sets of the 2008 film Horn OK Please. She revealed that Nana Patekar harassed her while shooting for an item song for the film. Big B gave a very shocking reaction to this and said, "Neither my name is Tanushree nor Nana Patekar."
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more