For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Aryan Khan ఎన్సీబీ విచారణకు ముఖం చాటేసిన అనన్య పాండే.. అసలు సంగతి ఇదా?

  |

  ముంబై క్రూయిజ్ డ్రగ్స్ కేసులో బాలీవుడ్ నటి అనన్య పాండే మూడో రోజైన సోమవారం నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్‌సిబి) కార్యాలయానికి చేరుకోవాల్సి ఉంది, కానీ ఆమె హాజరు కాలేదు. డ్రగ్స్ అమ్మకందారులు , అంతర్జాతీయ డ్రగ్స్ స్మగ్లింగ్ కు సంబంధించి ఆమెకు ఏం తెలుసు అనే విషయాలు తెలుసుకోవడానికి నార్కోటిక్స్ బ్యూరో అధికారులు ప్రయత్నిస్తున్నారు. అయితే ఈరోజు ఆమె విచారణకు డుమ్మా కొట్టింది. ఆ వివరాల్లోకి వెళితే

   కీలక సమాచారం రాబడతారని

  కీలక సమాచారం రాబడతారని

  బాలీవుడ్ నటి అనన్య పాండే ప్రస్తుతం NCB యొక్క రాడార్‌లో ఉన్నారు. ఆర్యన్ ఖాన్ ఫోన్ నుంచి వచ్చిన వాట్సాప్ చాట్ ఆధారంగా అనన్య పాండేని ఎన్‌సీబీ విచారణ ​చేస్తోంది. అయితే కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల, అనన్య పాండే ఎన్‌సిబి కార్యాలయానికి ఈరోజు రాలేరని సమాచారం ఇచ్చారట. ఈ రోజు మూడవ రోజు కావడంతో ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసులో ఎన్‌సిబి అనన్య నుండి కీలక సమాచారం రాబడతారని భావించారు.

  వ్యక్తిగత కమిట్మెంట్స్ కారణంగా

  వ్యక్తిగత కమిట్మెంట్స్ కారణంగా

  కానీ కొన్ని వ్యక్తిగత కమిట్మెంట్స్ కారణంగా అనన్య పాండే NCBకి ఈరోజు రాలేనని మరో డేట్ ఇవ్వాలని డిమాండ్ చేసిందని అంటున్నారు. నటి యొక్క ఈ అభ్యర్థనను NCB అంగీకరించిందని చెబుతున్నారు. ఈ సందర్భంలో, అనన్య పాండేని మరో రోజున విచారణ కోసం మళ్లీ పిలవనున్నారు. వారిద్దరూ మూడుసార్లు డ్రగ్స్ గురించి మాట్లాడుకున్నారని ఎన్‌సిబి ఆరోపించింది. ఈ సందర్భంలో, NCB అనన్య పాండేను రెండు రోజుల్లో 6 గంటల పాటు విచారించింది. అయినా సమాధానం రాకపోవడంతో అనన్యను ఈ రోజు మూడో రోజు NCB కార్యాలయానికి పిలిచారు.

  కాంటాక్ట్ కూడా షేర్

  కాంటాక్ట్ కూడా షేర్

  అనన్య పరిస్థితి కొంచెం ఇబ్బంది కరంగానే ఉందని అంటున్నారు. ఎందుకంటే అయితే తన చిన్ననాటి స్నేహితుడికి మద్దతివ్వాలని, లేదంటే న్యాయపోరాటానికి సిద్ధంగా ఉండాలని చెబుతున్నారు. విచారణలో ప్రస్తావనకు వచ్చిన విషయాల ప్రకారం అనన్య పాండే కూడా ఇబ్బందుల్లో చిక్కుకోవచ్చని తెలుస్తోంది. నివేదికల ప్రకారం, ఆర్యన్ మరియు అనన్య డ్రగ్స్ గురించి మూడు సార్లు మాట్లాడడమే కాకుండా, డ్రగ్స్ పెడ్లర్ కాంటాక్ట్ కూడా షేర్ చేసుకున్నారు.

  చాట్‌లను కూడా డిలీట్ చేసి

  చాట్‌లను కూడా డిలీట్ చేసి

  ఇక అనన్య అనేక వాట్సాప్ చాట్‌లను కూడా డిలీట్ చేసినట్టు ఏజెన్సీ అనుమానిస్తోంది. అనన్యకు చెందిన రెండు మొబైల్ ఫోన్లు, ల్యాప్‌టాప్ సహా 7 ఎలక్ట్రానిక్ గాడ్జెట్‌లను ఎన్‌సీబీ ఫోరెన్సిక్ పరీక్షకు పంపడానికి కారణం ఇదేనని అంటున్నారు. NCB మూలాల ప్రకారం ప్రయత్నించాలి , అని ఆర్యన్‌తో చేసిన చాట్‌లో అనన్య పాండే పేర్కొన్నట్టు చెబుతున్నారు. తాను ఇప్పటికే ట్రై చేశానని మళ్లీ చేస్తానని చెప్పింది.

   సిగరెట్ గురించే

  సిగరెట్ గురించే

  అలా ఆమె చెప్పిన సమయాన ఆర్యన్ ఆమెకు డ్రగ్స్ వ్యాపారి నెంబర్ షేర్ చేశాడు. అయితే, మీకు ఎవరైనా పెడ్లర్ తెలుసా అని సమీర్ వాంఖడే ఆమెను అడిగినప్పుడు, అనన్య లేదని చెప్పడమే కాక ఎన్‌సిబికి చాట్‌లో చెప్పింది జోక్ అని చెప్పింది. అనన్య చెబుతున్న దాని ప్రకారం, ఆమె ఎప్పుడూ డ్రగ్స్ తీసుకోలేదు. ఆర్యన్‌తో ఆమె జరిపిన సంభాషణ కూడా సిగరెట్ గురించేనని అనన్య చెబుతోంది.

  అనన్య పాండే ఖండన

  అనన్య పాండే ఖండన


  అనన్య పాండేని ఎన్‌సిబి పిలవడానికి ముందు అనుమానాస్పద లావాదేవీల ద్వారా డబ్బు చేతులు మరినట్టి గుర్తించారు. అందుకే శుక్రవారం 4 గంటల పాటు జరిగిన విచారణలో అనన్యను 'ఆర్థిక లావాదేవీలు' అంటే అనుమానాస్పద నగదు లావాదేవీల గురించి కూడా ప్రశ్నించారు. అయితే డ్రగ్స్‌కు సంబంధించిన ఆరోపణలను అనన్య పాండే ఖండించింది. తాను ఎప్పుడూ డ్రగ్స్ తీసుకోలేదని, ఆర్యన్ ఖాన్ కోసం లేదా ఎవరి కోసం డ్రగ్స్ వ్యాపారిని సంప్రదించలేదని అనన్య చెప్పింది.

  అనన్యకు తెలుసు?

  అనన్యకు తెలుసు?

  అయితే, ఆర్యన్‌కు డ్రగ్స్ డెలివరీ చేసే వ్యక్తి అనన్యకు తెలుసునని, ఆమె ఈ విషయాన్ని అధికారులకు కూడా తెలియజేసిందని కూడా మరో ప్రచారం జరుఇతోంది. ఇక అనన్య పాండేను రెండవ రోజు శుక్రవారం విచారించారు, అయితే ఆమె 3 గంటలు ఆలస్యంగా చేరుకుంది. ఈ ఆలస్యంపై, NCB కూడా అనన్య పాండేని మందలించిందని, 'ఇది మీ ప్రొడక్షన్ హౌస్ కాదు, ఇది సెంట్రల్ ఏజెన్సీ కార్యాలయం, మిమ్మల్ని పిలిచిన సమయానికి చేరుకోవాలని మందలించినట్టు చెబుతున్నారు.,

  Shahrukh Khan కి టఫ్ టైమ్.. ఉచ్చులో Ananya Pandey | King Khan ఆవేదన || Filmibeat Telugu
   లైగర్ షూటింగ్ లో

  లైగర్ షూటింగ్ లో

  అయితే పర్సనల్ కమిట్మెంట్ అని విచారణకు ఎగ్గొట్టిన ఆమె ఈ రోజు ముంబైలో లైగర్ షూటింగ్ లో పాల్గొన్నట్లు సమాచారం. 25వ తేదీ నుంచి అంటే ఈ రోజు నుంచి లైగర్ టీమ్ ముంబైలో షూటింగ్ ప్రారంభించిందని ఆమె షూట్ లో పాల్గొనడం కోసమే విచారణకు రాలేదని అంటున్నారు. రొమాంటిక్ సినిమా ప్రమోషన్స్ లో బిజీబిజీగా గడిపిన పూరీ-ఛార్మీలు ముంబై వెళ్ళడం కూడా దీనికి ఊతం ఇస్తోంది.

  English summary
  Ananya Panday Skips NCB questioning In Drugs Case Today.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X