For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  పెళ్ళికి ముందు 75మంది మహిళలతో, ఇంత రసికుడా.. భార్యతో పూసగుచ్చినట్లు చెప్పాడు!

  |
  Angad Bedi Talks About His Ex-Girlfriends With Neha Dhupia

  బాలీవుడ్ హీరో అంగద్ బేడీ, నేహా ధూపియా జంట బాలీవుడ్ లో ఒక సంచలనం. గుట్టు చప్పుడు కాకుండా ఈ ఏడాది వివాహం చేసుకున్న వీరిద్దరూ ఆ తరువాత తాపీగా మా ఇద్దరికీ పెళ్ళైపోయిందంటూ స్వీట్ షాక్ ఇచ్చారు. అంగడి బేడీ కంటే నేహా దుపియా మూడేళ్లు వయసులో పెద్ద. అయినా ఇప్పుడు బాలీవుడ్ లో ఇది పెద్ద విషయం కాదు. కేవలం కుటుంబ సభ్యుల మధ్య మాత్రమే అంగద్ బేడీ, నేహా ధూపియా వివాహం జరిగింది. అంగడి బేడీ బాలీవుడ్ లో నటుడిగా రాణిస్తుంటే. నేహా ధూపియా టీవీ షోలతో దూసుకుపోతోంది. నేహా ధూపియా నిర్వహిస్తున్న నో ఫిల్టర్ నేహా షోకు అంగద్ బేడీ అతిధిగా హాజరయ్యాడు.

  భార్యతో అన్ని విషయాలు

  భార్యతో అన్ని విషయాలు

  ఈ షోలో అంగద్ బేడీ తన భార్యతో ఎలాంటి దాపరికం లేకుండా అన్ని విషయాలు చర్చించాడు. తన గత జీవితంలో జరిగిన సంగతులన్నీ నేహా దుపియాతో చర్చించాడు. ఈ షోలోఅంగద్ బేడీ చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారుతున్నాయి. ఈ షోకి సంబంధించిన ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

  పెళ్ళికి ముందే గర్భవతి

  పెళ్ళికి ముందే గర్భవతి

  అంగద్ బేడీ, నేహాధూపియా వివాహానికి ముందు నుంచే డేటింగ్ లో ఉన్నారు. నేహా ధూపియా మాట్లాడుతూ.. తామిద్దరం పెళ్లి చేసుకునే సమయానికే తాను గర్భవతిని అనే విషయాన్ని రివీల్ చేసింది. అందుకే హడావిడిగా వీరిద్దరి పెళ్లి జరిగిపోయింది. నేహా ధూపియా తన భర్త గత ఎఫైర్ గురించి ప్రస్తావించగా అంగద్ ఆశ్ఛర్యపోయాడు. పూసగుచ్చినట్లు తన మాజీ ప్రియురాలి గురించి వివరించడం విశేషం.

   75 మందితో డేటింగ్

  75 మందితో డేటింగ్


  తాను వివాహానికి ముందు 75 మంది మహిళలతో డేటింగ్ చేసినట్లు అంగడి బేడీ సంచలన విషయం ప్రస్తావించాడు. నువ్వు ఇప్పటి వరకు ఎంతమందితో డేటింగ్ చేశావు అని నేహా ధూపియా ప్రశ్నించగా.. అంగద్ బేడీ 75 అంటూ తడుముకోకుండా సమాధానం ఇచ్చాడు. నీ మాజీ గర్ల్ ఫ్రెండ్ నిన్ను బార్ లో ఒంటరిగా వదిలేసి వెళ్లిపోయిందటగా అని నేహా అడగగానే అంగద్ ఆశ్చర్యపోయాడు. అసలు ఈ విషయం నీకు ఎలా తెలుసు అంటూ షాక్ కి గురయ్యాడు.

  బర్త్ డే పార్టీలో

  బర్త్ డే పార్టీలో


  తన మాజీ ప్రియురాలితో జరిగిన సంగతులని అంగద్ ఇలా వివరించాడు. ఆమె నాకన్నా మూడేళ్లు పెద్దది. ఆమె 30వ బర్త్ డే పార్టీ సందర్భంగా న్యూయార్క్ లోని ఓ బార్ కు వెళ్లాం. ఆమె కంట్రోల్ లో ఉండలేనంతగా తాగేసింది. ఉన్నపళంగా వెళుతున్నటూ చెప్పి నన్ను అక్కడే వదిలేసి వెళ్ళిపోయింది. నా వాలెట్, మొబైల్ అన్ని ఆమె బ్యాగులోనే ఉండిపోయాయి. ఏం చేయాలో నాకు దిక్కుతోచలేదు.

   ఫ్రెండ్స్ సాయంతో

  ఫ్రెండ్స్ సాయంతో

  బార్ లో నా స్నేహితులు కనిపించారు కాబట్టి సరిపోయింది. లేకుంటే చాలా ఇబ్బంది పడేవాడిని. ఆ ఏరియా గురించి కూడా నాకు తెలియదు. న స్నేహితుల సాయంతో ఆమె వద్దకు వెళ్లగలిగాను. పట్టరానికోపంతో లగేజ్ సర్దుకుని బయలుదేరాను. అప్పటికి మద్యం మత్తునుంచి బయటకు వచ్చిన ఆమె నన్ను అడ్డుకుంది. ఇక్కడకు వెకేషన్ కోసం వచ్చాం. మధ్యలో వెళ్ళిపోతే ఖర్చుచేసిన డబ్బు మొత్తం వృథా అవుతుందని చెప్పింది. దానికి ఇక ఇందాక తప్పలేదు అని అంగద్ బేడీ తెలిపాడు.

  వేరే అమ్మాయిలతో ఎంజాయ్ చేశా

  వేరే అమ్మాయిలతో ఎంజాయ్ చేశా

  మరుసటిరోజు వెకేషన్ కోసం మియామి వెళ్లాం. అక్కడ కూడా మా మధ్య గొడవ జరిగింది. తన గదిలోనుంచి వెళ్లిపొమ్మని చెప్పింది. నీ రూమ్ లో లేకుండా నేను ఇంకా సంతోషంగా ఉంటానని చెప్పి బయటకు వచ్చేశా. వేరే అమ్మాయిలతో బాగా ఎంజాయ్ చేశా అంటూ అంగద్ బేడీ తన గత రాసలీలలన్నీ భార్యకు పూసగుచ్చినట్లు వివరించాడు.

  English summary
  Angad Bedi was left stranded by his girlfriend in New York with no money, passport. Angad Bedi spilled the beans about her past relationships
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X