For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Alia Bhatt నువ్వే విషం అని మళ్ళీ జనాలను తాగమంటే ఎలా.. RRR బ్యూటీపై మరో కాంట్రవర్సీ?

  |

  ఇటీవల కాలంలో సినీ తారల కు సంబంధించిన కొన్ని కమర్షియల్ యాడ్స్ వివాదాలకు దారి తీస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా బాలీవుడ్ అగ్ర హీరోలు కొనసాగిస్తున్న పాన్ మసాలా యాడ్స్ పై తీవ్రస్థాయిలో విమర్శలు వచ్చాయి. సోషల్ మీడియా ప్రభావం తో దెబ్బకు కొంతమంది హీరోలు అలాంటి యాడ్స్ లో నటించడానికి కూడా ఒప్పుకోవడం లేదు. ఎన్ని కోట్లు ఇస్తామంటున్నా కూడా మేము చేయలేము అంటూ కొంతమంది సౌత్ హీరోలు కూడా రిజెక్ట్ చేస్తున్నారు. అందులో అల్లు అర్జున్, KGF హీరో యష్ కూడా ఉన్నాడు. అయితే బాలీవుడ్ ఇండస్ట్రీలో మాత్రం అవేమీ పట్టించుకోకుండా కొంతమంది సెలబ్రిటీలు అదే పనిగా విషపూరిత పదార్థాలకు జనాలు ఆకర్షితులు అయ్యేలా ప్రమోట్ చేస్తున్నట్లుగా తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు.

  ఇక రీసెంట్ గా మరోసారి ఆ వివాదంలోకి అలియా భట్ కూడా చేరడంతో విషయం హాట్ టాపిక్ గా మారింది. బాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు అందుకున్న ఆలియా భట్ ప్రస్తుతం తెలుగు సినిమాల్లో కూడా నటించడానికి ఆసక్తి చూపిస్తోంది. ఇటీవల విడుదలైన RRR సినిమాతో ఆమె రేంజ్ కూడా మరింత పెరిగిపోయింది. అంతకుముందు వచ్చిన సినిమాలు ఆమెకు ఊహించని విధంగా చేదు అనుభవాలను మిగిల్చాయి. అయితే RRR సినిమా సమయానికి మాత్రం అందరూ వాటిని మర్చిపోయారు.

  Another controversial issue on Alia bhatt comercial advertisement

  ఇక మళ్లీ ఎప్పటిలానే ఆమె కెరీర్ కొనసాగుతుంది అని అనుకున్నారు. కానీ అలియా బట్ట దురదృష్టం ఏమిటో గాని నిత్యం ఏదో ఒక కాంట్రవర్సీ ఆమె చుట్టూ తిరుగుతుంది. ఇక ప్రస్తుతం ఆమెకు సంబంధించిన ఒక వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. ఆమె గతంలో ఒక ఇంటర్వ్యూలో కాఫీ తాగను అని ముఖ్యంగా చక్కెర కలిపిన కాఫీ తాగితే చాలా విషం ఎక్కినట్లే అని కేవలం పండ్ల నుంచి చక్కెర తీసుకోవడం మేలు అని ఆమె చెప్పారు.

  అయితే చక్కెర ఒక విషయం అని చెప్పిన ఆలియాభట్ అలాంటి చక్కెర తోనే తయారు చేసిన ఒక ప్రముఖ కంపెనీ ఫ్రూట్ జ్యూస్ ను ప్రమోట్ చేస్తోంది. దీంతో గతంలో ఆలియా భట్ చెప్పిన మాటలను గుర్తు చేస్తూ వీడియో తో సహా ఆమెను ట్రోల్ చేస్తున్నారు. విషం అని నువ్వే చెప్పి మళ్ళీ అదే తాగాలి అని ప్రమోట్ చేస్తున్నావు అంటే ఇది కేవలం డబ్బు కోసమే జనాల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నవా? అని నెటిజన్లు తీవ్రస్థాయిలో అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు.

  ఇక ఆలియా భట్ మాత్రం ఎలాంటి వివాదాలు తెరపైకి వచ్చిన కూడా వాటిపై పెద్దగా స్పందించడం లేదు. వీలైనంతవరకు తన పని తాను చేసుకుంటూ సైలెంట్ గా ముందుకు వెళ్ళిపోతుంది. ఇక ప్రస్తుతం ఈ బ్యూటీ బాలీవుడ్ ఇండస్ట్రీలో కొన్ని సినిమాలు చేస్తున్న విషయం తెలిసిందే. అలాగే ఎన్టీఆర్ కొరటాల శివ కాంబినేషన్ లో రాబోయే సినిమాలో కూడా మెయిన్ హీరోయిన్ గా నటించబోతున్నట్లు సమాచారం.

  English summary
  Another controversial issue on Alia bhatt comercial advertisement
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X
  Desktop Bottom Promotion