వివాదంలో తాప్సీ నటించిన ‘ముల్క్’... దర్శకుడి ఓపెన్ లెటర్!
రిషి కపూర్, ప్రీతీక్ బబ్బర్, రజత్ కపూర్, తాప్సీ ముఖ్యపాత్రల్లో అనుభవ్ సిన్హా దర్శకత్వంలో తెరకెక్కిన బాలీవుడ్ మూవీ 'ముల్క్' వివాదంలో ఇరుక్కుంది. నేర చరిత గల ముస్లిం కుటుంబాలకు సపోర్టుగా ఈ సినిమా ఉందని, దీని వెనక ఎవరు ఉన్నారో? అంటూ కొందరు సోషల్ మీడియాలో ట్రోల్ చేయడం ప్రారంభించడంతో దర్శకుడు అనుభవ్ సిన్హా ఓపెన్ లెటర్ రాశారు.
''మిమ్మల్ని, మీ ఆలోచనా విధానం చూస్తుంటే జాలేస్తోంది. మీ చెత్త ట్రోలింగ్ వల్ల ఎంతో మంది వ్యక్తుల కెరీర్లు, జీవితాలు ప్రభావితమవుతాయని మీరు గుర్తించడం లేదు, ఇష్టం వచ్చినట్లు కామెంట్లు చేయడం ఇకనైనా ఆపండి అంటూ తన ఓపెన్ లెటర్లో అనుభవ్ సిన్హా ఘాటుగా స్పందించారు.
''ముల్క్' సినిమాకు దావూద్ ఇబ్రహీం గానీ, కాంగ్రెస్ పార్టీగానీ, లేదా ఆరెస్సెస్ గానీ డబ్బులు సమకూర్చడం లేదని.... ఈ సినిమా ఎవరూ లేరని, దీపఖ్ ముకుత్, ఆయన తండ్రి కమల్ ముకుత్‌లు ఈ సినిమాను నిర్మిస్తున్నారు'' అని ఈ సందర్భంగా అనుభవ్ స్పష్టం చేశారు.
సినిమా కథ విషయానికొస్తే... సమాజంలో ఎంతో మర్యాదగా జీవించే ముస్లిం కుటుంబంపై దేశ ద్రోహులు అనే ముద్ర పడుతుంది. చుట్టుపక్కల ఉండేవారు అనే మాటలతో పాటు మీడియా అత్యుత్సాహంతో ఆ కుటుంబం మరింత కృంగిపోతుంది. వీరికి ఓ లాయర్ అండగా నిలుస్తుంది. ఆ తర్వాత ఏం జరిగింది? అనేది కథాంశంతో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఆగస్టు 3న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.



Click it and Unblock the Notifications











