ఒక్కసారిగా మూగబోయాను.. రిషి కపూర్ చివరి వీడియో ఇదే.. భావోద్వేగానికి గురైన అనుపమ్ ఖేర్

బాలీవుడ్‌లో ప్రముఖ నటుడు రిషి కపూర్ క్యాన్సర్ వ్యాధితో బాధపడుతూ ముంబైలో మరణించారు. ఇర్ఫాన్ ఖాన్ మరణ వార్త నుంచి ఇంకా అందరూ బయట పడక ముందే మరో దిగ్గజం నేలరాలింది. గత రెండేళ్లుగా ల్యుకేమియాపై పోరాడుతూ వచ్చిన రిషి కపూర్.. ఈ ఉదయం 8.45కి మృతి చెందారు. ఈ వార్త విన్ని భారత సినీ లోకం దిగ్భ్రాంతికిలోనైంది. ఎంతో మంది సినీ ప్రముఖులు రిషి కపూర్ మరణ వార్త విని సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నారు.

 సెలెబ్రిటీల స్పందన..

సెలెబ్రిటీల స్పందన..

రిషి కపూర్ మరణంపై యావత్ భారత సినీ పరిశ్రమ స్పందిస్తోంది. అన్ని భాషల నటీనటులు సోషల్ మీడియా వేదికగా సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే అమితాబ్, షారుక్, ఆమిర్, సల్మన్‌ వంటి వారు స్పందించగా.. తెలుగు నుంచి మహేష్ బాబు, రామ్ చరణ్, ఎన్టీఆర్, బాలకృష్ణ వంటివారు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

ఎన్నో చిత్రాల్లో కలిసి మెలిసి..

రిషి కపూర్‌తో ఎన్నో చిత్రాల్లో కలిసి నటించాడు అనుపమ్ ఖేర్. వీరిద్దరి కామెడీని ప్రేక్షకులు తెగ ఎంజాయ్ చేసేవారు. చాంద్నీ, యే హై జల్వా, జబ్ తక్ హై జాన్, షేషాంగ్ వంటి ఎన్నో చిత్రాల్లో కలిసి నటించిన తన ప్రియమైన నటుడి మరణ వార్త విని కుంగిపోయాడు అనుపమ్ ఖేర్. ఈ మేరకు సోషల్ మీడియాలో స్పందిస్తూ ఎమోషనల్ అయ్యాడు.

మరణవార్త విని మూగబోయాను..

మరణవార్త విని మూగబోయాను..

నా ప్రియమిత్రడు రిషి కపూర్ మరణ వార్త విని ఒక్కసారిగా మూగబోయను. ఎన్నో చిత్రాల్లో కలిసి నటించాము. ఎంతో మంచి మనిషి మరణించారు. రిషి కపూర్ నిరంతం ఉత్సాహంగా ఉంటారు. ఎంతో గట్టివారు. ఎప్పడూ పిల్లాడి మాదిరిగానే నేర్చుకోవాలనే తపనతో ఉంటారు.

Recommended Video

#RishiKapoor : Celebrities And Politicians Pay Tribute To Rishi Kapoor
అలాంటి వారిని మళ్లీ చూడలేం..

అలాంటి వారిని మళ్లీ చూడలేం..

అలాంటి రిషి కపూర్‌ను నేనేప్పుడూ చూడలేదు. మళ్లీ ఇంకా ఎన్నడూ చూడలేం. అలాంటి వారిని దేవుడు తీసుకెళ్లిపోయాడు. ఎంతో బాధగా ఉంది.. న్యూయార్క్‌లో ఉన్నప్పుడు ఆయనతో ఉన్న చివరి వీడియో ఇదే. అప్పుడు కూడా ఎంతో హుషారుగా ఉన్నారు.,చింటు జీ మీరు ఎల్లప్పుడూ మాతో ఉంటారు. హలో! హలో! హలో! ఓం శాంతి అంటూ వీడియోను షేర్ చేశాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X